- Home
- Entertainment
- Janaki Kalaganaledu: వంటల పోటీకి వచ్చిన వారికి వంటలు అన్నీ రావాలి.. రామచంద్రకు క్లాస్ పీకిన జడ్జ్!
Janaki Kalaganaledu: వంటల పోటీకి వచ్చిన వారికి వంటలు అన్నీ రావాలి.. రామచంద్రకు క్లాస్ పీకిన జడ్జ్!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి (Janaki Kalaganaledu) కలగనలేదు సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వాళ్లు చెప్పిన పేర్లను మొదటిసారి వింటున్నాను అవి నేను ఎలా చేయగలను అని రామచంద్ర (Rama Chandra) టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక జానకి మీరు చేయగలరు అని రామచంద్రకు ధైర్యం చెబుతుంది. మరోవైపు గోవిందరాజు (Govindaraju) జానకి ఉండగా రాముడు ఎలా ఓడిపోతాడు చెప్పు అంటూ జ్ఞానాంబ తో అంటాడు.
ఇక జడ్జెస్ రామచంద్ర (Rama Chandra) చేసిన డిష్ ను టేస్ట్ చేసి నువ్వు చేసిన డిష్ పూర్తిగా కంప్లీట్ అవలేదు అని అంటారు. రామచంద్ర ఈ రకమైన వంటల గురించి నాకు తెలియదు అంటాడు. ఇక ఆ జడ్జ్ బెటర్ లక్ నెక్స్ట్ రౌండ్ ని అంటుంది. ఇక జడ్జి సంజయ్ (Sanjay) రామచంద్ర ని కూడా ఈ రౌండ్ లో ఎలిమినేట్ చేస్తారు. అంతేకాకుండా రేపటి రౌండ్ నీకు చాలా టఫ్ గా ఉంటుంది అని చెబుతాడు.
మరోవైపు జ్ఞానాంబ (Jnanamba) నా కొడుకుని అవమానం అనే గ్రహణం పట్టుకుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక రేపటి పోటీ అటూ ఇటూ అయితే మా అత్తయ్య గారికి నేను ఏం సమాధానం చెప్పాలి అని జానకి (Janaki) ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామచంద్ర రేపటి పోటీలో దేవుడు నన్ను ఏదో ఒక రూపంలో గెలిపించడంకోసం సహాయం చేస్తాడు అని రామచంద్ర అంటాడు.
ఇక రామచంద్రతో (Rama Chandra) పోటీలో పాటిస్పేట్ చేసేవారు.. చదువుకోని వాళ్ళు ఇక్కడికి ఇలాంటి చోటకు రాకూడదు అంటూ అవమానిస్తారు. ఈలోపు అక్కడికి జానకి (Janaki) వెళ్లి మీకు సంస్కారం లేదు అంటూ విరుచుకు పడుతుంది. ఇక జానకి వాళ్ళ భర్త గురించి ప్రౌడ్ గా చెప్పుకుంటూ.. వాళ్లకి నానారకాలుగా బుద్ధి చెబుతుంది. ఆ తర్వాత జానకి తన భర్తను అన్యోన్యంగా మీరు రండి అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకువెళుతుంది.
ఇక తర్వాతి రౌండ్ లో మిస్టర్ మహేష్ (Mahesh) ను జడ్జిగా ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత జడ్జి ప్రభ (Prabha) ఈరోజు మీకు కీలకమైన రోజు అని పాటిస్పేట్ చేసేవాళ్ళందరికి చెబుతుంది. సంజయ్ మాట్లాడుతూ ఇది కంటెస్టెంట్ ఛాయిస్ రౌండ్ మీకు నచ్చిన ఇష్టమైన డిష్ లు తయారు చేయాలి అని అంటడు. ఈరోజు ఎక్కడికి చాలామంది టూరిస్టులు వస్తారు.. మీరు ఆలోగా మీ వంటకాలు తయారు చేసి డిష్ లు పెట్టాలి అని అంటాడు.
సంజయ్ (Sanjay) టూరిస్టు లు అందరు వచ్చి మీరు చేసిన పదార్థాలు కొనుక్కుంటారు. ఎవరు పదార్థాలు ఎక్కువ అమ్ముడు పోతే వాళ్ళు గెలిచినట్లు అని అంటాడు. ఇక రామచంద్ర (Rama Chandra) వంట చేయడం స్టార్ట్ చేస్తాడు. జానకి తన భర్తకు సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈలోపు రామ అంటూ జ్ఞానాంబ అక్కడికి వస్తుంది.