MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagarjuna: గ్రీకువీరుడు పరమ భక్తుడిగా మారడానికి కారణం ఎవరు? నాగార్జున అన్నమయ్య పాత్ర వెనుక అసలు రహస్యం?

Nagarjuna: గ్రీకువీరుడు పరమ భక్తుడిగా మారడానికి కారణం ఎవరు? నాగార్జున అన్నమయ్య పాత్ర వెనుక అసలు రహస్యం?

Nagarjuna: తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నమయ్య కూడా ఒకటి. భక్తి రస సినిమాల్లో ఈరేంజ్ హిట్ కొట్టిన మూవీ మరొకటి లేదు. రొమాంటిక్ హీరో నాగార్జున.. పరమభక్తుడిగా నటించడానికి కారణం ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 17 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం..
Image Credit : google

సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం..

తెలుగు సినిమా చరిత్రలో 'అన్నమయ్య' ఒక అద్భుతం. అప్పటివరకు రొమాంటిక్ హీరోగా, యాక్షన్ సినిమాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన అక్కినేని నాగార్జున, ఒక్కసారిగా పరమ భక్తుడిగా వెండితెరపై కనిపించి మెప్పించడం సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా 'నిన్నే పెళ్లాడతా' లాంటి సినిమాలతో 'గ్రీకువీరుడు' అన్న పేరు తెచ్కుకుని.. భారీ కమర్షియల్, సక్సెస్ ఫుల్ రొమాంటిక్ చిత్రాల తర్వాత నాగార్జున ఈ సినిమాను చేయడానికి ఒప్పుకోవడం ఒక చారిత్రక ఘట్టం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గ్రీకువీరుడు అన్నమయ్యగా ఎలా మారాడు?
Image Credit : Asianet News

గ్రీకువీరుడు అన్నమయ్యగా ఎలా మారాడు?

అన్నమయ్య సినిమా చేయాలనే నిర్ణయం వెనుక ఉన్న అసలు నమ్మకం ఏమిటి? ఆ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు చాలా మందికి తెలియవు. ఈ సినిమా ప్రపోజల్ వచ్చినప్పుడు.. అసలు ఇది ఎలా సాధ్యం.. రొమాంటిక్ హీరో భక్తి రసం పండించగలడా, ఇది సాధ్యం అవుతుందా అని నాగార్జున అనుమానాలకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ సందర్భంలో క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ సరికొత్త ప్రయోగానికి ప్రధాన సూత్రధారి, దర్శకుడు కె. రాఘవేంద్రరావు. అప్పటికే నాగార్జున 'గ్రీకువీరుడు' చిత్రంలో స్టైలిష్ లుక్‌తో, 'నిన్నే పెళ్లాడతా'లో ఎనర్జిటిక్ లవర్‌బాయ్‌గా తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.

Related Articles

Related image1
Chiranjeevi: మెగాస్టార్ సినిమాను చావు దెబ్బ కొట్టిన ఆర్ నారాయణమూర్తి, ఒకే టైటిల్ తో రిలీజ్ అయిన రెండు సినిమాలేంటి?
Related image2
VR Raja: యూట్యూబర్ VR Raja నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? సబ్ స్క్రైబర్స్, ఫాలోయింగ్ తెలిస్తే షాక్ అవుతారు
35
కింగ్ అనుమానాలకు డైరెక్టర్ ఒకే సమాధానం..
Image Credit : our own

కింగ్ అనుమానాలకు డైరెక్టర్ ఒకే సమాధానం..

నాగ్ కెరీర్ కమర్షియల్ సక్సెస్ లతో సాగుతున్న టైమ్ లో.. రాఘవేంద్రరావు భక్తిరస చిత్రం చేద్దామంటూ 'అన్నమయ్య' ప్రతిపాదన తెచ్చారు. సహజంగానే నాగార్జునకు ఒక పెద్ద సందేహం కలిగింది. "సార్, నేనేమో ఇప్పుడే నిన్నే పెళ్లాడతా, గ్రీకువీరుడు వంటి రొమాంటిక్ సినిమాలు చేసి రొమాంటిక్ పాటలు పాడుకున్నాను. ఇప్పుడు నాతో వచ్చి 'కలగంటి కలగంటి' అంటూ భక్తి పాటలు పాడిస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు? నా మీద ఆ భక్తి భావం సరిపోతుందా?" అని రాఘవేంద్రరావు గారిని అడిగారు . 

అప్పుడు రాఘవేంద్రరావు గారు నాగార్జునకు ధైర్యం చెప్తూ ఒకే ఒక్క మాట అన్నారు: "నువ్వు నన్ను నమ్ముతావా లేదా? నా మాట విను, నేను చూసుకుంటాను" అని ఆయన అన్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావుపై ఉన్న బలమైన నమ్మకం, తనను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలనే కసి నాగార్జునను ఈ సాహసం చేసేలా ప్రోత్సహించాయి. అలా గ్రీకువీరుడు అన్నమయ్యగా మారడానికి సిద్ధపడ్డారు.

45
నాగార్జున నట విశ్వరూపం
Image Credit : Asianet News

నాగార్జున నట విశ్వరూపం

'అన్నమయ్య' కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు, నాగార్జున నట జీవితంలోనే ఒక మైలురాయి. ఒక సాదాసీదా రసికుడైన యువకుడి నుండి సకల చరాచర జగత్తును వెంకటేశ్వరస్వామి రూపంలో చూసే గొప్ప పరమభక్తునిగా ఆయన పరిణామం చెందిన తీరు అద్భుతం. ముసలితనంలో అన్నమయ్యగా ఆయన పలికించిన హావభావాలు అప్పటి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి.

55
ప్రాణం పోసిన సంగీతం, అవార్డుల పంట పండించిన మూవీ..
Image Credit : stockPhoto

ప్రాణం పోసిన సంగీతం, అవార్డుల పంట పండించిన మూవీ..

ఈ సినిమా విజయానికి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అందించిన స్వరాలు అతిపెద్ద బలం. సినిమాలోని ప్రతి పాట నేటికీ భక్తుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుంది. అన్నమాచార్యుల కీర్తనలను ఆధునిక శ్రోతలకు కూడా నచ్చేలా కీరవాణి స్వరపరిచిన తీరు అనన్యసామాన్యం.నాగార్జున కెరీర్ బెస్ట్ ఫిలిం: విడుదలకు ముందు ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ, థియేటర్లలోకి వచ్చిన తర్వాత 'అన్నమయ్య' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 

నాగార్జున కెరీర్‌లోనే అత్యంత గొప్ప చిత్రాలలో ఒకటిగా ఇది నిలిచిపోయింది.ఈ సినిమాకుగాను ఆయన జాతీయ స్థాయిలో ప్రత్యేక జ్యూరీ అవార్డుతో పాటు నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. "నిజంగా నాకు అప్పట్లో తెలియదు. కానీ నాగార్జునగా నా కెరీర్‌లో శివ ఎంతటి సంచలనమో, అన్నమయ్య కూడా అంతే పెద్ద మలుపు" అని ఆయన గుర్తుచేసుకుంటుంటారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: మెగాస్టార్ సినిమాను చావు దెబ్బ కొట్టిన ఆర్ నారాయణమూర్తి, ఒకే టైటిల్ తో రిలీజ్ అయిన రెండు సినిమాలేంటి?
Recommended image2
Sobhan Babu: కారులోనే కన్నీళ్లు పెట్టుకున్న శోభన్ బాబు, మొదటి 2 వారాలు థియేటర్లు ఖాళీ.. కట్ చేస్తే
Recommended image3
Katrina Kaif: బాలీవుడ్ లో రిజెక్ట్ చేయడంతో టాలీవుడ్ లో జాక్ పాట్.. ఒక్క హిట్ తో జాతకమే మారిపోయింది
Related Stories
Recommended image1
Chiranjeevi: మెగాస్టార్ సినిమాను చావు దెబ్బ కొట్టిన ఆర్ నారాయణమూర్తి, ఒకే టైటిల్ తో రిలీజ్ అయిన రెండు సినిమాలేంటి?
Recommended image2
VR Raja: యూట్యూబర్ VR Raja నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? సబ్ స్క్రైబర్స్, ఫాలోయింగ్ తెలిస్తే షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved