MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Meena: ఈ సీన్ చూసి థియేటర్ లో ఏడవని వాళ్లు లేరు.. 365రోజులు ఆడిన సినిమా ఏదో తెలుసా?

Meena: ఈ సీన్ చూసి థియేటర్ లో ఏడవని వాళ్లు లేరు.. 365రోజులు ఆడిన సినిమా ఏదో తెలుసా?

కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రను వేస్తాయి. ఒకే ఒక్క ఎమోషనల్ సీన్ వల్ల ఓ సినిమా ఏడాదిపాట థియేటర్లలో నడిచిందని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 14 2026, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన సినిమా?
Image Credit : Sun Nxt

ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన సినిమా?

కొన్ని సినిమాలు స్క్రీన్ పై చరిత్ర సృష్టిస్తే.. మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసు పొరల్లో నిలిచిపోతుంటాయి. ఆడియన్స్ పై ప్రభావం చూపించడానికి స్టార్ హీరోలు అవసరం లేదు, భారీ బడ్జెట్లు కూడా అవసరం లేదు. మంచి కథ, ఎమోషన్, గుండెను పిండేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఉంటే చాలు ఆ సినిమాను ఆడియన్స్ అంత తేలిగ్గా మార్చిపోలేరు. అటువంటి సినిమాలలో సీతారామయ్య గారి మనవరాలు మూవీ కూడా ఒకటి. ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను అద్భుతమైన స్క్రీన్ ప్లైతో.. బ్లాక్ బస్టర్ సినిమాగా తీర్చిదిద్దారు దర్శకుడు క్రాంతి కుమార్. ఈమూవీలో ప్రతీ సన్నివేశం ఒక ఆణిముత్యం అని చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ కూడా లేదు..
Image Credit : Sun Nxt

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ కూడా లేదు..

ఫ్యామిలీ ఎమోషన్స్ లో బేస్ చేసుకుని తీసిన ఈమూవీ సోల్ ను.. మానస రాసిన నవ్వినా కన్నీళ్లే అనే నవల నుంచి తీసుకున్నారు. ఆ నవలకు ప్రాణం పోసి.. నిజంగా మన కళ్లెదురుగానే ఈ కథ నడుస్తుందేమో అన్నంత అద్భుతంగా సినిమాను తీర్చి దిద్దాడు దర్శకుడు. అక్కినేని నాగేశ్వరరావు, మీనాల నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అంతే కాదు ఏఎన్నార్ మొదటి సారి విగ్ లేకుండా నటించిన మూవీ ఇది. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మీనా.. సోలో హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా కూడా ఇదే.

35
ప్రతీ సన్నివేశం ఒక ఆణిముత్యమే..
Image Credit : Asianet News

ప్రతీ సన్నివేశం ఒక ఆణిముత్యమే..

తండ్రి మాటకాదని ప్రేమ పెళ్లి చేసుకున్న కొడుకు... విదేశాలకు వెళ్లాడు.. 20 ఏళ్లుగా కొడుకు వస్తాడన్న ఆశతో ఉన్న వారికి మనవరాలి రూపంలో ప్రేమ దొరుకుతుంది. కానీ కొడుకు,కోడలు మరణం గురించి వారికి తెలియదు. కొడుకు ఎప్పుడు వస్తాడని ముసలి ప్రాణాలు ఆమెను ఆశగా అడుగుతుంటే.. తల్లీ తండ్రులు చనిపోయారనే విషయం చెప్పలేక, దాచలేక, మీనా పడిన నరకయాతన అంతా ఇంతా కాదు. ఈ పాత్రలో ఆ ఎమోషన్స్ ను ఏఎన్నార్ కు పోటీగా పండించింది మీనా. తాత, నానమ్మలకు విషయం చెప్పలేక గోదారి తీరాన మీనా ఏడ్చిన సన్నివేశం మనసును కలచివేస్తుంది.

45
365 రోజులు ఆడిన సినిమా..
Image Credit : Asianet News

365 రోజులు ఆడిన సినిమా..

1991 లో రిలీజ్ అయిన సీతారామయ్యగారి మనవరాలు సినిమా కొన్ని థియేటర్స్ లో ఏడాది పాటు ఆడింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరావు, మీనా మధ్య ఎమోషనల్ సీన్స్ కు థియేటర్లలోనే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టారు. కొడుకు పంపిన బహుమతి చూసుకుని తండ్రి కళ్లలో ఆనందం, అమెరికా వెల్లిపొమ్మని తాత తిట్టినప్పుడు మీనాపడే బాధ, నిజం తెలుసుకున్న సీతారామయ్య ఎయిర్ పోర్ట్ లో కొడుకు అస్థికలు చూసినప్పుడు ఏఎన్నార్ ఎక్స్ ప్రెషన్స్, అందుకు తగ్గట్టుగా మీనా ఎమోషనల్ డైలాగ్స్, ప్రతీ ఒక్కరి మనసును కలిచి వేస్తుంది. మనసులో ఇంత బాధను ఎలా మోశావమ్మా అని ఏఎన్నార్ చెప్పగానే.. మీనా మనసులో భారం ఒక్క సారిగా దిగిపోతుంది. ఆమె తాతను హత్తుకుని ఇన్నాళ్ల బరువును కన్నీళ్ల రూపంలో బయటకు తీస్తుంది. ఈ క్లైమాక్స్ సీన్ ను సినీ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు.

55
మీనాతో ఏఎన్నార్ ఏమన్నాడంటే..?
Image Credit : Sun Nxt

మీనాతో ఏఎన్నార్ ఏమన్నాడంటే..?

రిలీజ్ అయ్యి 35 ఏళ్ళు అవుతున్నా.. సీతారామయ్యగారి మనవరాలు  సినిమాను ప్రేక్షకులు మర్చిపోలేదు. అప్పట్లో  సూపర్ హిట్ అయిన ఈసినిమా 4 నంది అవార్డులను తెచ్చిపెట్టింది. అంతే కాదు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈసినిమాను ప్రదర్శించారు. ఇక ఈమూవీని మలయాళం, కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. మీనా నటన చూసిన ఏఎన్నార్.. '' షూటింగ్ లో పెద్దగా అనిపించలేదు కానీ.. సినిమా చూసిన తరువాత నీ నటన అద్భుతంగా అనిపించింది, బాగా చేశావు'' అని మెచ్చుకున్నారట. ఈ విషయాన్ని మీనా ఓ ఇంటర్వ్యలో వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మీనా (నటి)
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Prabhas పై లేడీ డైరెక్టర్ క్రష్.. ఆయన ఎదురైతే ఏం చేస్తుందో తెలుసా? అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదా?
Recommended image2
IBomma: ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక దబిడి దిబిడే.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved