MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Rajinikanth వెక్కి వెక్కి ఏడ్చిన క్షణం... సూపర్ స్టార్ కన్నీళ్ల వెనుక కథ ఏంటో తెలుసా?

Rajinikanth వెక్కి వెక్కి ఏడ్చిన క్షణం... సూపర్ స్టార్ కన్నీళ్ల వెనుక కథ ఏంటో తెలుసా?

ప్రపంచం మెచ్చిన నటుడు సూపర్ స్టార్' రజినీకాంత్ వెనుక ఓ సాధారణ ఎమోషనల్ పర్సన్ కూడా ఉన్నాడు. రజినీకాంత్ ని నటుడిగా  తీర్చిదిద్దింది కె. బాలచందర్. తన గురువును కౌగిలించుకుని రజినీ వెక్కివెక్కి ఏడ్చిన ఘటన గురించి మీకు తెలుసా? కారణం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 17 2026, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కండక్టర్‌ నుంచి సూపర్ స్టార్ గా..
Image Credit : Instagram

కండక్టర్‌ నుంచి సూపర్ స్టార్ గా..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  'సూపర్ స్టార్' స్థాయికి ఎదిగిన నటుడు రజినీకాంత్. కానీ ఆ స్టార్‌డమ్ వెనుక ఉన్న భయం, ఒత్తిడి చాలామందికి తెలియదు. సాధారణ బస్ కండక్టర్‌గా ఉన్న శివాజీ రావును ప్రపంచం మెచ్చిన రజినీగా మార్చింది దర్శకుడు కె. బాలచందర్. ఈ గురుశిష్యుల బంధంలోని ఓ ఎమోషనల్ సంఘటన ఇప్పటికీ అభిమానులను కదిలిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
స్టార్‌డమ్ తెచ్చిన ఒత్తిడి?
Image Credit : X

స్టార్‌డమ్ తెచ్చిన ఒత్తిడి?

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రజినీకాంత్ జీవితం వేగంగా మారిపోయింది. 'అపూర్వ రాగంగళ్' సినిమాతో పరిచయమైన ఆయన, తన ప్రత్యేకమైన నటన, స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. సూపర్ స్టార్ కెరీర్ సూపర్ ఫాస్ట్ గా ఎదుగుతుండటంతో..  ఆయనలో ఓ రకమైన భయాన్ని కూడా సృష్టించిందని అంటారు. కీర్తి మనిషిని పైకి తీసుకెళ్తుంది, కానీ అదే సమయంలో భరించలేని ఒత్తిడిని కూడా ఇస్తుంది.

36
గురువును కలిసిన శిష్యుడు
Image Credit : GOOGLE

గురువును కలిసిన శిష్యుడు

ఆ సమయంలోనే, ఓ రోజు రజినీకాంత్ తన గురువు కె. బాలచందర్‌ను కలిశారు. అది మామూలు మీటింగ్ కాదు. మనసులో దాచుకున్న బాధలన్నీ ఒక్కసారిగా బయటకొచ్చిన క్షణం. కె.బి ముందు నిల్చున్న రజినీ ఒక్కసారిగా కంట్రోల్ కోల్పోయారు. 'ప్రశాంతంగా కండక్టర్‌గా ఉన్న నన్ను, మీరే రజినీకాంత్‌గా మార్చారు. ఈ ఆకస్మిక కీర్తిని నేను తట్టుకోలేకపోతున్నాను సార్...' అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశారట.
46
సున్నిత మనసున్న రజినీకాంత్!
Image Credit : Instagram

సున్నిత మనసున్న రజినీకాంత్!

ఆ దృశ్యం ఒక నటుడి బలహీనతను కాదు, ఆయన ఎంత నిజాయితీపరుడో చూపించింది. ఆ సమయంలో కె. బాలచందర్ రజినీని ఓదార్చి, 'కీర్తి అనేది అల లాంటిది... వస్తుంది, పోతుంది. నీ మీద నీకు నమ్మకం ఉంచుకో' అని సలహా ఇచ్చారట. ఆ మాటలు రజినీకాంత్ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి.
56
కీర్తి శిఖరాల్లో ఉండటానికి కారణం ఇదే!
Image Credit : Google

కీర్తి శిఖరాల్లో ఉండటానికి కారణం ఇదే!

ఆ సంఘటన తర్వాత, రజినీకాంత్ తన మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకోవడం మొదలుపెట్టారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ధ్యానం, ఆధ్యాత్మికత, నిరాడంబరమైన జీవితం.. ఇవన్నీ ఆయన్ని స్థిరమైన వ్యక్తిగా మార్చాయని ఆయన స్నేహితులు చెబుతుంటారు. అందుకే ఈ రోజుకీ ఆయన కీర్తి శిఖరాల్లో ఉన్నా, వినయాన్ని వీడలేదు.

66
ఎప్పటికీ ఉన్నత స్థానంలోనే..
Image Credit : Red Giant Movies, X

ఎప్పటికీ ఉన్నత స్థానంలోనే..

సూపర్ స్టార్‌గా ప్రపంచం చూసే రజినీ వెనుక, ఓ భావోద్వేగభరితమైన మనిషి ఉన్నారనడానికి ఈ కథే చక్కటి ఉదాహరణ. కీర్తి శిఖరాల్లో ఉన్నా, 'నేనూ మనిషినే' అని చెప్పే ఆ కన్నీళ్లే.. రజినీని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Related Stories
Recommended image1
మరిదితో 14 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోయిన్, చిన్నవయసులోనే కన్నుమూసిన తార..
Recommended image2
Rama Prabha : కుక్క తోక వంకర అంటూ.. రమాప్రభ ను అవమానించిన స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved