- Home
- Entertainment
- OTT: చివరి 20 నిమిషాలు షాక్‌కి గురిచేస్తుంది... త్రిష నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
OTT: చివరి 20 నిమిషాలు షాక్‌కి గురిచేస్తుంది... త్రిష నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
OTT: ఓ జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న హత్యల వెనకున్న మిస్టరీని ఛేదించే ఓ సినిమా గురించి ఈ ఫొటో గ్యాలరీలో తెలుసుకుందాం. ఇందులో త్రిష ప్రధాన పాత్రలో నటించారు.
15

Image Credit : Instagram
నిజ జీవిత ఘటనల ఆధారంగా..
నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసే సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, నిజమైన క్రైమ్ కేసుల ఆధారంగా తీసిన థ్రిల్లర్లకు ఓటీటీలో, థియేటర్లలో ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అలాంటి ఓ సినిమా గురించే ఇప్పుడు చూద్దాం. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా ఏంటో తెలుసా?
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : our own
జాతీయ రహదారిపై జరిగిన సంఘటనల ఆధారంగా..
ఈ సినిమా పేరు ‘ది రోడ్’. తమిళనాడులోని ఓ జాతీయ రహదారిపై జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. మొదట్లో యాక్సిడెంట్లుగా కనిపించే ఈ ఘటనల వెనుక ఓ భయంకరమైన నిజం దాగి ఉందని తర్వాత తెలుస్తుంది. ఈ మిస్టరీ ఘటనల్లో తన కుటుంబాన్ని కోల్పోయిన హీరోయిన్, నిజాన్ని కనిపెట్టడానికి రంగంలోకి దిగుతుంది.
35
Image Credit : our own
మిస్టరీని త్రిష ఎలా ఛేదించింది?
విచారణ సాగుతున్న కొద్దీ, తన కుటుంబం మరణం సాధారణ ప్రమాదం కాదని, పక్కా ప్లాన్‌తో చేసిన కుట్ర అని హీరోయిన్‌కు తెలుస్తుంది. ఈ వరుస హత్యలకు కారణం ఎవరు? వాళ్ల ఉద్దేశం ఏంటి? హీరోయిన్ ఈ మిస్టరీని ఎలా ఛేదించింది? అనే ప్రశ్నలకు సమాధానమే ‘ది రోడ్’ సినిమా. త్రిష కెరీర్‌లో ఇది ఒక అండర్‌రేటెడ్ మూవీగా నిలిచిపోయింది.
45
Image Credit : our own
ఇంట్రెస్టెడ్ ట్యాగ్‌లైన్
'రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్లు' అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన 'ది రోడ్' సినిమాకు అరుణ్ వశీగరన్ దర్శకత్వం వహించారు. ఈ కథకు త్రిషనే మూలస్తంభం. ఆమెతో పాటు మలయాళ నటుడు షబీర్, మియా జార్జ్, ఎం.ఎస్. భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. శామ్ సి.ఎస్. సంగీతం అందించగా, నేపథ్య సంగీతం సస్పెన్స్ సీన్లకు బలాన్నిచ్చింది. సినిమాటోగ్రఫీ, వేగవంతమైన స్క్రీన్‌ప్లే క్రైమ్ థ్రిల్లర్ అభిమానులు చివరి వరకు కట్టిపడేస్తాయి.
55
Image Credit : X
ఎక్కడ చూడొచ్చంటే..?
ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమాలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. సస్పెన్స్, క్రైమ్, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన థ్రిల్లర్లను ఇష్టపడేవారికి 'ది రోడ్' కచ్చితంగా నచ్చుతుంది. 2023లో థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో చూడటానికి ఇది ఒక పక్కా సినిమా.
Latest Videos

