అల్లు అర్జున్‌కి పోలీసులు కౌంటర్, మహిళ చనిపోయిందని చెప్పినా రాలేదు.. ఫ్యాన్స్ కి వార్నింగ్
అల్లు అర్జున్ పై పోలీసులు సీరియస్ అయ్యారు. నిన్నటి ప్రెస్ మీట్‌లో బన్నీ కామెంట్ చేసిన నేపథ్యంలో పోలీసులు కౌంటర్ ఇచ్చారు. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరింత ముదురుతుంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు అల్లు అర్జున్ సైతం స్పందించడం కూడా ఈ వివాదం మరింత పెరగడానికి కారణమవుతుంది. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు, దీనికి బన్నీ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడంతో వివాదం మరింత ముదరడానికి కారణమవుతుంది. మహిళ చనిపోయిందని పోలీసులు తనకు చెప్పలేదని, తన టీమ్ మాత్రం క్రౌడ్ పెరిగిందని మాత్రమే చెప్పారు, వెళ్లిపోవాలని వారు చెప్పడంతో తాను వెళ్లిపోయినట్టు తెలిపారు. తన క్యారెక్టర్ అస్సాసినేషన్ చేస్తున్నారని, తప్పుదోవ పట్టిస్తున్నారని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజాగా దీనికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. బన్నీకి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్‌లు ఆ రోజు జరిగిన ఘటన వివరించారు. తొక్కిసలాట ఘటన గురించి అల్లు అర్జున్‌కి తెలియజేద్దామంటే వాళ్ల మెనేజర్ అడ్డుకున్నాడని తెలిపారు. బయట ఒక లేడీ చనిపోయింది, ఇంకో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పినా, సినిమా చూశాకనే బయటకు వస్తా అన్నాడని, అప్పుడు తాము డీసీపీ, పోలీస్ సిబ్బందితో లోపలికి వెళ్లి అల్లు అర్జున్‌ని బయటకు తీసుకొచ్చామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ వెల్లడించారు.
సీఐ రాజు నాయక్ స్పందిస్తూ, థియేటర్ విజిట్‌కి పర్మిషన్ లేదని స్వయంగా తన చేతులతోనే లేఖ రాసినట్టు తెలిపారు. థియేటర్ మెనేజ్‌మెంట్ కి ముందే లేఖ రాసినట్టు తెలిపారు. అల్లు అర్జున్ టీమ్‌తో తమకు కాంటాక్ట్ లేదని, పర్మిషన్ గురించి థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ టీమ్‌కి చెప్పుకోవాలన్నారు. జరిగిన ఘటన గురించి చెబుతూ, మహిళ ప్రాణాలు కాపాడటానికి ఎంతో ప్రయత్నించాం. కానీ కాపాడలేకపోయాం. అందుకు చాలా బాధగా ఉందని, దేవుడి దయతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఈ ఘటనపై మరో ఏసీపీ విష్ణుమూర్తి స్పందిస్తూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులపై ఎవరైనా అనుచితకంగా కామెంట్లు చేస్తే, తప్పుడు వ్యాఖ్యలు చేస్తే అల్లు అర్జున్‌కి, వారి ఫ్యాన్స్ కి రీల్స్ కట్ అయిపోతాయి. పోలీసులకు కూడా కుటుంబాలు ఉన్నాయని, వాళ్లు కూడా ఎఫెక్ట్ అవుతారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఇచ్చేది లంచం అని, ఇలా చేస్తే అల్లు అర్జున్ బెయిల్ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన కేసు మొత్తం క్లోజ్ కాలేదని, కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చిందని, కేసుని తేల్చాల్సింది కోర్టు అని, జరిగింది యాక్సిడెంటా? కాదా అనేది తేల్చాల్సింది కోర్టు అని, చెప్పడానికి నువ్వు ఎవరు అని ఏసీపీ విష్ణుమూర్తి ప్రశ్నించారు.
ఈ కేసు విషయంలో ఇన్ని రోజులు చూస్తూ ఊరకున్నామని చెప్పారు. నిన్నటి ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ లో ఏమాత్రం పాశ్చాత్తాపం కనిపించలేదని, సక్సెస్ మీట్‌లకు వెళ్లలేదనే బాధ తప్ప ఇంకేం కనిపించడం లేదన్నారు. ఆయన చాలా సక్సెస్ మీట్‌లకు వెళ్లాడు, ఇంటిని చక్కగా డెకరేట్ చేసుకుని, వచ్చేవాళ్లు, పోయే వాళ్లతో ఉల్లాసంగా గడిపాడు అని తెలిపారు విష్ణు మూర్తి. `పుష్ప` సినిమాలోని ఆయన నటనకు అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చిన నేపథ్యంలో పోలీసుల్ని బట్టలిప్పి కొట్టినందుకే అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు వచ్చిందా? సినిమా మొత్తానికి వచ్చిందన్నారు.
వాళ్లు వాపుని చూసి బలం అనుకుటున్నారు. వీ వాపుని ప్రజలే తీసి పడేస్తారు. ఇంకోసారి పోలీసులను ఎవరైనా అవమానించే విధంగా ప్రవర్తిస్తే ఊపేక్షించేది లేదు, ఊరూరూ తిరిగి వాళ్ల బట్టలు ఊడతీస్తాం అని వార్నింగ్ ఇచ్చారు ఏసీపీ. సినిమా వాళ్ల దాదాగిరి ఏంటి? ఇష్టమొచ్చినట్టు టికెట్ రేట్లు పెంచారు, ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయమని ఎవరైనా అడిగారా? అని అన్నారు. మరో ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనపై డీజీపీ జితేందర్ రెడ్డి కూడా స్పందించారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఓ కార్యక్రమంలో డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదు, పౌరులుగా అందరు బాధ్యతాయుతంగా ఉండాలి అన్నారు. పౌరుల భద్రత, రక్షణ అన్నిటికంటే ముఖ్యమని, ఆయన సినిమా హీరో కావచ్చు, క్షేత్ర స్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలి. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు, ఇలాంటి ఘటనలు భద్రతకు మంచిది కాదు అని వెల్లడించారు.
read more: మళ్లీ బుక్కైన అల్లు అర్జున్ ?.. వీడియోలు చూపిస్తూ ట్రోల్స్, తప్పులో కాలేస్తున్నారా?
also read: `గేమ్ ఛేంజర్` ఫస్ట్ రివ్యూ, హైలైట్స్ ఇవే.. రామ్ చరణ్‌కి జాతీయ అవార్డు పక్కా!