- Home
- Entertainment
- Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్, అల్లు అర్జున్ జుజూబీ
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్, అల్లు అర్జున్ జుజూబీ
సౌత్ ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తాయి. కానీ వీళ్లని మించిన పారితోషికం తీసుకున్నది ఒకే ఒక్కడు.

అత్యధిక పారితోషికం తీసుకున్న ఫస్ట్ హీరో ప్రభాస్
సౌత్ ఇండియన్ సినిమాలో ఇప్పుడు బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ పేరు వినిపిస్తోంది. కానీ ఆయన ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.150 కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. మన వద్ద ఎక్కుక పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలుస్తున్నారు. మిగిలిన ఏ హీరో కూడా తీసుకోనప్పుడు డార్లింగ్‌కి ఇచ్చారు. దీంతో ఇప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ప్రభాస్ నిలిచారని చెప్పొచ్చు.
ప్రభాస్ సరసన అల్లు అర్జున్ చేరారు
ఇక ఆయన తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో అల్లు అర్జున్ కూడా చేరిపోయారు. `పుష్ప 2` తో కలెక్షన్లు సునామీ సృష్టించిన బన్నీ.. ఈ మూవీకి గట్టిగానే తీసుకున్నారు. కలెక్షన్లలో షేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన అట్లీ సినిమాకి రెండు వందల కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారని అంటున్నారు.
కోలీవుడ్ తళపతి విజయ్
మరోవైపు కోలీవుడ్ స్టార్ తళపతి విజయ్ కూడా గట్టిగానే తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్న నేపథ్యంలో తన చివరి మూవీ `జన నాయకుడు` చిత్రానికి గట్టిగా ఇస్తున్నారట. ఈ చిత్రానికి రెండు వందల కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రాబోతున్న విషయంత తెలిసింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇదే మూవీ చివరిది కావడంతో ఆయనకు కావాలనే ఎక్కువగా ఇస్తున్నట్టు సమాచారం.
అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రజనీ రికార్డ్
కానీ వీరి ముగ్గురి కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరో ఉన్నారు. ఆయనే సూపర్‌స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం ఆయన రూ.150నుంచి రెండు వందల కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. అయితే `జైలర్` మూవీ విషయంలో మాత్రం భారీగా ముట్టింది. మొదట ఆయనకు రూ.150కోట్ల పారితోషికం ఇచ్చారు. కానీ ఆ మూవీ సంచలన విజయం సాధించడంతో మరో వంద కోట్లు అదనంగా పారితోషికం ఇచ్చారు సన్ పిక్చర్స్ అధినేత. దీంతో ఆయనకు ఆ సినిమాకి ఏకంగా రూ.250కోట్లు ముట్టిందని చెప్పొచ్చు. ఇలా సౌత్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రజనీకాంత్ సంచలనం సృష్టించారు.
రజనీకాంత్ 75వ పుట్టిన రోజు
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు తన పుట్టిన 75వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో 1950 డిసెంబర్ 12న రామోజీ రావు, రామా బాయి దంపతులకు నాలుగో కొడుకుగా శివాజీ రావు(రజనీకాంత్ అసలు పేరు) పుట్టారు. బెంగళూరులో చదివిన శివాజీరావు, చదువుపై కాకుండా నటనపై దృష్టి పెట్టారు. చదువు తర్వాత బస్ కండక్టర్‌గా పనిచేస్తూ నాటకాల్లో నటించారు. 1975లో 'కథా సంగమ' అనే కన్నడ చిత్రంతో అరంగేట్రం చేశారు. అదే ఏడాది కె.బాలచందర్ 'అపూర్వ రాగంగళ్'లో చిన్న పాత్ర చేశారు. `మూండ్రు ముడిచ్చు`, `16 వయదినిలే` లాంటి చిత్రాలు రజనీని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. విలన్‌గా చేస్తూ హీరోగా మారిన మొదటి సినిమా 'భైరవి'. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాలతో రజినీకాంత్ స్టార్ అయ్యారు. కె.బాలచందర్ సలహాతో తమిళం నేర్చుకుని అగ్ర నటుడిగా ఎదిగారు. ఇప్పుడు తిరుగులేని సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. చివరగా ఆయన `కూలీ` చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు. కానీ ఇది బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన `జైలర్ 2`లో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్‌తోపాటు రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నట్టు సమాచారం.

