నాగార్జున, ప్రభాస్ కాంబినేషన్ లో మిస్సైన డిజాస్టర్ మల్టీస్టారర్ మూవీ ఏదో తెలుసా?
కొన్ని కొన్ని సార్లు కొన్ని సినిమాలు మిస్సవడమే స్టార్ హీరోలకు మంచిదవుతుంది. కింగ్ నాగార్జున, ప్రభాస్ కాంబినేషన్ కూడా అలానే మిస్ అయ్యింది. ప్రభాస్ తప్పించుకున్నాడు కానీ.. మరో హీరో మాత్రం అడ్డంగా బుక్ అయ్యాడు. ఇంతకీ ఏంటా సినిమా?

నాగార్జున - ప్రభాస్ మల్టీస్టారర్..
టాలీవుడ్ లో ఎన్నో మాల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. అందులో బ్లాక్ బస్టర్ హిట్ అయినవి ఉన్నాయి.. డిజాస్టర్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మల్టీస్టారర్ కాంబినేషన్స్ మిస్సైన సందర్బాలు కూడా లేకపోలేదు. అలా చేయకపోవడం వల్ల పెద్ద పెద్ద డిజాస్టర్స్ ను తప్పించుకున్న హీరోలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆ హీరోల ప్లేసులో మరో హీరో బుక్ అయ్యిన సినిమాలు కూడా ఉన్నాయి. రెంబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇలానే ఓ పెద్ద ప్లాప్ మూవీ నుంచి తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు కృష్ణార్జున.
నాగార్జునతో యంగ్ హీరోల సినిమాలు
కింగ్ నాగార్జున తన కెరీర్ లో చాలా మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు. ఈమధ్య కాలంలో కూడా ఆయన నటించి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నారు. నాని, కార్తి, నాగచైతన్య, శ్రీకాంత్ లాంటి హీరోలతో నాగ్ చాలామల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు. ఇక ఈ క్రమంలోనే నాగార్జున – ప్రభాస్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా కోసం ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. కానీ ఆ సినిమాను మిస్సయ్యింది. ఆ సినిమానే కృష్ణార్జున. ఈ సినిమాలో ప్రభాస్ నటించాల్సిందట.
డిజాస్టర్ నుంచి తప్పించుకున్న ప్రభాస్..
ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీ బిజీ గా ఉండటంతో.. ఈ సినిమాకు డేట్స్ ను అడ్జెస్ట్ చేయలేకపోయినట్టు తెలుస్తోంది. తమిళంలో చంద్రముఖి లాంటి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు పి వాసు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నాగార్జున నటించాడు. ఇక మంచు విష్ణు ఈ సినిమాలో హీరోగా నటించాడు. మంచు విష్ణు పాత్రను ప్రభాస్ చేయాల్సింది... ఆయన వదిలేయడంతో పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ.. టాలీవుడ్ లో మాత్రం టాక్ గట్టిగా వినిపించింది.
ప్రభాస్ ఈ సినిమా చేసి ఉంటే?
కృష్ణార్జున సినిమాలో మంచు విష్ణు పోషించిన పవర్ ఫుల్ క్యారెక్టర్ ను ప్రభాస్ పోషించాల్సి ఉంది. ప్రభాస్ చేసుంటే ఈసినిమా హిట్ అయ్యేదేమో.. అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ కు తగ్గట్టు.. కథలో , క్యారెక్టర్ లో మార్పులు ఉండేవి. ఆయన కటౌట్ కు తగ్గ సీన్లు పడేవి. మంచు విష్ణు కూడా అదే హైట్ అయినా.. ఇద్దరికి స్టార్ డమ్ విషయంల్ తేడా ఉంది. ప్రభాస్ తో ఈమూవీ చేసి ఉంటే ఎలా ఉండేదో. కానీ అభిమానులు మాత్రం ప్రభాస్ పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడుని హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

