- Home
- Entertainment
- Trisha Marriage: త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తెలుసా?2015లో అసలేం జరిగింది? బయటపడ్డ షాకింగ్ సీక్రెట్
Trisha Marriage: త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తెలుసా?2015లో అసలేం జరిగింది? బయటపడ్డ షాకింగ్ సీక్రెట్
Trisha Marriage: 2015లో త్రిష ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో తన నిశ్చితార్థం జరిగిందని ప్రకటించారు. కానీ కొన్ని రోజులకే ఆ ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది. ఆ తర్వాత దీనిపై మాట్లాడిన త్రిష, అసలు కారణాన్ని బయటపెట్టారు.
16

Image Credit : Instagram@trishakrishnan
పాన్ ఇండియా సినిమాలతో బిజీ
దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మెరిసిన త్రిషకు ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. నలభై ఏళ్లు దాటినా, క్రేజీ ఆఫర్లతో బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' లాంటి భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
26
Image Credit : Instagram@trishakrishnan
11 ఏళ్ల కిందటే ఆ సంఘటన
ప్రొఫెషనల్‌గా త్రిష సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నా, ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌తో చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ, 11 ఏళ్ల క్రితమే త్రిష పెళ్లి ఆగిపోయిందన్న విషయం చాలా మందికి తెలియదు.
36
Image Credit : Instagram@trishakrishnan
చెన్నై వ్యాపారవేత్తతో నిశ్చితార్థం
2014లో చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని 2015 జనవరిలో త్రిష స్వయంగా ప్రకటించారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లికి కొన్ని నెలల ముందే ఆ బంధం రద్దయింది. పెళ్లి తర్వాత సినిమాలు పూర్తిగా మానేయాలని కండిషన్ పెట్టడం వల్లే త్రిష ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
46
Image Credit : Instagram@trishakrishnan
చనిపోయేవరకూ నటిస్తూనే ఉంటా
ఈ ఘటన తర్వాత ఒక ఇంటర్వ్యూలో త్రిష పెళ్లి రద్దుకు కారణం చెప్పారు. 'నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి నన్ను సినిమాలు ఆపేయమన్నారు. అందుకే నేను సినిమాల కోసం నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. నేను గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే సినిమాలకు బ్రేక్ ఇస్తాను. ఒకవేళ నాకు మంచి అవకాశాలు రాకపోతే, నా ఇమేజ్‌కు సరిపోయే ఏ పాత్ర అయినా చేస్తాను. కానీ సినిమాలకు దూరం కాను. నా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలన్నది నా కోరిక' అని ఆమె స్పష్టం చేశారు.
56
Image Credit : Instagram@trishakrishnan
పలువురు నటులతో త్రిష పేరు!
నిశ్చితార్థం రద్దయ్యాక త్రిష సింగిల్‌గా ఉండటానికే నిర్ణయించుకున్నారు. సింగిల్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. ఆ తర్వాత టాలీవుడ్ నటుడు రాణాతో సహా పలువురు సినీ ప్రముఖులతో త్రిష పేరు వినిపించింది. కానీ వాటన్నింటినీ ఆమె ఖండిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్లారు.
66
Image Credit : Asianet News
విమర్శలకు కౌంటర్
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ తో త్రిష పేరు బాగా వినిపిస్తోంది. ఈ విషయంపై చాలా కథనాలు వైరల్ అవుతున్నాయి. కొందరు నేతలు, నటులు ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. కావాలనే త్రిష పేరును వివాదాల్లోకి లాగుతున్నారు. కానీ ఈ వ్యాఖ్యలపై త్రిష స్పందించకుండా, తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
Latest Videos

