MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?

55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?

ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్ల కెరీర్, నాలుగు భాషల్లో 300 వరకూ సినిమాలు, సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సాధించిన హీరోయిన్ ఎవరో తెలుసా? స్టార్ డైరెక్టరుని పెళ్లాడిన ఆమె ప్రస్తుతం ఆమె ఏం చేస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 12 2025, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
40 ఏళ్లుగా కొనసాగుతున్న స్టార్ నటి
Image Credit : facebook.com/ramyakrishnanofficial

40 ఏళ్లుగా కొనసాగుతున్న స్టార్ నటి

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ డమ్ తో కొనసాగుతున్న నటీమణులు చాలా తక్కువ మంది ఉన్నారు. తమదైన గుర్తింపుతో భారీ సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. హీరోయిన్లు గా తెలుగు తెరను ఏలినవారిలో కొంత మంది మాత్రమే ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతూ.. స్టార్ డమ్ తో కంటీన్యూ అవుతున్నారు. వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ఈ నటి.. హీరోయిన్ గా ఎంత స్టార్ డమ్ తెచ్చుకుందో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అంతే స్టార్ డమ్ తో కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
55 ఏళ్ల వయసులో కూడా
Image Credit : facebook.com/ramyakrishnanofficial

55 ఏళ్ల వయసులో కూడా

టాలీవుడ్ లో హీరోయిన్ గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది రమ్య కృష్ణ. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, జగపతి బాబు, వెంకటేష్, శ్రీకాంత్ లాంటి హీరోలతో నటించిన రమ్యకృష్ణ, తమిళంలో రజినీకాంత్, విజయ్ కాంత్, శరత్ కుమార్ లాంటి హీరోలతో ఆడిపాడింది. హిందీలో కూడా అమితాబ్, షారుఖ్ లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది రమ్య కృష్ణ. 40 ఏళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది సీనియర్ నటి. ఇప్పటికీ కీలక పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తన ఇమేజ్ ను నిలబెట్టుకుంటోంది. హీరోయిన్‌గా భారీ స్టార్ డమ్ సంపాదించిన రమ్యకృష్ణ, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా అత్యంత ప్రభావం చూపుతోంది.

35
శివగామి పాత్రతో పెరిగిన పాపులారిటీ..
Image Credit : facebook.com/ramyakrishnanofficial

శివగామి పాత్రతో పెరిగిన పాపులారిటీ..

హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే తెలిసిన రమ్యకృష్ణ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సాధించింది. పవర్ ఫుల్ శివగామిన పాత్రలో మెస్మరైజ్ చేసింది సీనియర్ తార. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంతో రమ్యకృష్ణ కెరీర్ మరోసారి మరో మలుపు తిరిగింది. హీరో, హీరోయిన్ పాత్రలకు పోటీగా నిలిచే స్థాయిలో ఆమె శివగామి పాత్ర ఆదరణ పొందింది. ఈ చిత్రానికి అనేక అవార్డులు కూడా లభించాయి. ఆతరువాత జైలర్ సినిమాలో రజనీకాంత్ భార్యగా నటించిన రమ్యకృష్ణ‌ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా 650 కోట్లకుపైగా వసూళ్లు సాధించి భారీ విజయం అందుకుంది.

45
రమ్యకృష్ణ ఆస్తులు, సంపాదన
Image Credit : facebook.com/ramyakrishnanofficial

రమ్యకృష్ణ ఆస్తులు, సంపాదన

హీరోయిన్ గా సినిమాలు తగ్గిన వెంటనే డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లాడింది రమ్యకృష్ణ. 2003 లో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా భారీగా రెమ్యునరేషన్ వసూలు చేస్తోందట రమ్య కృష్ణ. సినిమాకు 3 కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్టు టాక్. ఈ విషయంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య కాలంలో రమ్యకృష్ణ ఆస్తులు, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశ్రమలో సుదీర్ఘకాలంగా పని చేసిన రమ్యకృష్ణ‌ ఆర్థికంగా స్ట్రాంగ్ అయ్యారు. ఆమెకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయని తెలుస్తోంది. అంతే కాదు కార్లంటే రమ్యకృష్ణకు ప్రత్యేకమైన ఇష్టం ఉండడంతో, ఆమె గ్యారేజ్‌లో అనేక రకాల లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం.

55
రమ్యకృష్ణ సినిమాలు..
Image Credit : facebook.com/ramyakrishnanofficial

రమ్యకృష్ణ సినిమాలు..

నగలు విషయంలో రమ్యకృష్ణకు ప్రత్యేక అభిరుచి ఉంది. వివిధ సందర్భాల్లో గోల్డ్ ను ఎక్కువగా ధరించడానికి ఆమె ఇష్టపడుతుంది.ఇక రమ్యకృష్ణ ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని సమాచారం ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. బాహుబలి తరువాత రమ్యకృష్ణకు అవకాశాలు పెరిగిపోయాయి. 55 ఏళ్ల వయసులో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో కనిపిస్తోంది మాజీ హీరోయిన్. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు తల్లిగా పలు సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రమ్య కృష్ణ
నందమూరి బాలకృష్ణ
దగ్గుబాటి వెంకటేష్
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Krishna కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? జయప్రద, శ్రీదేవి కాకుండా సూపర్ స్టార్ ఫేవరెట్ స్టార్ ఎవరు?
Recommended image2
Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved