అవినీతిని ఎవరో ఒకరు వచ్చి పూర్తిగా నిర్మూలిస్తారని ఆశించడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ నిజాయితీతో, పూర్తిగా అంకితభావంతో పని చేయాలని సూర్య అన్నారు.
హీరో సూర్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? రూమర్లకు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన స్టార్!
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పొలిటికల్ ఎంట్రీ చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయ బరిలోకి దిగిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మరికొందరు స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వస్తారా అనే ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో హీరో సూర్య (Actor Suriya) పొలిటికల్ ఎంట్రీపై కూడా చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా సూర్యనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి, తన నిర్ణయాన్ని పక్కాగా ప్రకటించారు.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా లేదా?
సినిమా ప్రమోషన్స్ టైంలో పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన సూర్య.. తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పారు. రాజకీయాలంటే ఆసక్తి లేదని కాదు, కానీ నేరుగా పాలిటిక్స్‌లోకి దిగే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తాను చాలా నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే గమనించడం వేరు, రాజకీయాల్లోకి రావడం వేరు అనే అభిప్రాయాన్ని సూర్య వ్యక్తం చేశారు. సరైన దారి లేదా క్లారిటీ లేకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్ట్రాంగ్‌గా చెప్పారు.
యువతకు సూర్య ఇచ్చిన సలహా ఏంటి?
రాజకీయాల గురించి మాట్లాడిన సూర్య.. యువత ఈ ఫీల్డ్‌లోకి వచ్చే ముందు పూర్తి అవగాహన, క్లారిటీతో ఉండాలని సూచించారు. దేశ విద్యా వ్యవస్థకు రాజకీయ నాయకులు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన అభిప్రాయం.
ఇక అవినీతిని ఎవరో ఒకరు వచ్చి పూర్తిగా నిర్మూలిస్తారని ఆశించడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ నిజాయితీతో, పూర్తిగా అంకితభావంతో పని చేయాలని సూర్య అన్నారు.
విజయ్ పాలిటిక్స్ వైపు, సూర్య మాత్రం దూరం!
తమిళనాడులో సినిమాకు, రాజకీయాలకు మధ్య ఉన్న బంధం ఎన్నో దశాబ్దాలుగా ఉంది. ఎంజీఆర్ సహా పలువురు నటులు పాలిటిక్స్‌లో సక్సెస్ అయ్యారు. రీసెంట్గా దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి భారీ సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఇలాంటి టైంలో సూర్య కూడా రాజకీయాల్లోకి రావచ్చనే ఎక్స్పెక్టేషన్స్ అభిమానుల లో ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆయన కామెంట్స్ ఆ చర్చలన్నింటికీ చెక్ పెట్టాయి. ప్రస్తుతానికి సినిమాలకే ప్రయారిటీ ఇవ్వనున్న సూర్య, రాజకీయాలను బయటి నుంచే గమనించే ఆలోచనలో ఉన్నారు. దీంతో సూర్య పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు ప్రస్తుతానికి ఫుల్స్టాప్ పడింది.














