మళ్లీ బుక్కైన అల్లు అర్జున్ ?.. వీడియోలు చూపిస్తూ ట్రోల్స్, తప్పులో కాలేస్తున్నారా?
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ చుట్టూ వివాదం మరింత ముదురుతుంది. ఈ వివాదంలో బన్నీ మళ్లీ బుక్కయ్యాడు.
allu arjun released
అల్లు అర్జున్ వివాదం రోజు రోజుకి మరింత ముదురుతుంది. `పుష్ప 2` విడుదలకు ముందు రోజు సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన ఆయన మెడకు చుట్టుకుంది. ఈ ఘటనలో మహిళ చనిపోగా, ఆమె కొడుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఏ 11గా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యాడు. మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చాడు.
అయితే శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. థియేటర్ వద్ద ఆ ఘటన చోటు చేసుకున్న తర్వాత కూడా అల్లు అర్జున్ వెళ్లిపోతూ కారు రూప్ టాప్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ, ర్యాలీగా వెళ్లాడని, ఇంత మానవీయ కోణం లేకుండా వ్యవహరించడం ఏంటని సీఎం ప్రశ్నించారు, ఆయన విధానాన్ని సీఎం తప్పు పట్టారు.
అదే సమయంలో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలైన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. చాలా మంది ఫోన్‌లో ఆయనతో మాట్లాడారు. ఈ ఘటనతో మరింత రచ్చకి దారితీసింది. దీనిపై కూడా సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌కి కాలు విరిగిందా, చేయి విరిగిందా, సెలబ్రిటీలంతా ఆయన ఇంటికి ఎందుకు వెళ్లారు.
హీరోని పరామర్శించేందుకు చూపించిన చొరవ ఆ బాలుడిని పరామర్శించేందుకు చూపించలేదంటూ సెటైర్లు పేల్చారు. మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, ఓ మహిళ చనిపోయిందని పోలీసులు చెబితే, ఒకరు చనిపోయారా అయితే మా సినిమా హిట్టే అని అల్లు అర్జున్ పోలీసులతో చెప్పినట్టుగా ఆయన ఆరోపించాడు.
దీనిపై అల్లు అర్జున్ శనివారం ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన క్యారెక్టర్ అస్సాసినేషన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పుగా తీసుకెళ్తున్నారని, మిస్ కమ్యూనికేషన్ జరుగుతుందని, తన క్యారెక్టర్‌ని చంపేస్తున్నారని తెలిపారు. తనకు పోలీసులే రూట్ క్లీయర్ చేసి థియేటర్‌కి తీసుకెళ్లారని, అదే సమయంలో లేడీ చనిపోయినట్టుగా తనకు ఎవరూ చెప్పలేదని, క్రౌడ్ పెరిగింది వెళ్లిపోవాలని తన టీమ్ చెప్పిందని, చెప్పిన వెంటనే తాను వెళ్లిపోయానని తెలిపాడు బన్నీ.
ఇదే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. బన్నీ వెళ్లిపోలేదని రెండు గంటలపాటు ఆయన థియేటర్‌లోనే ఉన్నాడని నెటిజన్లు, ట్రోలర్స్ అంటున్నారు. ఈ మేరకు `పుష్ప2`లోని జాతర సీన్లని చూపిస్తున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. జాతర సీన్లు వచ్చినప్పుడు ఫ్యాన్స్ తోపాటు బన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొట్టిన వీడియో క్లిప్పులను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
బాగా యాక్టింగ్ చేస్తున్నాడని, జాతీయ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ రచ్చ చేస్తున్నారు. తాను రూఫ్ టాప్‌పైకి వచ్చిన అభివాదం చెబుతున్న వీడియోలు కూడా వైరల్ చేస్తూ మరింతగా ఆడుకుంటున్నారు ట్రోలర్. అయితే ఇందులో మాత్రం బన్నీ సంతోషంగా రియాక్ట్ కాలేదు, అభిమానులను ఖుషీ చేయాలనే ఉద్దేశ్యమే కనిపిస్తుంది.
ఇదే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. బన్నీ వెళ్లిపోలేదని రెండు గంటలపాటు ఆయన థియేటర్‌లోనే ఉన్నాడని నెటిజన్లు, ట్రోలర్స్ అంటున్నారు. ఈ మేరకు `పుష్ప2`లోని జాతర సీన్లని చూపిస్తున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. జాతర సీన్లు వచ్చినప్పుడు ఫ్యాన్స్ తోపాటు బన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొట్టిన వీడియో క్లిప్పులను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
బాగా యాక్టింగ్ చేస్తున్నాడని, జాతీయ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ రచ్చ చేస్తున్నారు. తాను రూఫ్ టాప్‌పైకి వచ్చిన అభివాదం చెబుతున్న వీడియోలు కూడా వైరల్ చేస్తూ మరింతగా ఆడుకుంటున్నారు ట్రోలర్. అయితే ఇందులో మాత్రం బన్నీ సంతోషంగా రియాక్ట్ కాలేదు, అభిమానులను ఖుషీ చేయాలనే ఉద్దేశ్యమే కనిపిస్తుంది.
ఇంకోవైపు ప్రెస్ మీట్‌లో మధ్యలో వాటర్ అడిగాడు బన్నీ. బాటిల్ తీసుకుని ఒకరకమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. ఈ వాటరే కొంప ముంచిందా అనేట్టుగా ఆయన రియాక్షన్ ఉంది. ఎందుకంటే `పుష్ప 2` థ్యాంక్స్ మీట్‌లో బన్నీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. ఆ సమయంలోనే ఆయన వాటర్ అడిగాడు. గొంతు తడారిపోయిందని, మార్నింగ్ నుంచి అందరితో మాట్లాడుతున్నా అంటూ అల్లు అర్జున్ తెలిపారు.
అయితే సీఎం పేరు గుర్తు లేకే ఆయన ఇలా కవర్ చేసుకున్నారని అంతా అడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్‌ని ఈ కారణంగానే టార్గెట్ చేశారని అంటున్నారు. అందులో భాగంగానే శనివారం ప్రెస్ మీట్‌లో బన్నీ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కూడా ఇప్పుడు రచ్చ అవుతుంది.
మొత్తంగా తన వైపు నుంచి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ప్రెస్‌మీట్ పెట్టినా, ఆయన కొన్ని విషయాలకు స్పందించిన తీరు కొత్త వివాదాలకు కారణమవుతుంది. బన్నీ మళ్లీ బుక్కైపోతున్నాడు. కాంగ్రెస్ అభిమానులు ఆయన వీడియోలను షేర్ చేస్తూ రియాలిటీ ఏంటని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే వివాదం పెరగడానికి కారణమవుతుందని చెప్పొచ్చు.
ఈ కేసు కోర్టు లో ఉంది, పైగా ప్రాణాలు పోయిన ఘటన కావడంతో ఇది చాలా సెన్సిటివ్ మారింది. ఏం రియాక్ట్ అయినా, ఎలా రియాక్ట్ అయినా వివాదంగానే మారే అవకాశాలున్నాయి. ఈ విషయంలో బన్నీ కొంత కాలం సంయమనం పాటించడం బెటర్. లేదంటే అనవసరంగా తప్పులో కాలేసినట్టు అవుతుంది.