2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు
2025లో లవ్ అండ్ డేటింగ్ వ్యవహారాలతో వార్తల్లో నిలిచిన 8 జంటల గురించి తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో తెలుగులో రాంచరణ్, మహేష్, ప్రభాస్ తో నటించిన హీరోయిన్లు కూడా ఉన్నారు.

తారా సుతారియా, వీర్ పహారియా
తారా, వీర్ ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు 2025లో అత్యంత చర్చనీయాంశమైన జంటగా నిలిచారు. అప్పటి నుంచి తారా పుట్టినరోజు, ఎయిర్‌పోర్ట్‌లలో కలిసి కనిపిస్తున్నారు.
జాన్వీ కపూర్, శిఖర్ పహారియా
జాన్వీ కపూర్, శిఖర్ చాలా ఈవెంట్లలో కలిసి కనిపించారు. జాన్వీ కపూర్ చాలాసార్లు శిఖర్ పేరు ఉన్న లాకెట్టు కూడా ధరించింది.ప్రస్తుతం జాన్వీ కపూర్ రాంచరణ్ తో పెద్ది చిత్రంలో నటిస్తోంది.
ఖుషీ కపూర్, వేదాంగ్ రైనా
ఖుషీ కపూర్, వేదాంగ్ రైనా 'ది ఆర్చీస్' సినిమాతో అరంగేట్రం చేశారు. ఈ సినిమా తర్వాతే వారి ఎఫైర్ వార్తలు రావడం మొదలయ్యాయి.
సుహానా ఖాన్, అగస్త్య నంద
సుహానా, అగస్త్య న్యూయార్క్‌లోని ఓ ఈవెంట్‌తో సహా చాలాసార్లు కలిసి కనిపించారు. ఇద్దరూ 'ది ఆర్చీస్'తో అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఈ జంట వార్తల్లో ఉంది.
శ్రద్ధా కపూర్, రాహుల్ మోదీ
శ్రద్ధా, రాహుల్ మోదీ తరచుగా చాలా ఈవెంట్లలో కలిసి కనిపిస్తుంటారు. అయితే, వారు తమ సంబంధంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రద్దా కపూర్ సాహోలో నటించిన సంగతి తెలిసిందే.
కృతి సనన్, కబీర్ బహియా
ఈ రోజుల్లో కృతి పేరు వ్యాపారవేత్త కబీర్ బహియాతో ముడిపడి ఉంది. అయితే, ఆమె తన సంబంధాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. కృతి సనన్ తెలుగులో మహేష్ సరసన 1 నేనొక్కడినే లో నటించింది.
తృప్తి డిమ్రి, సామ్ మర్చంట్
తృప్తి డిమ్రి పేరు మోడల్ నుంచి వ్యాపారవేత్తగా మారిన సామ్ మర్చంట్‌తో ముడిపడి ఉంది. ఇద్దరూ కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
అహాన్ పాండే, అనీత్ పడ్డా
అహాన్ పాండే, అనీత్ పడ్డా బ్లాక్‌బస్టర్ చిత్రం 'సైయారా'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. వారి కెమిస్ట్రీని ప్రజలు బాగా ఇష్టపడ్డారు. అప్పటి నుంచి వారి డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి.

