- Home
- Entertainment
- Trisha: త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో డేటింగ్ చేసిన హీరోయిన్.. అందరి ముందు ఒప్పేసుకుంది
Trisha: త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో డేటింగ్ చేసిన హీరోయిన్.. అందరి ముందు ఒప్పేసుకుంది
త్రిష నాలుగు పదుల వయసులో కూడా సింగిల్ గానే ఉంది. గతంలో త్రిష ఓ వ్యక్తిని నిశ్చితార్థం చేసుకుంది. కానీ పెళ్లి కాకుండానే అతడితో బ్రేకప్ చేసుకుంది. ఆ వ్యక్తి గురించి ఓ ఆసక్తికర విషయం వైరల్ గా మారింది.

త్రిష ఇంకా సింగిల్ గానే
ప్రస్తుతం స్టార్ హీరోయిన్ త్రిష వయసు 42 ఏళ్ళు. ఇంకా త్రిష సింగిల్ గానే ఉంది. అయితే త్రిష కెరీర్ లో చాలా సార్లు లవ్ ఎఫైర్, డేటింగ్ రూమర్స్ వచ్చాయి. చాలా సార్లు త్రిష తన పర్సనల్ లైఫ్ విషయాలతో వార్తల్లో నిలిచింది. అయితే త్రిష ఇంతవరకు పెళ్లి పీటలు ఎక్కలేదు. ఎగేజ్మెంట్ చేసుకుని అతడితో బ్రేకప్ చేసుకుంది. త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ కావడం అప్పట్లో పెద్ద సంచలనం.
త్రిష నిశ్చితార్థం
2015లో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం జరిగింది. కానీ ఇద్దరి మధ్య విభేదాల వల్ల ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్నారు. 40 ప్లస్ లో కూడా త్రిష హీరోయిన్ గా అద్భుతమైన అవకాశాలు అందుకుంటోంది. త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వరుణ్ మణియన్ తో మరో హీరోయిన్ ఎఫైర్ పెట్టుకుంది.
బిందు మాధవి గురించి రూమర్స్
అప్పట్లో వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వరుణ్ తో డేటింగ్ చేసిన హీరోయిన్ ఎవరో కాదు బిందు మాధవి. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విజేతగా ఆమె నిలిచింది. బిందు మాధవి.. రామరామ కృష్ణ కృష్ణ, పిల్ల జమిందార్ లాంటి చిత్రాల్లో నటించింది.
నిజమే అని ఒప్పుకున్న బిందు మాధవి
ఓ ఇంటర్వ్యూలో త్రిష బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో మీరు డేటింగ్ చేశారా అని బిందు మాధవిని ప్రశ్నించారు. దీనితో బిందు మాధవి నో అని తప్పించుకోకుండా ఓపెన్ గా సమాధానం ఇచ్చింది. నిజమే.. కానీ త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిన వెంటనే కాదు. రెండూ వేర్వేరు టైం లలో జరిగాయి. అతడితో గతంలో డేటింగ్ చేసాను. కానీ అది త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యాక చాలా రోజుల తర్వాత అని బిందుమాధవి పేర్కొంది.
విశ్వంభరలో త్రిష
ప్రస్తుతం బిందు మాధవి తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా టీవీ షోలు కూడా చేస్తోంది. ఇక త్రిష విషయానికి వస్తే.. త్రిష ఈ ఏజ్ లో కూడా భారీ చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

