- Home
- Entertainment
- Anchor Suma: నీకు టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు.. నేను ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే...
Anchor Suma: నీకు టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు.. నేను ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే...
Anchor Suma: బుల్లితెర మహారాణి అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు యాంకర్ సుమ. ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెరను మకుటం లేని మహారాణిగా ఏలుతున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Suma
సినిమా ఇండస్ట్రీలో చిన్న నుంచి పెద్ద సినిమా వరకు, కొత్త హీరో నుంచి.. సీనియర్ హీరో వరకు అందరినీ ఇంటర్వ్యూ చేసే యాంకర్ సుమ తాజాగా.. ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలను పంచుకున్నారు. అందులోని కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం...
ఎన్నో సంవత్సరాలుగా చాలా మంది యాంకర్లు వచ్చారు.. పోయారు.. కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు. కానీ.. నెంబర్ 1 యాంకర్ అంటే మాత్రం సుమ పేరే వినపడుతుంది. అయితే.. సుమ ఈ స్థాయికి రావడానికి చాలా మందిని తొక్కేశారని.. మరొకరిని ఎదగనివ్వకుండా చేశారు అనే కామెంట్స్ తరచుగా వినపడుతూనే ఉంటాయి. ఇలాంటి కామెంట్స్ కి ఆమె స్పందించారు. ‘ నేను ఎవరినీ తొక్కలేదు. నిజం చెప్పాలంటే.. కొత్తగా వచ్చే వారికి నేను నాకు తూచిన సలహాలు ఇస్తూనే ఉంటాను. కొన్ని కార్యక్రమాలు నేను చేయకుండా.. వేరే వారికి ఇవ్వండి అని కూడా చెబుతూ ఉంటాను’ అని సుమ చెప్పారు.
ఎవరి టాలెంట్ ని ఎవరూ ఆపలేరు..
‘నీకు టాలెంట్ ఉంటే నిన్ను ఆపేది నువ్వే.. ఇంకెవరూ నిన్ను ఆపలేరు. ఒక సినిమాలో రానివ్వకుండా చేయవచ్చు.. కానీ నీకంటూ ఒక సోషల్ మీడియా పెట్టుకోవచ్చుగా.. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్.. వాక్ స్వాతంత్రం ఇప్పుడు నడుస్తోంది.. You can Do.. If you are Really Talented... happily you can open one Channel.కానీ ఏమౌతోంది ఈ మధ్య.. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితే చాలా కాలం తర్వాత అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. వారు ఏదైనా వీడియోలు చేస్తే.. అవి వైరల్ అయ్యి.. ఆఫర్ వస్తే.. సినిమాలతో మరింత పాపులర్ అయితే.. వాళ్లు మరింత పెద్ద సెలబ్రెటీలు అవుతున్నారు’ అని సుమ చెప్పారు.
అమ్మాయిలు ఉద్యోగాలు చేయాలి..
ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి కూడా సుమ మాట్లాడారు.‘ ఆర్థిక స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికీ ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు.. ఎందుకంటే..మంచిగా చదువుకుంటున్నారు.. ఉద్యోగం కొంతకాలం చేసి తర్వాత పెళ్లి చేసుకుంటాం కదా అని ఉద్యోగం ఆపేస్తారు. కానీ.. నేను చాలా మందిని చూశాను.. సడెన్ గా వాళ్ల భర్త చనిపోతే.. ఇంట్లో సంపాదించిదే ఒక్కరే అవ్వడంతో చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే.. ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అని నేను చెబుతుంటాను.’ అని అన్నారు.
‘సొసైటీలో సక్సెస్ అంటే నేమ్, ఫేమ్ , మనీ... కానీ నా సక్సెస్ మాత్రం అది కాదు.. ఎందుకంటే.. నేను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండటమే నా సక్సెస్ మంత్ర.అంటే నేను నాకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నాను అంటే సక్సెస్ అయ్యాను అని అనుకుంట. ఈరోజు నేను ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను అంటే..సక్సెస్.. బతికే ఉన్నాను కదా. చాలా మంది ప్రొఫెషనల్ గా సక్సెస్ అయితేనే విజయం అనుకుంటారు. కానీ అలా కలిపేయకూడదు. అన్నీ చూసుకోవాలి. ఆరోగ్యం, రిలేషన్ షిప్, కెరీర్ బాగుందా... మీరు విజయం సాధించినట్లే. మొత్తం లైఫ్ ని 10 అంశాలు చూసుకుంటే అందులో ఏడింటిలో మనం బాగున్నా.. సక్సెస్ అయినట్లే ’అని సుమ చెప్పారు.
‘నేను ఈ యాంకరింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను.. కొత్త కెరీర్ ఎంచుకోలేను కాబట్టి.. ఇంకా కొంత కాలం మీరు నన్ను భరించాల్సిందే. నాలాగే వస్తున్న వారిని కూడా భరించండి.’ అని సుమ సరదాగా చెప్పారు.

