- Home
- Entertainment
- విజయ్ దళపతి చివరి సినిమా ఓటీటీ రిలీజ్ ఎందులోనో తెలుసా? జననాయగన్ ఎంతకు అమ్ముడుపోయిందంటే?
విజయ్ దళపతి చివరి సినిమా ఓటీటీ రిలీజ్ ఎందులోనో తెలుసా? జననాయగన్ ఎంతకు అమ్ముడుపోయిందంటే?
Thalapathy Vijays Jananayagan OTT Rights : దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జననాయగన్'. ఈసినిమా థియేటర్ రిలీజ్ కంటే ముందు..ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ దళపతి మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న సంస్థ ఏదో తెలుసా?

విజయ్ తీసుకున్న నిర్ణయం
దళపతి విజయ్, దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన 'జననాయగన్' సినిమా పూర్తి చేశారు. ఇది దళపతి చివరి సినిమా అని అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. తన రాజకీయ ప్రయాణానికి సినిమా అడ్డు రాకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది శాశ్వత నిర్ణయమా?
విజయ్ సినిమాలు మానేయడం అనేది శాశ్వత నిర్ణయమా లేక తాత్కాలికమా అనేది వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని అని అందరూ ఎదురుచూస్తున్నారు.
విజయ్ పారితోషికం
ఈ సినిమాలో దళపతి విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్రలో నటించింది. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి విజయ్‌కి 275 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.
భగవంత్ కేసరి రీమేక్
సంక్రాంతికి జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'దళపతి కచేరి' నిన్న విడుదలైంది. ఇది విజయ్ కెరీర్‌లో పాడిన చివరి పాట కావచ్చు. ఈ పాట చూశాక, ఇది బాలకృష్ణ తెలుగులో నటించిన 'భగవంత్ కేసరి' సినిమా రీమేక్ అని అభిమానులు నిర్ధారించారు.
'జననాయగన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్
జననాయగన్ సినిమా నుంచి విజయ్ పాడిన పాట విడుదలైన నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. థియేటర్లలో విడుదలయ్యాక 'జననాయగన్' ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతోందో తెలిసిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం అమెజాన్ 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం.