MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • IBomma: ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక దబిడి దిబిడే.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

IBomma: ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక దబిడి దిబిడే.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

టాలీవుడ్ పెద్దలకు మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో మేకర్స్ కు నిద్రలేకుండా చేసిన ఐబొమ్మ.. మరోసారి ఇండస్ట్రీకి అగ్నిపరీక్ష పెట్టింది. ఈసారి అంతకు మించి సినిమా చూపించడానికి రెడీ అవుతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 13 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పైరసీ రూపంలో టాలీవుడ్ కు ఎదురుదెబ్బ
Image Credit : Asianet News

పైరసీ రూపంలో టాలీవుడ్ కు ఎదురుదెబ్బ

టాలీవుడ్ కు మరోసారి పైరసీ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టాలీవుడ్‌ పెద్దలకు నిద్రలేకుండా చేసిన ఐబొమ్మ వెబ్‌సైట్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఐబొమ్మ యాక్టివ్ అవ్వడంతో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి ఆందోళన స్టార్ట్ అయ్యింది. ఈ పైరసీ వెబ్‌సైట్ ఓనర్ రవి అరెస్ట్ అవ్వడంతో పైరసీ సమస్య చాలా వరకూ తగ్గిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా కొత్త డొమైన్లతో ఈ సైట్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిందన్న వార్త టాలీవుడ్ ను కలవరపెడుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
సినీ ప్రముఖులకు పెద్ద షాక్‌
Image Credit : Asianet News

సినీ ప్రముఖులకు పెద్ద షాక్‌

తాజాగా థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు హెచ్‌డీ క్వాలిటీతో ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుండటం నిర్మాతలు, దర్శకులు , సినీ ప్రముఖులను షాక్‌కు గురిచేస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతుండటంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం పడుతున్నట్లు సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

Related image1
CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?
Related image2
100 కోట్ల ఆస్తులు, పదికి పైగా వ్యాపారాలు, 45 ఏళ్ల వయసులో చేతి నిండా సంపాదిస్తోన్న హీరోయిన్ ఎవరు?
35
ఐ బొమ్మ రీ ఎంట్రీ?
Image Credit : Asianet News

ఐ బొమ్మ రీ ఎంట్రీ?

నిజానికి గతంలోనే ఐబొమ్మ తమ సైట్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, కొన్ని సాంకేతిక మార్పులతో కొత్త డొమైన్లను ఉపయోగిస్తూ.. ఈ సైట్ మళ్లీ మొదలయ్యింది, ఈసారి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలే కాకుండా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యే కంటెంట్‌ను కూడా ఈ వెబ్‌సైట్ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు సమాచారం. దీనివల్ల నిర్మాతలు కోట్లాది రూపాయల నష్టాలను ఎదుర్కోక తప్పేట్లు లేదు.

45
అలర్ట్ అయిన యాంటీ పైరసీ సెల్
Image Credit : Asianet News

అలర్ట్ అయిన యాంటీ పైరసీ సెల్

పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ, కొత్త లింకులు , మిర్రర్ డొమైన్ల ద్వారా ఇలాంటి వెబ్‌సైట్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు, యాంటీ పైరసీ సెల్ అలర్ట్ అయ్యాయి. ఈ వెబ్‌సైట్ల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించే పనిని వారు ఇప్పటికే మొదలు పెట్టారు. అసలు ఈ సైట్ ను మళ్లీ మొదలెట్టింది ఎవరు అనే కోణంలో విచారణ జరుగుతున్నట్టు సమాచారం.

55
వేలాది సినీ కార్మికుల కష్టం..
Image Credit : Asianet News

వేలాది సినీ కార్మికుల కష్టం..

సినిమా నిర్మాణం వెనుక వేలాది మంది కార్మికులు, టెక్నీషియన్ల కష్టం ఉంది. నిర్మాతల పెట్టుబడి కూడా ఉంది. కొంత మంది నిర్మాతలు అప్పులు చేసి సినిమాలు చేస్తుంటారు. అలాంటి టైమ్ లో పైరసీ కారణంగా వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయ్యిందని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు పైరసీ వెబ్‌సైట్లను ప్రోత్సహించకుండా థియేటర్లలో కానీ.. అధికారిక ఓటీటీలో కానీ సినిమాలు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఐబొమ్మపై నెక్ట్స్ ఎటువంటి చర్చలు తీసుకుంటారు. ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఐబొమ్మ
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mouni Roy Divorce: విడాకుల దిశగా విశ్వంభర నటి ? భర్త మోసం చేశాడా.. డివోర్స్ కి కారణం ఇదే..
Recommended image2
100 కోట్ల ఆస్తులు, పదికి పైగా వ్యాపారాలు, 45 ఏళ్ల వయసులో చేతి నిండా సంపాదిస్తోన్న హీరోయిన్ ఎవరు?
Recommended image3
Vijayashanti దెబ్బకు ఉన్న కొంప కూడా పోయింది, నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరం.. కసితో బాక్సాఫీస్ బద్దలు
Related Stories
Recommended image1
CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?
Recommended image2
100 కోట్ల ఆస్తులు, పదికి పైగా వ్యాపారాలు, 45 ఏళ్ల వయసులో చేతి నిండా సంపాదిస్తోన్న హీరోయిన్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved