- Home
- Entertainment
- Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
బిగ్ బాస్ తెలుగు 9లో 96వ రోజు ఇంటి సభ్యుల మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. సంజన, ఇమ్మాన్యుయేల్, తనూజ ఒకరిపై ఒకరు ఫిజికల్ గా దాడి చేసుకునే స్థాయిలో పోటీ పడ్డారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు 9షోలో 96వ రోజు ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఇమ్మాన్యుయేల్ తనని దూరం పెడుతున్నాడని సంజన.. తనూజ తనతో మునుపటిలా ఉండడం లేదని భరణి ఎమోషనల్ అయ్యారు. భరణి అతి తక్కువ పాయింట్స్ తో లీడర్ బోర్డు లో బాటమ్ లో ఉండడం వల్ల నెక్స్ట్ యుద్ధంలో అతడికి పాల్గొనే అవకాశం ఉండదు అని బిగ్ బాస్ తెలిపారు. దీనితో భరణి తన పాయింట్స్ లో సగం వేరొకరికి ఇవ్వాలి. దీనితో భరణి తన పాయింట్స్ ని తనూజకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ కి చెబుతూ భరణి భావోద్వేగంతో వెక్కి వెక్కి ఏడ్చారు. భరణిని తనూజ ఓదార్చే ప్రయత్నం చేసింది. తనూజ తనకి దూరం అవుతున్నప్పటికీ కనీసం తానైనా ఆమెకి సపోర్ట్ చేయాలి కదా అని భరణి అన్నారు.
తనూజ, ఇమ్ము, సంజన మధ్య గొడవ
ఆ తర్వాత సంజన, ఇమ్మాన్యుయేల్, తనూజకి బిగ్ బాస్ కీ టూ సక్సెస్ అనే పోటీ పెట్టారు. కొన్ని వస్తువులు స్విమ్మింగ్ పూల్ లో ఉంటాయి. ముగ్గురు పోటీ దారులు పూల్ లోకి దిగి కీ ఓపెన్ చేసి తమ కలర్ వస్తువులని తీసుకుని బయటకి వచ్చి బోర్డులో అమర్చాలి. గేమ్ పూర్తయ్యే సమయానికి ఎవరి వస్తువులు ఎక్కువ ఉంటే వారే విజేతలు. ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్, సంజన, తనూజ తీవ్రంగా పోటీ పడ్డారు. ఒకరినొకరు లాక్కుని కింద పడ్డారు. దీనితో ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. బజర్ మోగే సమయానికి ఇమ్మాన్యుయేల్ తన వస్తువులని కాపాడుకున్నారు. సంజనవి కూడా కొన్ని ఉన్నాయి. కానీ భరణి ఇమ్మాన్యుయేల్ విజేత అని ప్రకటించారు. దీనితో సంజన తీవ్ర మస్తాపానికి గురైంది. బాటిల్ కింద పడేసి అసహనం వ్యక్తం చేసింది.
నేను మనిషినే, భరించలేను
ఇమ్మాన్యుయేల్ తనని టార్గెట్ చేశాడని బాధపడింది. దీనితో ఇమ్మాన్యుయేల్ తిరిగి ఆమెపై వాగ్వాదానికి దిగాడు. సంజనగారు తనని ఏ విధంగా ప్రేక్షకులకు చూపించాలి అనుకుంటున్నారో అర్థం కావడం లేదు అని అన్నాడు. నేను కూడా మనిషినే. ఇలా చేస్తే భరించలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు.
తనూజ విజయం
ఆ తర్వాత పోటీ ఇమ్మాన్యుయేల్, సంజన మధ్య జరిగింది. బెలూన్స్ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విజయం సాధించాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, సంజన, తనూజ మధ్య సాండ్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా చిన్న ఇసుక బస్తాలని బిగ్ బాస్ చెప్పిన నిబంధనల ప్రకారం ఒక త్రాసులో వేయాలి. ఆ బరువుకి త్రాసు మరోవైపు పైకి లేస్తుంది. అక్కడ ఉన్న ఫ్లాగ్ ని అందుకోవాలి. ఈ ప్రక్రియ ఎవరు ముందుగా పూర్తి చేస్తే వాళ్లే విజేతలు. ఈ టాస్క్ లో తనూజ విజయం సాధించి లీడర్ బోర్డు లో టాప్ పొజిషన్ కి చేరుకుంది.
తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్
గేమ్ లో ఓడిపోయినందుకు ఇమ్మాన్యుయేల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. బిగ్ బాస్ తనూజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. తనూజ పాయింట్స్ లో టాప్ లో ఉంది కాబట్టి ఆమెకి ఫైనలిస్ట్ గా అవకాశం దక్కుతుంది. కానీ బిగ్ బాస్ ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకి ఉన్న పాయింట్స్ ఉపయోగించి ఆమె ఫైనలిస్ట్ గా అవకాశం అందుకోవచ్చు. అలా చేస్తే ఆమె వద్ద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో.. అంత మొత్తాన్ని ప్రైజ్ మనీలో నుంచి తగ్గించాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ తెలిపారు. ఈ ఆప్షన్ ని ఎంచుకుంటావా అని బిగ్ బాస్ తనూజని అడిగారు. ఒక వేళ ఆ ఆప్షన్ ఎంచుకోకుంటే నామినేషన్స్ లో ఉండి ఆడియన్స్ నిర్ణయం ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ తెలిపారు. దీనితో తనూజ పాయింట్స్ ఉపయోగించి ఫైనలిస్ట్ గా ఛాన్స్ పోయిందే ఆప్షన్ ఎంచుకోలేదు. తాను ఆడియన్స్ నిర్ణయం ప్రకారమే నామినేషన్స్ లో ఉండాలని అనుకుంటున్నట్లు తనూజ తెలిపింది.

