MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR: జనాలు రాళ్ళతో కొడతారేమో అని ఎన్టీఆర్ భయం, 10 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్..

NTR: జనాలు రాళ్ళతో కొడతారేమో అని ఎన్టీఆర్ భయం, 10 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్..

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా ఫ్లాప్ అయ్యింది. 'డైరెక్టర్ పరిస్థితి ఏంటో' అని ఆలోచించాడు తారక్. జనాలు రాళ్లతో కొడతారేమో అని భయపడ్డాడు. కానీ ఆ దర్శకుడు మాత్రం ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చాడు. అప్పుడు నందమూరి హీరో ఏం చేశాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 07 2026, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పూరీ జగన్నాథ్   జూనియర్ ఎన్టీఆర్ రేర్ కాంబినేషన్
Image Credit : Asianet News

పూరీ జగన్నాథ్ - జూనియర్ ఎన్టీఆర్ రేర్ కాంబినేషన్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అరుదైన కాంబినేషన్లలో దర్శకుడు పూరీ జగన్నాథ్, 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జంటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'టెంపర్' (Temper) చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద మైలురాయిగా నిలవడమే కాకుండా, ఆయనలోని నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే ఈ హిట్ కంటే ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఒక డిజాస్టర్ ఫ్లాప్ సినిమా, ఆ తర్వాత కూడా వారి మధ్య చెక్కుచెదరకుండా ఉన్న అనుబంధం గురించి ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జనాలు రాళ్లతో కొడతారేమో అన్న ఎన్టీఆర్..
Image Credit : Asianet News

జనాలు రాళ్లతో కొడతారేమో అన్న ఎన్టీఆర్..

ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్‌లో మొదట వచ్చిన చిత్రం 'ఆంధ్రావాలా'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరోలు, దర్శకుల మధ్య దూరాలు పెరగడం లేదా పలకరించే తీరు మారడం సహజం. కానీ, ఎన్టీఆర్ విషయంలో అలా జరగలేదు.

ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఎన్టీఆర్ పూరీకి ఫోన్ చేయగానే, ఆయన ఎప్పటిలాగే అదే కాన్ఫిడెన్స్‌తో "భయ్యా" అని మాట్లాడారట. ఎన్టీఆర్ మాత్రం కాస్త బాధతో "భయ్యా.. మన సినిమా పోయింది. బయటకు వెళ్తే రాళ్లతో కొడతారేమో" అని అన్నారట. కానీ పూరీ మాత్రం అదే ధైర్యంతో, నమ్మకంతో మాట్లాడటం తారక్‌కు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది.

34
రెండో సినిమాకు 10 ఏళ్లకు పైనే పట్టింది..
Image Credit : Asianet News

రెండో సినిమాకు 10 ఏళ్లకు పైనే పట్టింది..

'ఆంధ్రావాలా' లాంటి పెద్ద ఫ్లాప్ వచ్చిన తర్వాత కూడా తనను చూసిన ప్రతిసారీ పూరీ జగన్నాథ్ ఎంతో ఆప్యాయంగా "ఏంటి భయ్యా.. ఎలా ఉన్నావ్ భయ్యా?" అంటూ పలకరించేవారని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పూరీ చూపించే ఆ ప్రేమ, కాన్ఫిడెన్స్, గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని.. అందుకే ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని ఎన్టీఆర్ అప్పుడే పూరీతో చెప్పారట. కానీ వీరిద్దరి కాంబో మళ్లీ కలవడానికి 10 ఏళ్లు పట్టింది. దానికి ప్రత్యేకంగా కారణాలేవీ లేవని తారక్ అన్నారు.

44
'టెంపర్'తో సృష్టించిన సునామీ!
Image Credit : Asianet News

'టెంపర్'తో సృష్టించిన సునామీ!

'ఆంధ్రావాలా' ఫలితం తర్వాత కూడా ఎన్టీఆర్ తనపై చూపించిన నమ్మకమే మళ్లీ వారిద్దరినీ కలిపి 'టెంపర్' సినిమా చేసేలా చేసింది. 'ఆంధ్రావాలా' చేసిన 10 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన సినిమా 'టెంపర్'. 'దయ' అనే అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ నటన అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఆ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను సీట్లలో కట్టిపడేసాయి. క్లైమాక్స్ కోర్ట్‌రూమ్ డ్రామా ప్రేక్షకులను ముగ్ధులను చేసింది.

పూరీ మేకింగ్, ఎన్టీఆర్ ఎనర్జీ తోడై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. హీరోకు నెగెటివ్ షేడ్స్ ఇవ్వడం.. హీరో ఇమేజ్ చెదిరిపోకుండా విలన్లా మార్చి మెప్పించడం అంత ఈజీ కాదు. పూరీకి మాత్రమే అది సాధ్యమైంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: చిరంజీవి, రోజా, సురేఖ దొంగతనంగా మారువేషంలో చేసిన పనేంటో తెలుసా? వామ్మో అరాచకం
Recommended image2
రెండోసారి తల్లి కాబోతున్న మహేష్ బాబు లక్కీహీరోయిన్, యశ్ చెప్పిందే నిజమైందిగా?
Recommended image3
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Related Stories
Recommended image1
Nagarjuna: ఛి.. ఛి ఇదేం పని అనుకున్న నాగార్జున, బిగ్ బాస్ హోస్ట్ ఎలా అయ్యాడు, కింగ్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved