MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ANR: రామారావు లక్షణాలు మంచివి కావు, అక్కినేని నాగేశ్వరరావు సంచలన కామెంట్స్, ఎన్టీఆర్ పై అలిగిన ఏఎన్నార్

ANR: రామారావు లక్షణాలు మంచివి కావు, అక్కినేని నాగేశ్వరరావు సంచలన కామెంట్స్, ఎన్టీఆర్ పై అలిగిన ఏఎన్నార్

ANR: తెలుగు సినిమా తొలితరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మధ్య మంచి అనుబంధం ఉండేది. వారు ఎంత క్లోజ్ గా ఉండేవారు. తర్వాత కాలంలో వారి మధ్య చాలా విభేదాలు వచ్చాయి. ఎన్టీఆర్ గురించి ఏఎన్నార్ చేసిన సంచలన కామెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 17 2026, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్ కు రెండు కళ్లు..
Image Credit : Facebook / Sr NTR Fans

టాలీవుడ్ కు రెండు కళ్లు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా నిలిచిన మహానటులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని ఏలిన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న అనుబంధం, ఆ తర్వాత రాజకీయాల వల్ల వారి మధ్య తలెత్తిన కొన్ని వివాదాలు, దూరం గురించిన ఆసక్తికరమైన విషయాలు ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో షేర్ చేసుకున్న సంగతులు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎన్టీఆర్ ప్రవర్తనపై ఏఎన్నార్ వ్యాఖ్యలు
Image Credit : Asianet News

ఎన్టీఆర్ ప్రవర్తనపై ఏఎన్నార్ వ్యాఖ్యలు

ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి మధ్య జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కాలంలో, ఎక్కడైనా ఎదురైతే "ఏం బ్రదర్ ఎట్లా ఉన్నారు? మరదలు గారు ఎలా ఉన్నారు? నాగార్జున ఎలా ఉన్నాడు?" అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని ఏఎన్నార్ గుర్తుచేసుకున్నారు. అయితే, అంత పెద్ద పదవిలో ఉండి కూడా అలా పలకరించడం ఎన్టీఆర్ గారి సంస్కారంగా అందరూ అనుకోవచ్చని, కానీ తాను మాత్రం ఆయనను కలవడానికి అంతగా ఇష్టపడేవాడిని కాదని ఏఎన్నార్ పేర్కొన్నారు.

Related Articles

Related image1
Chiranjeevi: మెగాస్టార్ సినిమాను చావు దెబ్బ కొట్టిన ఆర్ నారాయణమూర్తి, ఒకే టైటిల్ తో రిలీజ్ అయిన రెండు సినిమాలేంటి?
Related image2
Nagarjuna: గ్రీకువీరుడు పరమ భక్తుడిగా మారడానికి కారణం ఎవరు? నాగార్జున అన్నమయ్య పాత్ర వెనుక అసలు రహస్యం?
36
సీఎం అయితే నాకేంటి..
Image Credit : Asianet News

సీఎం అయితే నాకేంటి..

ఏఎన్నార్ మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏంటి,నా జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకులను చూశాను, మిగతా వారి కంటే తనకే రాజకీయ నాయకులతో ఎక్కువ పరిచయాలు, సన్నిహిత సంబంధాలు నాకు ఉన్నాయి. ఇంత కంటే పెద్ద పెద్ద లీడర్లే నాతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన నో కాకేంటి అన్నట్టుగా ఏఎన్నార్ స్పష్టం చేశారు.

46
ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల అనుబంధం
Image Credit : IMDB

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల అనుబంధం

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మధ్య పరిశ్రమలో దశాబ్దాల పాటు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేది. ఇద్దరూ కలిసి ఎన్నో క్లాసిక్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి మధ్య కొంత దూరం పెరిగినట్లు తెలుస్తోంది. 

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని, పదవులు ఇస్తామని తనను ఎన్నోసార్లు మర్యాదగా పిలిచినా తాను వద్దని తిరస్కరించానని ఏఎన్నార్ చెప్పారు. అలాంటప్పుడు ఆయనను విమర్శించాల్సిన అవసరం తనకు ఏముంటుందని, కానీ ఈ విషయాన్ని ఎన్టీఆర్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని... ఆలోచించలేకపోయారని ఏఎన్నార్ అభిప్రాయపడ్డారు.

56
రెండోసారి సీఎం అయినప్పటి వివాదం
Image Credit : Youtube/Telugu Filmnagar

రెండోసారి సీఎం అయినప్పటి వివాదం

ఈ ఇద్దరి మధ్య కొంత వివాదం నడుస్తున్న టైమ్ లోనే ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టైమ్ లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఏఎన్నార్ వద్దకు వచ్చి, "మీరు ఇండస్ట్రీలో అందరికంటే సీనియర్. రామారావు గారిని సన్మానించే కార్యక్రమానికి మీరే అధ్యక్షత వహించాలి" అని కోరారు. కానీ దానికి ఏఎన్నార్ నిరాకరిస్తూ, "రామారావు లక్షణాలు మంచివి కావు, నేను రాను" అని తెగేసి చెప్పారు. పరిశ్రమ పెద్దలు బలవంతం చేసినా, "నేను రానని, ఆయనపై కోపంగా ఉన్నానని ఆయనకే చెప్పండి" అని నిర్మొహమాటంగా సమాధానమిచ్చారు.

66
క్రమశిక్షణ నేర్పించిన నటులు..
Image Credit : our own

క్రమశిక్షణ నేర్పించిన నటులు..

వెండితెరపై అన్నదమ్ముల్లా, ప్రాణస్నేహితుల్లా మెరిసిన ఈ ఇద్దరు మహానుభావుల మధ్య, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కొన్ని బేధాభిప్రాయాలు వచ్చాయని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఆ తర్వాత కాలంలో ఏఎన్నార్ కాస్ కూల్ అయ్యారు.  

ఎన్టీఆర్ మరణం తరువాత ఏఎన్నార్ చాలా సందర్భాల్లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పించిన నటులం మా బ్రదర్ రామారావు, నేను. ఇప్పుడు నా సహోదరడు లేకపోవడం ఎంతో బాధేస్తుంది. ఇద్దరం కలిసి ఇండస్ట్రీని నిలబెట్టాము. అని ఓ సభలో అక్కినేని అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: మంటలు రేపిన రామ్ ప్రసాద్ 'వారానికి వెయ్యి' వివాదం..బిగ్ బాస్ 10 లో ఫస్ట్ ఎలిమినేషన్, చరణ్ అవుట్
Recommended image2
Controversial Movies: సమాజానికి చెడు సందేశం ఇచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
Recommended image3
Epic Movie: ఎపిక్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. ఆనంద్, వైష్ణవి బ్లాక్ బస్టర్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదే
Related Stories
Recommended image1
Chiranjeevi: మెగాస్టార్ సినిమాను చావు దెబ్బ కొట్టిన ఆర్ నారాయణమూర్తి, ఒకే టైటిల్ తో రిలీజ్ అయిన రెండు సినిమాలేంటి?
Recommended image2
Nagarjuna: గ్రీకువీరుడు పరమ భక్తుడిగా మారడానికి కారణం ఎవరు? నాగార్జున అన్నమయ్య పాత్ర వెనుక అసలు రహస్యం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved