- Home
- Entertainment
- Ram Charan: రాంచరణ్- జాన్వీ కపూర్ నుంచి కార్తీక్ - శ్రీలీల వరకు.. 2026లో రాబోయే క్రేజీ జంటలు
Ram Charan: రాంచరణ్- జాన్వీ కపూర్ నుంచి కార్తీక్ - శ్రీలీల వరకు.. 2026లో రాబోయే క్రేజీ జంటలు
రాంచరణ్, జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కలిసి నటించడం ఇదే తొలిసారి. వీరితో పాటు మరికొందరు కొత్త జంటలు సిల్వర్ స్క్రీన్ పై 2026లో సందడి చేయబోతున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2026’s Most Awaited On-Screen Pairs
తెరపై కొత్త జంటల కెమిస్ట్రీ చూడటం ప్రేక్షకులకు ఎప్పుడూ ఆనందమే. 2026లో సినీ ప్రియులకు అదిరిపోయే ట్రీట్ ఉండబోతోంది. సరికొత్త జంటలు వెండితెరపై మ్యాజిక్ చేయనున్నాయి.
మృణాల్ ఠాకూర్- సిద్ధాంత్ చతుర్వేది
2026లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జంట మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది. వీరిద్దరూ 'దో దీవానే షెహర్ మే' అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 20న విడుదల కానుంది.
రామ్ చరణ్- జాన్వీ కపూర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో కలిసి 'పెద్ది' అనే యాక్షన్-స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న థియేటర్లలోకి రానుంది.
రణబీర్ కపూర్-సాయి పల్లవి
నితీష్ తివారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'రామాయణం'లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది.
కార్తీక్ ఆర్యన్- శ్రీలీల
కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో 'తూ మేరీ జిందగీ హై' అనే రొమాంటిక్ మ్యూజికల్ రాబోతోంది. ఈ సినిమా 2026 మేలో విడుదల కానుండటంతో ఈ కొత్త జంటపై మంచి బజ్ ఉంది.
ఇబ్రహీం అలీ ఖాన్- శ్రీలీల
ఇబ్రహీం అలీ ఖాన్, శ్రీలీలతో కలిసి 'దిలేర్' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నారు. కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఈ కొత్త జంటను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

