రాజా సాబ్ 15వ రోజు కలెక్షన్స్, ప్రభాస్ సినిమా ఎన్ని లక్షలు వసూలు చేసిందంటే?
ప్రభాస్ హారర్-కామెడీ రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద భారీగా పడిపోయింది. 15వ రోజు ఈసినిమా ఎన్ని లక్షలు కలెక్ట్ చేసిందో తెలుసా? రెండో వారంలో బలహీనమైన వసూళ్లతో.. ప్రభాస్ నినిమా ఎండ్ స్టేజ్ కు వచ్చిందా?

రాజా సాబ్ 15వ రోజు కలెక్షన్స్
రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద ఆందోళనకరమైన దశలోకి వచ్చింది. 15వ రోజు, ఈ చిత్రం కేవలం రూ. 22 లక్షలు వసూలు చేసింది. మొత్తం దేశీయ నెట్ కలెక్షన్ ఇప్పుడు సుమారు రూ. 143.03 కోట్లు. రెండో వారం కేవలం రూ. 12.56 కోట్లు మాత్రమే రాబట్టింది ప్రభాస్ సినిమా.
హిందీలో రాజా సాబ్ పరిస్థితి ఎలా ఉందంటే?
రాజాసాబ్ సినిమా కోసం థియేటర్లకు ప్రేక్షకుల రాక చాలా తక్కువగా ఉంది. తెలుగులో మొత్తం 18% ఆక్యుపెన్సీ నమోదైంది. హిందీ వెర్షన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, 2% కంటే తక్కువ ఆక్యుపెన్సీతో థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. సినిమా ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది.
నిరాశలో ప్రభాస్ అభిమానులు..
సోషల్ మీడియాలో రాజా సాబ్ సినిమాపై ప్రేక్షకుల నుంచి నిరాశ వ్యక్తమైంది. కథ, దర్శకత్వం, ఎడిటింగ్‌పై విమర్శలు వచ్చాయి. ప్రభాస్ అభిమానులు కూడా సినిమా బాగోలేదని చెప్పడంతో మౌత్ టాక్ దెబ్బతింది. నెగటివ్ బజ్‌తో రాజా సాబ్ థియేట్రికల్ రన్ త్వరగా ముగియనుంది. అంతే కాదు డైరెక్టర్ మారుతీపై కూడా విమర్శలు వస్తున్నట్టు సమాచారం.,
ఫాంటసీ హారర్ కామెడీ సినిమా
‘ది రాజా సాబ్’ ఒక ఫాంటసీ హారర్ కామెడీ సినిమా. మారుతి దర్శకత్వం వహించిన ఈసినిమాలో . ప్రభాస్ జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటించారు. సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించాడు.

