- Home
- Entertainment
- Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు
అఖండ 2 చిత్రానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఈసారి తెలంగాణ హై కోర్టు అఖండ నిర్మాతలని కోలుకోలేని దెబ్బ కొట్టింది. గురువారం ప్రదర్శించాల్సిన అఖండ 2 ప్రీమియర్ షోల అనుమతిని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది.

అఖండ 2 చిత్రానికి మరో బిగ్ షాక్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 చిత్రానికి అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చిత్రం స్మూత్ గా రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. డిసెంబర్ 5న రిలీజ్ కావలసిన ఈ చిత్రాన్ని మద్రాస్ హై కోర్టు అడ్డుకుంది. విడుదలని ఆపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోస్ సంస్థకి 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు భారీ మొత్తంలో అమౌంట్ చెల్లించాలి. దీనితో వారు కోర్టు మెట్లు ఎక్కి అఖండ రిలీజ్ ని అడ్డుకున్నారు.
ప్రీమియర్ షోలకు అనుమతి రద్దు
నిర్మాతలు ఆ కష్టాలని అధికమించి డిసెంబర్ 12న అఖండ 2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 11న అంటే నేడు రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాలలో ప్రారంభం అవుతాయి. ఈ తరుణంలో తెలంగాణ హైకోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇది నిర్మాతలకు మరో కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. తెలంగాణలో అఖండ ప్రీమియర్ షోలకు ఇచ్చిన అనుమతి, టికెట్ ధరలు పెంచుకునేందుకు ఇచ్చిన అనుమతి జీవోని హై కోర్టు రద్దు చేసింది.
అఖండ 2 టికెట్ ధరల జీవోని సస్పెండ్ చేసిన హైకోర్టు
11న పడాల్సిన ప్రీమియర్ షోల టికెట్ ధర రూ 600 ఉండేలా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే విధంగా మొదటి మూడు రోజులు సింగిల్ స్క్రీన్స్ లో 50, మల్టీ ఫ్లెక్స్ లలో 100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ జీవోని తెలంగాణ హై కోర్టు సస్పెండ్ చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ లో తెలంగాణ హై కోర్టు టికెట్ ధరల పెంపు గురించి విచారణ జరిపింది. ఈ విచారణలో ధర్మాసనం అఖండ 2 ప్రీమియర్ షోలకు ఇచ్చిన అనుమతి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
నిర్మాతలకు నోటీసులు
తదుపరి విచారణని 12న తేదీకి వాయిదా వేశారు. దీనితో తెలంగాణలో అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ హై కోర్టు చిత్ర నిర్మాతలతో పాటు తెలంగాణ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ కి కూడా ఆదేశాలు పంపింది.
అభిమానుల్లో ఆందోళన
తాజాగా కోర్టు నిర్ణయంతో అభిమానుల్లో ఆందోనళ పెరిగిపోతోంది. చాలా మంది అభిమానులు ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్స్ కొనుగోలు చేశారు. కోర్టు నిర్ణయం ప్రకారం ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అవుతాయి. ఒక వేళ కోర్టు ఆర్డర్ ఆలస్యం అయితే ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తంగా అఖండ 2 రిలీజ్ వ్యవహారంపై గందరగోళం నెలకొంది.

