తప్పు తనూజదే, తేల్చేసిన కళ్యాణ్.. దివ్య, రీతూ కలిసి ఇమ్మాన్యుయెల్‌ని నలిపేశారు
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 11వవారం నామినేషన్ల ప్రక్రియ చాలా హిటెక్కించేలా జరిగింది. ఇందులో దివ్య, రీతూ చౌదరీ కలిసి ఇమ్మాన్యుయల్‌ని నలిపేయడం విశేషం.

11 వ వారం నామినేషన్
బిగ్ బాస్ తెలుగు 9 సోమవారం(71వ ఎపిసోడ్)లో నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఇందులో కొందరికి ఇద్దర్ని నామినేట్ చేసే అవకాశం, మరికొందరికి ఒక్కరినే నామినేట్ చేసే అవకాశం కల్పించారు బిగ్ బాస్. అయితే అది కెప్టెన్ తనూజ నిర్ణయం మేరకు ఉంటుంది. అందులో ఇమ్మాన్యుయెల్‌కి, డీమాన్ పవన్‌కి, రీతూ, భరణిలకు రెండు నామినేషన్ చేసే అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా, డీమాన్ పవన్.. రీతూతోపాటు కళ్యాణ్‌ని, భరణి.. రీతూతోపాటు ఇమ్మాన్యుయెల్‌ని, ఇమ్మాన్యుయెల్.. భరణి, రీతూని, కళ్యాణ్.. డీమాన్ పవన్, సంజనా.. కళ్యాణ్‌ని, రీతూ.. దివ్య, సంజనాలను, సుమన్.. కళ్యాణ్‌ని, దివ్య.. రీతూని, నామినేట్ చేశారు.
ఇమ్మాన్ముయెల్‌పై ఫైర్ అయిన భరణి
ఈ క్రమంలో భరణి, ఇమ్మాన్యుయెల్ మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ఎప్పుడూ లేని విధంగా భరణి రెచ్చిపోయారు. ఇన్నాళ్లకి ఆయనలోని ఫైర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత రీతూ, డీమాన్ పవన్‌ల మధ్య గట్టి వాదనలు జరిగాయి. ఇద్దరూ విడిపోయినంత పనిచేశారు. ఈ క్రమంలో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే డీమాన్ పవన్, కళ్యాణ్ మధ్య కూడా గట్టి గొడవే జరిగింది. ఇంకోవైపు దివ్య, రీతూలు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు, నీకు టాస్క్ లు ఆడటం చేతకాదంటూ కామెంట్ చేసింది దివ్య.
తనూజదే తప్పు, తేల్చేసిన కళ్యాణ్
ఇక కమాండర్ టాస్క్ లో తనూజని డీమాన్ పవన్ వెనకాల నుంచి టచ్ చేశాడు. అది కావాలని చేసింది కాదని పవన్ చెబుతూ వచ్చాడు. శనివారం ఎపిసోడ్ లోనూ నాగార్జున ముందు అనే చెప్పాడు. నాగ్ సైతం దానిపై క్లారిటీ ఇచ్చాడు. అయితే అలాంటి సమయంలో తనకు కళ్యాణ్ సపోర్ట్ లేదని, తాను ఎందుకు బాధపడుతున్నానో అడగలేదని పవన్.. కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. ఇందులో తప్పు తనూజదే అని చెప్పాడు కళ్యాణ్. దీంతో దెబ్బకి తనూజ షాక్ అయ్యింది.
రీతూ, దివ్య మధ్య హీటెక్కించే వాదనలు
మరోవైపు సుమన్ శెట్టి, కళ్యాణ్ లమధ్య కూడా వాదనలు జరిగాయి. కళ్యాణ్ సంచాలక్‌గా క్లారిటీ మెయింటేన్ చేయలేదని, కన్‌ఫ్యూజ్ చేశాడని వాదించారు. మొత్తంగా ఈ వారం రీతూ చౌదరీ, భరణి, ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, దివ్య, సంజనా, డీమాన్ పవన్ నామినేషన్‌లో ఉన్నారు. అయితే వీరిలో కెప్టెన్ అయిన తనూజకి ఒకరిని నామినేషన్ నుంచి తొలగించే అధికారం ఇవ్వగా, రీతూని సేవ్ చేసింది. దీంతో 11వ వారం సంజనా, డీమాన్ పవన్, కళ్యాణ్, భరణి, దివ్య, ఇమ్మాన్యుయెల్ నామినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
ఇమ్మాన్యుయెల్‌ని నలిపేసిన దివ్య, రీతూ
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 9 అన్ సీన్ కట్‌లో ఫన్నీ అంశాలు చూపించారు. అందులో భాగంగా హౌజ్‌లో పాటలు పాడొద్దని బిగ్ బాస్ తెలిపారు. దివ్య, రీతూ, కళ్యాణ్ కూడా పాటలు పాడారు. కళ్యాణ్‌కి బాత్ రూమ్ కడిగే పనిష్‌మెంట్ ఇవ్వగా, రీతూ చౌదరీ, దివ్య అబ్బాయిల్లాగా మారిపోయారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఇమ్మాన్యుయెల్‌ని నలిపేశారు. హగ్ ఇస్తానంటూ రీతూపైకి వెళ్లాడు ఇమ్మాన్యుయెల్. కానీ తాను ఇస్తానంటూ దివ్య వచ్చింది. దీంతో పరార్ అయ్యాడు. ఎట్టకేలకు ఇద్దరు పట్టుకుని ఇమ్మన్యుయెల్‌ని నలిపేశారు. ఆ తర్వాత కళ్యాణ్‌ని కూడా ఆడుకున్నారు. మొత్తానికి అన్ సీన్ కట్ ఆద్యంతం ఎంటర్ టైనింగ్‌గా సాగింది.