- Home
- Entertainment
- Varanasi: వార్మ్ హోల్ ద్వారా రామాయణ కాలంలోకి మహేష్ వెళ్ళేది అందుకే.. వారణాసి స్టోరీపై వైరల్ థియరీ
Varanasi: వార్మ్ హోల్ ద్వారా రామాయణ కాలంలోకి మహేష్ వెళ్ళేది అందుకే.. వారణాసి స్టోరీపై వైరల్ థియరీ
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా రామాయణం ఆధారంగా రూపొందుతోందన్న వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభకర్ణుడి పునర్జన్మ ఎత్తిన పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

Mahesh Babu
భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడు రామాయణం గురించి తెగ చర్చ జరుగుతోంది. యశ్, రణబీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న రామాయణం సినిమాపై దీపావళికి అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమా కథ కూడా రామాయణం ఆధారంగానే సాగుతుందనే న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వార్తతో రాజమౌళి తర్వాతి సినిమాపై ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. అయితే చిత్రబృందం చేసిన చిన్న పొరపాటు వల్లే ఈ సినిమా కథ మొత్తం లీక్ అయిపోయిందా అన్న చర్చ గట్టిగా నడుస్తోంది.
అసలేంటీ వారణాసి కథ
RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత జక్కన్న, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'వారణాసి' (Varanasi) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించనున్నారట. తాజాగా ఈ సినిమా కథ లీక్ అయిందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే ఓ పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్లో కనిపించనున్నారట. ఈ కుంభ.. రామాయణంలో రావణుడి తమ్ముడైన అత్యంత బలశాలి కుంభకర్ణుడి పునర్జన్మ అని తెలుస్తోంది. రామ-రావణ యుద్ధ సమయంలో ప్రపంచంలోని వేర్వేరు ఖండాల్లో చెల్లాచెదురైన ‘నవరత్న నాల’ అనే తొమ్మిది మాయా రత్నాలను వెతికి పట్టుకోవడమే ఈ కుంభ మెయిన్ టార్గెట్.
ఈ కుంభ ఆదేశాల మేరకే హీరో మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఆ తొమ్మిది నిగూఢ రత్నాలను వెతికే పనిలో పడతాడు. అయితే స్టార్టింగ్‌లో దీని వెనకున్న అసలు రహస్యం హీరోకి తెలియదు. ఆ తొమ్మిది రత్నాలు గనక ఒక్కచోట చేరితే, కుంభను ఎవరూ ఎదిరించలేనంత అజేయమైన శక్తి వస్తుందని, దాంతో ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందని ఆ తర్వాత హీరోకి మెల్లగా అర్థమవుతుందట.
ఈ సినిమా కేవలం మైథలాజికల్ స్టోరీ మాత్రమే కాదు, ఓ రేంజ్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. కథ ప్రకారం.. ఆ రత్నాలను వెతికే క్రమంలో మహేష్ బాబు అంతరిక్షంలోని ఓ కాస్మిక్ వార్మ్ హోల్ (Cosmic Wormhole)ను గుర్తిస్తాడు. దాని ద్వారా హీరో టైమ్ ట్రావెల్ చేసి, రామ-రావణ మహాయుద్ధం జరిగే రామాయణ కాలానికి చేరుకుంటాడు. భవిష్యత్తులో ఆ శక్తివంతమైన రత్నాలు దుర్వినియోగం కాకుండా, వాటిని ఆయుధాలుగా వాడకుండా ఆపడానికి హీరో చరిత్రనే మార్చేస్తాడని నెట్టింట ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చక్కర్లు కొడుతోంది.
సినిమా రిలీజ్ ఎప్పుడు?
రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.1200 కోట్ల నుంచి రూ.1400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 7, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల రిలీజ్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ స్టోరీ లైన్ చూస్తుంటే.. రాజమౌళి-మహేష్ సినిమాకు రామాయణంతో లింక్ ఉందా అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో పీక్స్‌కు చేరింది.













