MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు మళ్ళీ డైరెక్టర్ మారాడా? రాజ్ కమల్ సంస్థ సంచలన వీడియో

Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు మళ్ళీ డైరెక్టర్ మారాడా? రాజ్ కమల్ సంస్థ సంచలన వీడియో

కమల్ హాసన్ RKFI నిర్మాణంలో రజినీకాంత్ నటిస్తున్న ‘తలైవర్ 173’ సినిమాకు దర్శకులు మారుతూనే ఉన్నారు. తాజాగా రాజ్ కమల్ ఫిలింస్ రిలీజ్ చేసిన ఒక వీడియో సినీ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 02 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోలీవుడ్‌లో హాట్ టాపిక్
Image Credit : X

కోలీవుడ్‌లో హాట్ టాపిక్

ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది కమల్ హాసన్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించబోయే ‘తలైవర్ 173’ సినిమానే. ఎన్నో మలుపులతో సాగుతున్న ఈ సినిమా దర్శకుడి ఎంపిక, కొత్త కాంబినేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డైరెక్టర్ కుర్చీ చుట్టూ  గందరగోళం
Image Credit : X / Raaj Kamal Films International

డైరెక్టర్ కుర్చీ చుట్టూ గందరగోళం

‘తలైవర్ 173’ సినిమా ప్రకటించినప్పటి నుంచి డైరెక్టర్ కుర్చీ చుట్టూ పెద్ద గందరగోళం నడుస్తోంది. మొదట ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. 

ఆయన తర్వాత, శివకార్తికేయన్ ‘డాన్’ మూవీ డైరెక్టర్ సిబి చక్రవర్తి వచ్చారు. రజినీకాంత్ కోసం 83 రకాల గెటప్పులు డిజైన్ చేసేంత వరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు చకచకా జరిగాయి. కానీ, కథలో రజినీకాంత్ కొన్ని మార్పులు కోరారని, ఆ విషయంలో వచ్చిన గందరగోళంతో సిబి చక్రవర్తి కూడా తప్పుకున్నారని లేదా ఆయన స్థానంలో వేరే దర్శకుడిని చూస్తున్నారని వార్తలు వచ్చాయి.

34
రేసులోకి వచ్చిన అశ్వత్ మరిముత్తు?
Image Credit : X

రేసులోకి వచ్చిన అశ్వత్ మరిముత్తు?

సిబి చక్రవర్తి తప్పుకున్నారనే పుకార్ల మధ్య, 100 కోట్లకు పైగా వసూలు చేసిన ‘డ్రాగన్’  సినిమా దర్శకుడు అశ్వత్ మరిముత్తు ‘తలైవర్ 173’కి దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం జరిగింది. ఆయన రాజ్ కమల్ సంస్థను కలిసి కథ చెప్పినట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం శింబు ‘STR 51’ (గాడ్ ఆఫ్ లవ్) సినిమాకు కమిట్ అయిన అశ్వత్, రజినీ సినిమా కూడా డైరెక్ట్ చేస్తారా అనే ఆసక్తి పెరిగింది.

44
రాజ్ కమల్ సంస్థ సర్‌ప్రైజ్ వీడియో
Image Credit : X

రాజ్ కమల్ సంస్థ సర్‌ప్రైజ్ వీడియో

ఈ పుకార్లకు బలం చేకూరుస్తూ, ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దర్శకుడు అశ్వత్ మరిముత్తు పుట్టినరోజు సందర్భంగా, కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోతో శుభాకాంక్షలు తెలిపింది. 

ఇంకా అధికారికంగా ఏ సినిమాకు సంతకం చేయని ఒక యువ దర్శకుడికి, కమల్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఇలా ప్రత్యేక వీడియోతో విష్ చేయడం సాధారణ విషయం కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raaj Kamal Films International (@rkfioffl)

ఈ వీడియోతో ‘తలైవర్ 173’ కొత్త దర్శకుడు అశ్వత్ మరిముత్తు అని దాదాపు ఖాయమైపోయిందని రజినీ, కమల్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. సుందర్ సి, సిబి చక్రవర్తి తర్వాత ఇప్పుడు ‘తలైవర్ 173’ అశ్వత్ చేతుల్లోకి వెళ్లిందా అనే దానిపై త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image2
Casting Couch: నీకో ఛాన్స్ కావాలంటే.. నాకో ఛాన్స్ ఇస్తావా అని అడుగుతారు.. కాస్టింగ్ కౌచ్ పై నటి అపూర్వ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved