తెలుగు డైరెక్టర్ నన్ను కమిట్‌మెంట్ అడిగాడు, నాగార్జున హీరోయిన్ సంచలన కామెంట్
నాగార్జునతో `వైల్డ్ డాగ్`లో నటించిన నటి సయామీ ఖేర్ తెలుగు డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఓ డైరెక్టర్ తనని కమిట్‌మెంట్ అడిగాడంటూ షాకిచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నాగార్జున హీరోయిన్ కమిట్‌మెంట్ ఆరోపణలు
సినిమా పరిశ్రమలో కమిట్‌మెంట్, కాస్టింగ్ కౌచ్‌లు తరచూ వినిపిస్తుంటాయి. హీరోయిన్లని డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు కమిట్‌మెంట్ అడుగుతారని, సినిమా ఒప్పుకునే ముందే అగ్రిమెంట్ కూడా తీసుకుంటారనే ఆరోపణలున్నాయి. గతంలో చాలా మంది కథానాయికలు ఇలాంటి ఆరోపణలు చేశారు. `మీటూ` ఉద్యమం ఆ మధ్య అన్ని చిత్ర పరిశ్రమలను షేక్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు నాగార్జున హీరోయిన్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
తెలుగు దర్శకుడు కమిట్ మెంట్ అడిగాడంటూ సయామీ ఖేర్ షాక్
నాగార్జునతో `వైల్డ్ డాగ్` చిత్రంలో నటించిన హీరోయిన్ సయామీ ఖేర్ తెలుగు దర్శకుడిపై సంచలన కామెంట్స్ చేసింది. ఓ తెలుగు డైరెక్టర్ తనని కమిట్‌మెంట్ అడిగాడని ఆరోపించింది. తనకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తెలుగు దర్శకుడొకరు కమిట్‌మెంట్ అడిగాడని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఆ దర్శకుడి సినిమా రిజెక్ట్ చేసిన సయామీ ఖేర్
ఒక తెలుగు సినిమాలో పాత్ర కోసం వారి ఏజెంట్ తనకు ఫోన్ చేసిందని, అవకాశం కోసం కాంప్రమైజ్ అవ్వాలని చెప్పిందని, మహిళ అయి ఉండీ కూడా ఆమె తనని ఇలా అడగడం పట్ల తాను షాక్ అయినట్టు చెప్పింది సయామీ ఖేర్. అలాంటి ఆఫర్ తనకు అవసరం లేదని మొహం మీదే చెప్పేసి ఆ మూవీ ఆఫర్‌ని తిరస్కరించినట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి.
`రేయ్`, `వైల్డ్ డాగ్`, `హైవే` వంటి తెలుగు సినిమాల్లో సయామీ ఖేర్
ఇక సాయి ధరమ్ తేజ్ `రేయ్` సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది ముంబయి అమ్మడు సయామీ ఖేర్. తొలి చిత్రం రిలీజ్ కావడానికి చాలా టైమ్ పట్టింది. దీనికి వైవీఎస్ చౌదరీ దర్శకత్వం వహించారు. పలు వాయిదాల తర్వాత రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత హిందీలో ఆఫర్లు అందుకుంది సయామీ ఖేర్. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నాగార్జున `వైల్డ్ డాగ్`, ఆనంద్ దేవరకొండ `హైవే` చిత్రాల్లో మెరిసింది.
సన్నీ డియోల్ `జాట్`లో రచ్చ చేసిన సయామీ ఖేర్
సయామీ ఖేర్ నటించిన తెలుగు సినిమాలు ఏ ఒక్కటి ఆడలేదు. దీంతో టాలీవుడ్‌లో ఆమెకి ఆఫర్లు రావడం లేదు. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. అక్కడ అడపాదడపా సినిమా ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌ని లాక్కొస్తుంది. ఇటీవలే ఆమె సన్నీ డియోల్ `జాట్`లో ఎస్‌ఐ విజయ లక్ష్మిగా కీలక పాత్రలో నటించడం విశేషం. దీంతోపాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ రాణిస్తుంది సయామీ ఖేర్.