MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?

శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ జంటగా నటించిన `మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌` మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. శ్రీనాథ్‌ సోలో హీరోగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే? 

4 Min read
Author : Aithagoni Raju
Published : Mar 07 2026, 08:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ

శ్రీనాథ్‌ మాగంటి నటుడిగా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు అడపాదడపా హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సోలో హీరోగా `మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌` అనే మూవీలో నటించాడు. ఇందులో గాయత్రి రమణ హీరోయిన్‌గా, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో నటించింది. బాల సతీష్‌ దర్శకత్వం వహించారు. కనకమేడల ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్‌ కుమార్‌ నిర్మించారు. ఆయన ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా శుక్రవారం(మార్చి 6)న విడుదలైంది.  ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

26
మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ కథ
Image Credit : Asianet News

మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ కథ

మల్లేష్‌(శ్రీనాథ్‌ మాగంటి) బాగా తాగుబోతు. బాగా తాగడం.. ఊర్లో ఉండే బావ వరుస అయ్యే కేశవ(రాజేష్‌)తో గొడవపడటం.. రోజూ ఇదే ఉంటుంది. ఊర్లో తన 30 గుంటల భూమిని కాజేయాలని చిన్న పటేల్‌ కేశవ ప్లాన్‌ చేస్తుంటాడు. మల్లేష్‌ని ఇబ్బంది పెడుతుంటాడు. అయినా మల్లేష్‌ ఎవరి మాట వినడు. కేశవని గట్టిగా ఎదుర్కొంటాడు. మల్లేష్‌ కి నాన్న లేడు. ఆయన కూడా తాగుడుకి బానిసై కన్నుమూశాడు. దీంతో తల్లినే ఆయనకు అన్నీ అవుతుంది. ఆమె మల్లేష్‌ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుంది. అన్ని చెడగొడుతుంటాడు. ఈ క్రమంలో జ్యోతి(గాయత్రి రమణ)ని పెళ్లి చూపుల్లోనే ఇష్టపడతాడు. ఒకే చెబుతాడు. అతనికి చెడు అలవాట్లు ఉన్నాయని తెలిసినా మల్లేష్‌ నచ్చాడని చెబుతుంది. కేశవ అడ్డుకోవాలని చూసినా డేర్‌గా పెళ్లి చేసుకుంటాడు. తీరా ఫస్ట్ నైట్‌ కి గట్టిగా ప్రిపేర్‌ అవుతాడు. ఫ్రెండ్స్ ఏకంగా ఫ్లెక్సీ కూడా పెట్టిస్తాడు. అయితే తీరా ఫస్ట్ నైట్‌ రోజు ఫెయిల్‌ అవుతాడు. మళ్లీ ప్రయత్నించినా వర్కౌట్‌ కాదు. మ్యాటర్ లేదని అర్థమవుతుంది. ఈ విషయం ఊరంతా తెలుస్తోంది. ఇదే విషయంపై చిన్నపటేష్‌ కేశవతో గొడవ అవుతుంది. ఇద్దరూ ఛాలెంజ్‌ చేసుకుంటారు. నువ్వు మగాడివి అయితే పిల్లల్ని కని చూపించాలని చిన్న పటేల్‌.. మల్లేష్‌కి సవాల్‌ విసిరితే, అదే జరిగితే నీ భూమి నాకు ఇవ్వాలని కండీషన్‌ పెడతాడు. మల్లేష్‌ ఫెయిల్‌ అయితే తన 30 గుంటలు అతనికి రాసివ్వాలి. మరి ఈ ఛాలెంజ్‌లో ఎవరు గెలిచారు? మల్లేష్‌ మగాడు అని నిరూపించుకున్నాడా? ఈక్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది కథ.

Related Articles

Related image1
Sampradayini Suppini Suddapoosani Review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ, రేటింగ్‌
Related image2
Saraswathi Review: సరస్వతి మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉందంటే?
36
మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ విశ్లేషణ

ఇటీవల తెలుగు సినిమాలో సెన్సిటిల్‌ సబ్జెక్ట్ తో సినిమాలు చాలా వస్తున్నాయి. వాటిని ఆడియెన్స్ కూడా బాగానే చూస్తున్నారు. ఆద్యంతం వినోదాత్మకంగా వాటిని రూపొందిస్తూ సక్సెస్‌ అవుతున్నారు మేకర్స్. ఇప్పుడు కూడా అలాంటి సబ్జెక్ట్ తోనే వచ్చిన చిత్రం `మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌`. ఇందులో మగాడికి మగతనానికి సంబంధించిన సబ్జెక్ట్ ని తీసుకొని రూపొందించారు. కొంత అడల్ట్ కామెడీగా ఉంటుంది. మరికొంత సెన్సిటివ్‌గా ఉంటుంది. ఇంకోవైపు యాక్షన్‌ మేళవింపుగా ఉంటుంది. వీటికి మించి ఫ్యామిలీ డ్రామాగా సాగుతుంది. ప్రారంభంలో సినిమా హీరో పాత్రని ఎస్టాబ్లిష్‌ చేయడానికి టైమ్‌ తీసుకున్నారు. వాడి ప్రవర్తన, తీరుతెన్నులను చూపించారు. అప్పటి వరకు పోటుమొగోడిగా బిల్డప్‌ కొట్టిన హీరో పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్‌తోనే డౌన్‌ కావడం, మ్యాటర్‌ వర్క్ కాకపోవడంతో ఇబ్బంది పడటం, తాను మగాడిని అని నిరూపించుకునేందుకు రకరకాల డ్రామాలు ఆడటం ఆద్యంతం ఫన్నీగా ఉంటుంది. అది హిలేరియస్‌గా ఉంటుంది. హీరో ఫస్ట్ నైట్‌కి, ఒక ముసలోడి రేడియో పనిచేయడాన్ని లింక్‌ చేస్తూ రూపొందించిన సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి.

ఫస్టాఫ్‌ అంతా దీనిపైనే రన్‌ అవుతుంది. నవ్విస్తుంది. సెకండాఫ్‌లో తాను మొగొడిని అని నిరూపించుకునేందుకు హీరో ప్రయత్నాలు చేయడం, వివిధ రకాల ఫుడ్‌ తీసుకోవడం వంటి చూపించారు. ఇదే విషయంలో విలన్‌తో సవాల్‌ విసరడంతో వాడు ఇతన్నీ చెడగొట్టాలని ప్లాన్‌ చేస్తుంటాడు, హీరో దాన్ని ఎదుర్కొంటుంటాడు. ఇవన్నీ టామ్‌ అండ్‌ జెర్రీలా సాగుతాయి. నువ్వా నేనా అనేట్టు ఉంటాయి. సీరియస్‌గా సాగుతూనే అందులో ఫన్‌ మేళవించిన తీరు బాగుంది. సెకండాఫ్‌  ఆద్యంతం డ్రామాగా రన్‌ అవుతుంది. అది కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమాలో కథ లేదు. హీరోకి మ్యాటర్‌ లేనట్టుగానే సినిమాలో మ్యాటర్‌ లేదు. కాకపోతే ఈ అడల్ట్ కామెడీ సీన్లు మాత్రం ఆద్యంతం నవ్విస్తాయి. క్రేజీగా ఉంటాయి. అవి పక్కన పెడితే పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. క్లైమాక్స్ ని కాస్త ఎమోషనల్‌గా చూపించారు. హృదయాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథ లేకపోవడం, సెకండాఫ్‌ లో చాలా సీన్లు రొటీన్‌గా ఉంటాయి. కథ కూడా ఈ మగతనం అనే ఎలిమెంట్ తప్పితే కొత్తగా లేదు. కానీ అదే ఈ మూవీకి హైలైట్‌ పాయింట్‌. చాలా వరకు ఇలాంటి సబ్జెక్ట్ డీల్‌ చేయడం, చాలా టఫ్‌. ఇందులో చాలా నీట్‌గానే చూపించారు. కాకపోతే ఎక్స్ ప్రెషన్స్ తో అసలు విషయం చెబుతూ నవ్వులు పూయించారు. కాకపోతే ఇలాంటి మూవీని చూస్తారా అనేది ప్రశ్న. 

46
మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ నటీనటుల ప్రదర్శన
Image Credit : Asianet News

మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ నటీనటుల ప్రదర్శన

మల్లేష్‌ పాత్రలో శ్రీనాథ్‌ మాగంటి అదరగొట్టాడు. ఊర మాస్‌ రోల్‌లో ఆకట్టుకున్నాడు. అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలాంటి సినిమా చేయాలంటే హీరోకి గట్స్ ఉండాలి. శ్రీనాథ్‌ డేర్ కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.  జ్యోతి పాత్రలో గాయత్రిబాగా చేసింది. లుక్‌ పరంగానూ కొత్తగా ఉంది. నటనతోనూ మెప్పించింది. బాగా సూట్‌ అయ్యింది. విలన్‌ రోల్‌లో నిర్మాత రాజేష్‌ నటించాడు. ఇరగదీశాడు. వాహ్‌ అనిపించాడు. ఆయనకు భార్యగా కామాక్షి భాస్కర్ల అదరగొట్టింది. కసిరెడ్డి కామెడీ నవ్విస్తుంది. ఊర్లో పెద్దమనిషిగా మురళీధర్‌ గౌడ్‌ బాగా చేశాడు. ఇతర పాత్రధారులు మెప్పించారు. హీరో మరదలి పాత్రలో నటించిన అమ్మాయి అందరిని దృష్టిని ఆకర్షించింది.

56
మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ టెక్నీషియన్ల పనితీరు
Image Credit : Asianet News

మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ టెక్నీషియన్ల పనితీరు

సినిమాకి సురేష్‌ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకున్నాయి. సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆర్ఆర్‌ కూడా అదిరిపోయింది. సినిమాలో చాలా సీన్లని ఎలివేట్‌ చేసింది. ముఖ్యంగా ఫస్ట్ నైట్‌ సీన్లని, ముసలోడి రేడీయోలో వచ్చే పాటల సమయంలో ఆర్‌ఆర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అమ్మ ముత్తు కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఊరిని చాలా సహజంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. గ్యారీ బీఎచ్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. దర్శకుడు బాల సతీష్‌ ఎంచుకున్న కథ చాలా బాగుంది. దాన్ని ఫన్నీగా చూపించిన తీరు బాగుంది. అదే సమయంలో నీట్‌గా డీల్‌ చేసిన విశేషం. నిర్మాణ విలువలకు కొడవలేదు.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

సినిమాలో పెద్ద మ్యాటర్‌ లేదుగానీ, కొంత వరకు నవ్వించే అడల్ట్ కామెడీ చిత్రం `మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌`. 

రేటింగ్‌ 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sampradayini Suppini Suddapoosani Review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ, రేటింగ్‌
Recommended image2
Mrithyunjay Review: `మృత్యుంజయ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. శ్రీవిష్ణుకి మరో హిట్‌ పడిందా?
Recommended image3
Saraswathi Review: సరస్వతి మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Sampradayini Suppini Suddapoosani Review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ, రేటింగ్‌
Recommended image2
Saraswathi Review: సరస్వతి మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved