MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Paradise 11 Days Collection: ప్యారడైజ్‌కి నష్టాలు తప్పవా?, 11వ రోజు షాకింగ్‌ కలెక్షన్లు, నానికి అసలు పరీక్ష స్టార్ట్

Paradise 11 Days Collection: ప్యారడైజ్‌కి నష్టాలు తప్పవా?, 11వ రోజు షాకింగ్‌ కలెక్షన్లు, నానికి అసలు పరీక్ష స్టార్ట్

నాని హీరోగా నటించిన `ది ప్యారడైజ్‌` మూవీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఈ చిత్రం ఆదివారం నుంచి రియాలిటీలోకి వచ్చింది. మరి సండే కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 05 2026, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న నాని ప్యారడైజ్‌
Image Credit : Asianet News

బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న నాని ప్యారడైజ్‌

నాని, కయాదు లోహర్‌ జంటగా శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ది ప్యారడైజ్‌`. మోహన్‌ బాబు విలన్‌గా, సంపూర్ణేష్‌ బాబు, ఈశ్వరీ రావు, సోనాలి కులకర్ణి, విషిక, ప్రియదర్శి, సత్యరాజ్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 24న విడుదలైంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ మూవీ మిక్స్ డ్‌ టాక్‌తో స్టార్ట్ అయ్యింది. అయినా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్యారడైజ్‌ మూవీకి నష్టాలు తప్పవా?
Image Credit : Asianet News

ప్యారడైజ్‌ మూవీకి నష్టాలు తప్పవా?

మొదటి వీకెండ్‌లోనే దుమ్మురేపే కలెక్షన్లని సాధించిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. ఇంకా బ్రేక్ ఈవెన్‌ కాలేదు. నైజాంలో బ్రేక్‌ ఈవెన్ అయ్యింది. కానీ ఏపీలో మాత్రం బ్రేక్‌ ఈవెన్‌కి చాలా దూరంలో ఉంది. అక్కడ నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్‌ పండితులు, పలువురు డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఏపీలో దాదాపు నలభై శాతం లాస్‌ ఉంటుందంటున్నారు. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి. ఈ ఆదివారం(11వ) రోజు ఎంత వచ్చాయనేది చూస్తే.

34
ప్యారడైజ్‌ మూవీ 11 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

ప్యారడైజ్‌ మూవీ 11 రోజుల కలెక్షన్లు

ప్యారడైజ్‌ మూవీకి ఆదివారం డీసెంట్‌ వసూళ్లు వచ్చాయి. దీనికి ఇండియాలో రూ.2.40కోట్ల గ్రాస్‌ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.2.50కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రూ.31కోట్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ.166.80 కోట్ల కలెక్షన్లు రావడం విశేషం. ఇంకా దాదాపు రూ.33కోట్ల గ్రాస్‌ రావాలి. ఈ సోమవారంతో వచ్చే కలెక్షన్లని బట్టి ఈ మూవీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది.

44
సోమవారం నుంచి నానికి అసలు పరీక్ష
Image Credit : Asianet News

సోమవారం నుంచి నానికి అసలు పరీక్ష

ఇదిలా ఉంటే శనివారం వరకు పెరిగిన టికెట్‌ రేట్లతో సినిమా రన్‌ అయ్యింది. దీంతో మంచి వసూళ్లు వచ్చాయి. ఆదివారంతో రెగ్యూలర్‌ టికెట్‌ రేట్లతో రన్‌ అవుతుంది. అందుకే ఆదివారం అయినా కూడా ఈ చిత్రానికి చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. గత వారం విడుదలైన మూవీస్‌లో ఒక్కటి కూడా బాగా లేకపోయినా, వీకెండ్‌ కావడంతో ఆడియెన్స్ ఇలాంటి పెద్ద సినిమాలకు ప్రయారిటీ ఇచ్చినా కూడా ఈ మూవీకి ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయంటే సినిమా ఇక చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఇక సోమవారం ఈ వసూళ్లు మరింతగా పడిపోయే ఛాన్స్ కనిపిస్తుంది. ఏదేమైనా నానికి అసలు పరీక్ష ఈ రోజు నుంచే స్టార్ట్ కాబోతుందని చెప్పొచ్చు. అయితే మిశ్రమ స్పందనతోనూ, ఏపీలో పెద్దగా ఆదరణ లేకపోయినా కూడా ఈ స్థాయి కలెక్షన్లు రావడం గొప్ప విషయంగానూ చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాని (నటుడు)
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhairava Dweepam Review: బాలకృష్ణ కురూపిగా చేసిన సాహసం, విజువల్ వండర్ గా ఎలా నిలిచింది, భైరవద్వీపం సక్సెస్ కు కారణాలు..
Recommended image2
Srishti: బిగ్ బాస్ నుంచి సృష్టి ఎలిమినేట్.. హౌస్ లో ముసుగు వేసుకున్నది ఆ ఇద్దరే, అంటించి వెళ్లడం అలవాటు
Recommended image3
Drishyam 3: దూసుకుపోతున్న దృశ్యం 3, భర్త కష్టానికి ప్రతిఫలం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి
Related Stories
Recommended image1
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Recommended image2
Bhairava Dweepam Review: బాలకృష్ణ కురూపిగా చేసిన సాహసం, విజువల్ వండర్ గా ఎలా నిలిచింది, భైరవద్వీపం సక్సెస్ కు కారణాలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved