- Home
- Entertainment
- బిగ్ బాస్ హౌజ్‌లో పెళ్లి సందడి.. సిస్టర్‌ని పెళ్లికూతురు చేసిన తనూజ.. గుండెని బరువెక్కించే సన్నివేశం
బిగ్ బాస్ హౌజ్‌లో పెళ్లి సందడి.. సిస్టర్‌ని పెళ్లికూతురు చేసిన తనూజ.. గుండెని బరువెక్కించే సన్నివేశం
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్ లో పెళ్లి సందడి నెలకొంది. తన సిస్టర్ రావడంతో ఆమెని పెళ్లి కూతురుని చేసింది తనూజ. ఈ సందర్భంగా ఇద్దరు సిస్టర్స్ ఆనందానికి అవదుల్లేవ్. హౌజ్ ని ఇది ఎమోషనల్‌గా మార్చేసింది.

బిగ్ బాస్ హౌజ్‌లో పెళ్లి సందడి
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో 11 వారం మంగళవారం ఎపిసోడ్‌ని ఫ్యామిలీ వీక్‌గా మార్చాడు బిగ్ బాస్. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్‌గా ఉండబోతుంది. అందులో భాగంగా మొదట తనూజ సిస్టర్ వచ్చింది. మరో సిస్టర్ కుమారుడితో ఆమె హౌజ్‌లోకి రావడం విశేషం. చెల్లి హౌజ్‌లోకి రావడంతో తనూజ ఆనందానికి అవదుల్లేవ్. ఈ సందర్భంగా హౌజ్‌లో పెళ్లి సందడి నెలకొంది.
సిస్టర్ బాబుని చూసి తనూజ సర్‌ప్రైజ్
తనూజ సోదరి పెళ్లి త్వరలోనే ఉంది. ఆ మధ్య చెల్లి నుంచి లెటర్ వచ్చిందని నాగార్జున తెలిపారు. కానీ తనూజ రిజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఏకంగా కాబోయే పెళ్లి కూతురునే హౌజ్‌లోకి పంపించారు. తనూజ సిస్టర్, మరో చిన్నబాబుతో హౌజ్‌లోకి వచ్చింది. మొదట చిన్నారిని హౌజ్‌లోకి పంపించారు. ఆ చిన్నోడిని చూసి తనూజ సర్‌ప్రైజ్ అయ్యింది. సంతోషాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత హౌజ్‌లోకి తీసుకెళ్లి అందరికి పరిచయం చేసింది. ఆ బాబుతో అమ్మా అమ్మా అని పిలిపించింది.
సిస్టర్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ
ఇంతలోనే తనూజ సిస్టర్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఆమె పెళ్లి ఉంది. తనూజ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న నేపథ్యంలో ఆమె పెళ్లికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటుంది. అందుకే ముందుగానే ఈ ఇద్దరిని కలుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్. సోదరి ఎంట్రీతో తనూజ మరోసారి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెని హగ్ చేసుకుని బోరున విలపించింది. ఈ సందర్భంగా పెళ్లికూతురు అంటూ హౌజ్‌కి పరిచయం చేసింది తనూజ. ఈ సందర్భంగా కాబోయే పెళ్లికూతురు మాట్లాడుతూ, కొన్ని రోజుల్లోనే నా పెళ్లి. అంతా పెళ్లి సందడి నెలకొంది. మ్యారేజ్ కి సంబంధించిన పనులు అనూ, అమ్మ హ్యాండిట్ చేస్తున్నారు. ఏ లోటు లేకుండా అన్నీ జరుగుతున్నాయి. నువ్వు ఏడవాలని మేం కోరుకోవడం లేదు అని తెలిపింది.
బిగ్ బాస్ హౌజ్‌లోనే చెల్లిని పెళ్లి కూతురు చేసింది
ఇంటి వద్ద ఉంటే సిస్టర్‌గా తనూజ పెళ్లి కూతురుని చేసేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో బిగ్ బాస్ హౌజ్‌నే అందుకు వేదికగా చేసుకుంది. చెల్లిని పెళ్లికూతురుని చేసింది. బొట్టు పెట్టి, గాజులు, చీర అందించింది. చెల్లి తనూజ కాళ్లు మొక్కడంతో అక్షింతలు వేస్తూ, ఆశీర్వదించింది. దీంతో అటు చెల్లికి, ఇటు అక్క ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఈ మూమెంట్‌ని చూసి ఇతర కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. ఆనందంతో అభినందనలు తెలియజేశారు. ఈ సన్నివేశం బిగ్ బాస్ హౌజ్‌లో హైలైట్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన ఈ మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.