MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jason Sanjay: దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ లవ్ బ్రేకప్ స్టోరీ.. అసలేం జరిగిందంటే?

Jason Sanjay: దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ లవ్ బ్రేకప్ స్టోరీ.. అసలేం జరిగిందంటే?

Jason Sanjay: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ కి ఓ లవ్ స్టోరీ ఉందని మీకు తెలుసా? సిగ్మా' డైరెక్టర్ ప్రేమకథలో ట్విస్ట్ ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 07 2026, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డైరెక్టర్ గా మారిన హీరో తనయుడు..
Image Credit : others

డైరెక్టర్ గా మారిన హీరో తనయుడు..

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. తండ్రిలాగా యాక్టింగ్ వైపు వెళ్లకుండా, డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన మొదటి సినిమా 'సిగ్మా'తో మంచి సక్సెస్ అందుకున్నాడు. సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న జేసన్, రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా కాలేజీ రోజుల్లోని తన లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి అతను చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లైఫ్‌లో ప్రేమించింది ఒక్కసారే
Image Credit : Instagram

లైఫ్‌లో ప్రేమించింది ఒక్కసారే

జేసన్ సంజయ్ చెప్పిన దాని ప్రకారం.. అతను తన జీవితంలో ఒక్కసారే ప్రేమలో పడ్డాడట. అది కూడా కాలేజీ రోజుల్లోనే. దాదాపు ఏడాదిన్నర పాటు వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ రానురాను ఆ రిలేషన్‌షిప్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అందుకే ఎలాంటి గొడవలు, నిందలు లేకుండా ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని, పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు జేసన్ క్లారిటీ ఇచ్చాడు.

బ్రేకప్ తర్వాత రోజులు జేసన్‌కు అంత ఈజీగా గడవలేదట. ఆ బాధ నుంచి బయటపడటానికి అతను మ్యూజిక్‌ను ఆశ్రయించాడు. ముఖ్యంగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా లవ్ సాంగ్స్ కంటిన్యూగా వినేవాడినని జేసన్ చెప్పుకొచ్చాడు. పాత జ్ఞాపకాలకు దూరంగా ఉండటానికి సోషల్ మీడియాకు కూడా కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చాడట.

34
పాత బంధాన్ని మళ్లీ కలపాలనుకుంటే బాధే మిగులుతుంది
Image Credit : Instagram

పాత బంధాన్ని మళ్లీ కలపాలనుకుంటే బాధే మిగులుతుంది

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టడం, పాత రిలేషన్‌ను మళ్లీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయడం వల్ల బాధ మరింత పెరుగుతుందని జేసన్ రియలైజ్ అయ్యాడు. అందుకే ఇద్దరూ పూర్తిగా కాంటాక్ట్ కట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మనసుకు కష్టంగా అనిపించినా, తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి మెల్లగా ఆ ఫేజ్ నుంచి బయటపడ్డాడట. ఇప్పుడు ఆ విషయాన్ని కేవలం గతం లాగే చూస్తున్నానని, లైఫ్‌లో ఎవరైనా సరే ఏదో ఒక దశలో ముందుకు సాగాల్సిందేనని జేసన్ మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు.

ఇక ఇప్పుడు జేసన్ ఫోకస్ మొత్తం సినిమాల పైనే ఉంది. 'సిగ్మా' సినిమా కథ, స్క్రిప్ట్, డైరెక్షన్ పనుల్లో బిజీగా గడిపిన అతను.. తన మొదటి ప్రయత్నానికి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి సోమవారం ముగిసేసరికి ఇండియాలో ₹6.19 కోట్ల నెట్, ₹7.04 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.

44
కొడుకు సినిమా సక్సెస్‌కు తండ్రి సపోర్ట్
Image Credit : X

కొడుకు సినిమా సక్సెస్‌కు తండ్రి సపోర్ట్

కొడుకు సినిమా సక్సెస్‌కు తండ్రి విజయ్ కూడా తన వంతు సపోర్ట్ ఇచ్చారు. 'సిగ్మా' రిలీజ్ రోజు మదురాంతకంలో జరిగిన రోడ్ షోలో ఓ కార్యకర్త ఇచ్చిన జేసన్ ఫోటో ఫ్రేమ్‌ను విజయ్ గర్వంగా తలపైకి ఎత్తి జనాలకు చూపించారు. ఈ సీన్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెన్నైలోని ఓ థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేశారు.

మొత్తానికి కాలేజీ లవ్, బ్రేకప్ పెయిన్, యువన్ సాంగ్స్, సినిమా డ్రీమ్స్.. ఇలా జేసన్ సంజయ్ లైఫ్‌లోని ఈ డిఫరెంట్ యాంగిల్స్ ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Wild Card Entry: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చేది వీళ్లే.. ఇప్పుడే అసలు మజా
Recommended image2
NTR: జనాలు రాళ్ళతో కొడతారేమో అని ఎన్టీఆర్ భయం, 10 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్..
Recommended image3
Roja Selvamani: చిరంజీవి, రోజా, సురేఖ దొంగతనంగా మారువేషంలో చేసిన పనేంటో తెలుసా? వామ్మో అరాచకం
Related Stories
Recommended image1
NTR: జనాలు రాళ్ళతో కొడతారేమో అని ఎన్టీఆర్ భయం, 10 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్..
Recommended image2
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved