MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్

మంచు మనోజ్‌ భారీ స్కెచ్‌ వేశాడు. ఆయన `డేవిడ్‌ రెడ్డి` చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇందులో రామ్‌ చరణ్‌, శింబులు నటించబోతున్నారట. దీనిపై మంచు మనోజ్‌ స్పందించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 17 2025, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డేవిడ్‌ రెడ్డిగా వస్తోన్న మంచు మనోజ్‌
Image Credit : Asianet News

డేవిడ్‌ రెడ్డిగా వస్తోన్న మంచు మనోజ్‌

మంచు మనోజ్‌ అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడని చెప్పొచ్చు. చాలా గ్యాప్‌తో ఆయన నటించిన `భైరవం` మూవీ పెద్దగా ఆడకపోయినా, ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత `మిరాయ్‌` మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇందులో విలన్‌గా నటించినా, హీరో రేంజ్‌లో ఆయన పాత్ర ఉండటం విశేషం. దీంతో మనోజ్‌కి క్రేజ్‌ మరింత పెరిగింది. దాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు మనోజ్‌. ఇప్పుడు హీరోగా వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `డేవిడ్‌ రెడ్డి`. ఈ చిత్రం నుంచి గ్లింప్స్ ని విడుదల చేశారు.

25
`డేవిడ్‌ రేంజ్‌` గ్లింప్స్
Image Credit : Asianet News

`డేవిడ్‌ రేంజ్‌` గ్లింప్స్

ఈ గ్లింప్స్ ఎలా ఉందనేది చూస్తే, ఒక ఫ్యాక్టరీని చూపిస్తూ గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. ఏంటి నాన్న చాలా రోజులుగా మన ఫ్యాక్టరీ నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయని ఓ చిన్న పిల్లాడు, తన తండ్రిని అడుగుతున్నట్టుగా వాయిస్‌ ఓవర్‌ వినిపించింది. రాత్రి కూడా వర్క్ జరుగుతుంది. ఏం వర్క్ నాన్న అంటే, వేగాన్ని తయారు చేస్తున్నామని చెబుతాడు తండ్రి. వేగమా అంటే అని కొడుకు అడగ్గా, నీకు సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌ తెలుసుకదా, నీకు ఇంకొక్కని గురించి చెప్పాలి. అతనిదే ఈ వేగం. అతను బ్రిటిషర్స్ కి శత్రువే, ఇండియన్స్ కి శత్రువే. నీకు మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను కదా, ఆ తర్వాత జరిగినదే జలియన్‌ వాలా బాగ్‌, భారతీయులు రక్తం తాగిన రోజు.

Related Articles

Related image1
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
Related image2
హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
35
ఇది డేవిడ్‌ రెడ్డి ఇండియా
Image Credit : Asianet News

ఇది డేవిడ్‌ రెడ్డి ఇండియా

ఎదురించి పోరాడలేక, చాలా మంది సర్దుకుపోయారు. ఒక్కడు మాత్రం సిద్ధమయ్యాడు. కోట్ల మంది కోపం వాడి ఒక్కడి రక్తంలో నిండి ఉంది. మరిగే రక్తం నిప్పులు కక్కింది, గుండె కదిలే వేగానికి నేల కదిలింది. ఆ వేగాన్ని తోలే వేగాన్ని తన పంజాతో సృష్టించాడు. మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటిషర్స్ కి, అతను వార్‌ డాగ్‌ అయ్యాడు` అని చెబుతాడు తండ్రి. అనంతరం మంచు మనోజ్‌ ఎంట్రీ ఇస్తాడు. కొత్త గెటప్‌లో భారీ రాడ్డు తీసుకుని, చుట్ట కాలుస్తూ అదిరిపోయే లుక్‌లో మంచు మనోజ్‌ ఎంట్రీ ఇచ్చాడు. `ఏ బ్రిటీష్‌ ఇండియా నహీ హై, డేవిడ్‌ రెడ్డి ఇండియా` అని చెప్పడం అదిరిపోయింది.

45
అదిరిపోయిన డేవిడ్‌ రెడ్డి గ్లింప్స్
Image Credit : Asianet News

అదిరిపోయిన డేవిడ్‌ రెడ్డి గ్లింప్స్

ఇందులో మంచు మనోజ్‌ డేవిడ్‌ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన కోసం ఫ్యాక్టరీలో ఓ బైక్‌ని తయారు చేస్తారు. వార్‌ డాగ్‌ అనే పేరు పెడతారు. అది మొత్తం ఐరన్‌తో, పాత ఐరన్‌ మనిముట్లతో తయారు చేయడం విశేషం. అయితే హిస్టారికల్ నేపథ్యంలో జలియన్‌ వాలా బాగ్‌ కథ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. అయితే ఇది నేటితరం మరో జలియన్‌ వాలా బాగ్‌గా కథని ఆవిష్కరించేలా ఉంది. గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా రవి బన్సూర్‌ బిజీఎం దుమ్ములేపేలా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమాకి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించారు. వెల్వెట్‌ సోల్‌ మోషన్‌ పిక్చర్స్ నిర్మిస్తోంది. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు.

55
డేవిడ్‌ రెడ్డిలో రామ్‌ చరణ్‌, శింబు
Image Credit : Asianet News

డేవిడ్‌ రెడ్డిలో రామ్‌ చరణ్‌, శింబు

ఇదిలా ఉంటే దీన్ని భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారట. అంతేకాదు ఇందులో గెస్ట్ రోల్స్ ఉండబోతున్నాయట. రామ్‌ చరణ్‌ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటికే రామ్‌ చరణ్‌ని కలిశారట. బలమైన ఓ పాత్రకి స్కోప్‌ ఉందని, రామ్‌ చరణ్‌ని కలిసినట్టు తెలిపారు మంచు మనోజ్‌. ఆయన నటిస్తాడా? లేదా అనేది కన్ఫమ్‌ చేయలేదు. దాని గురించి మున్ముందు మాట్లాడతామని తెలిపారు మనోజ్‌. అంతేకాదు రామ్‌ చరణ్‌తోపాటు శింబు కూడా కనిపిస్తారని తెలుస్తోంది. ఇదే నిజమైతే `డేవిడ్‌ రెడ్డి` సినిమా రేంజ్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
మంచు మనోజ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image3
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
Recommended image2
హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved