MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • MS Raju: అగధ సినిమా రిజల్ట్ పై ఎంఎస్‌ రాజు రియాక్షన్‌.. ఎమోషనల్‌ కామెంట్‌

MS Raju: అగధ సినిమా రిజల్ట్ పై ఎంఎస్‌ రాజు రియాక్షన్‌.. ఎమోషనల్‌ కామెంట్‌

దర్శకుడు ఎంఎస్‌ రాజు రూపొందించిన `అగధ` మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా రిజల్ట్ పై దర్శకుడు ఎంఎస్‌ రాజు రియాక్షన్‌ అయ్యారు. ఒక నోట్‌ని రిలీజ్‌ చేశారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 15 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
థియేటర్లో సందడి చేస్తోన్న అగధ
Image Credit : Asianet News

థియేటర్లో సందడి చేస్తోన్న అగధ

స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించిన చిత్రం `అగధ`. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. శ్రావణ్‌ రెడ్డి, షిజ్జు, వనితా విజయ్‌ కుమార్‌, జోవికా, ఉల్కా గుప్తా, భాను చందర్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం విడుదలయ్యింది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో మూవీ రిజల్ట్ పై దర్శకుడు ఎంఎస్‌ రాజు ఒక నోట్‌ని రిలీజ్‌ చేశారు. ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పారు. ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లని అభినందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అగధ రిజల్ట్ పై ఎంఎస్‌ రాజు ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌
Image Credit : Asianet News

అగధ రిజల్ట్ పై ఎంఎస్‌ రాజు ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

`మా చిత్రం `అగధ` ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఎంతో అలరిస్తూ, షో షోకి కలెక్షన్లు పెరుగుతూ బ్లాక్‌ బస్టర్‌ వైపు అడుగులు వేస్తోంది. అందరూ మా చిత్రాన్ని `దేవి, `అరుంధతి` సినిమాలతో పోలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం హర్రర్‌ చిత్రం మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని, మహిళా ప్రేక్షకులను అలరిస్తుందని అందరూ అంటున్నారు. నిన్న ఫోన్‌ కాల్స్ ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా ఎంతో మంది ఈ చిత్రం విజయాన్ని తెలియజేస్తుండటంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారందరికీ మా కృతజ్ఞతలు. ఈ సినిమా సక్సెస్‌ సందర్భంగా సమర్పకులైన అజయ్‌ కె ఆర్‌ గారికి, నిర్మాత అయిన కాశీ విశాలక్షి బలుసు గారికి అభినందనలు` అని చెప్పారు ఎంఎస్‌ రాజు.

Related Articles

Related image1
Nagarjuna: నేను కరప్ట్ అయ్యాను, నాది నాకే నచ్చడం లేదు.. నాగార్జున సంచలన కామెంట్‌
Related image2
Makutam Collections: విశాల్ సినిమాకు తొలిరోజే షాక్.. మకుటంకి వచ్చిన కలెక్షన్లు ఇంతేనా?
34
కామాక్షి ఈ సినిమాకోసమే పుట్టిందా?
Image Credit : Asianet News

కామాక్షి ఈ సినిమాకోసమే పుట్టిందా?

ఇంకా ఇందులో ఆయన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల గురించి చెబుతూ, `మహాదేవి పాత్రను అద్భుతంగా పోషించిన కామాక్షి భాస్కర్ల ఈ చిత్రం కోసమే పుట్టిందని అందరూ పొగుడుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. సింహ పాత్రను పోషించిన శ్రవణ్‌ రెడ్డి నటన గురించి వస్తున్న ప్రశంసల వెల్లువ నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాగే ఈ చిత్రంలో నటించిన జోవికా, ఉల్కా, సిజ్జు వారి పాత్రలను అద్భుతంగా పోషించారని అందరూ అంటున్నారు. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ప్రతి టెక్నీషియన్‌కి నా అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా సినిమాని ఆదరిస్తున్న ఆడియెన్స్ కి ధన్యవాదాలు` అని చెప్పారు ఎంఎస్‌ రాజు.

44
అగధ కలెక్షన్లు
Image Credit : Asianet News

అగధ కలెక్షన్లు

ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించిన `అగధ` సినిమా బాక్సాఫీసు వద్ద దారుణమైన వసూళ్లని రాబట్టింది. దీనికి మొదటి రోజు(సాక్నిల్క్ లెక్కల ప్రకారం) కేవలం ముప్పై లక్షలు మాత్రమే రావడం గమనార్హం. ఇక ఈ మూవీ ఒక అగధ అనే నెగటివ్‌ పవర్‌ చుట్టూ తిరుగుతుంది. అది అనేక మంది ఆత్మలను తనలో ఐక్యం చేసుకొని బలంగా తయారవుతుంది. దేవుళ్లనే శాసించాలని ప్లాన్‌ చేస్తుంది. అందుకు కామాక్షి భాస్కర్ల బాబాయ్‌ కూతురుని లక్ష్యంగా చేసుకుంటుంది. ఆమె గర్భంతో ఉంటుంది. తాను తప్పించుకోవడంతో వరుసగా వారి కుటుంబాన్ని పీడిస్తుంటుంది. ఆ పీడ నుంచి తన కుటుంబాన్ని మహాదేవి అయిన కామాక్షి భాస్కర్ల ఎలా విముక్తి కలిగించిందనేది సినిమా. హర్రర్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్, మిస్టరీ అంశాల ప్రధానంగా సాగుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
Nagarjuna: నేను కరప్ట్ అయ్యాను, నాది నాకే నచ్చడం లేదు.. నాగార్జున సంచలన కామెంట్‌
Recommended image2
Makutam Collections: విశాల్ సినిమాకు తొలిరోజే షాక్.. మకుటంకి వచ్చిన కలెక్షన్లు ఇంతేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved