- Home
- Entertainment
- 23 ఏళ్ళ క్రితం బాలయ్య, మహేష్ చిత్రాలకు చుక్కలు చూపించిన కుర్ర హీరో.. చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత రచ్చ చేస్తాడని..
23 ఏళ్ళ క్రితం బాలయ్య, మహేష్ చిత్రాలకు చుక్కలు చూపించిన కుర్ర హీరో.. చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత రచ్చ చేస్తాడని..
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలు సంక్రాంతికి విడుదలైతే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంటుంది. బాలయ్య కి సంక్రాంతి లక్కీ సీజన్ అని అంతా అంటుంటారు. కానీ గతంలో ఒకసారి సంక్రాంతికి బాలయ్యకి పరాభవం తప్పలేదు.

బాలయ్యకి సంక్రాంతి లక్కీ సీజన్
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలు సంక్రాంతికి విడుదలైతే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంటుంది. బాలయ్య కి సంక్రాంతి లక్కీ సీజన్ అని అంతా అంటుంటారు. కానీ గతంలో ఒకసారి సంక్రాంతికి బాలయ్యకి పరాభవం తప్పలేదు. బాలయ్య చిత్రానికి పోటీగా ఒక కుర్ర హీరో చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది. ఆ కుర్ర హీరో ఎవరో కాదు ఒకప్పుడు లవర్ బాయ్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న తరుణ్.
2002లో బాలయ్యకి డిజాస్టర్
బాలకృష్ణ ఆదిత్య 369 చిత్రంలో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ పెద్దయ్యాక బాలయ్య చిత్రానికే ఎసరుపెట్టాడు. 2002 సంక్రాంతికి బాలయ్య నటించిన సీమ సింహం చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా సిమ్రాన్ నటించింది. జి రాంప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ విడుదలైన రెండు రోజులు వ్యవధిలో తరుణ్, ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు లేక నేను లేను చిత్రం రిలీజ్ అయింది.
బాలయ్య చిత్రాన్ని డామినేట్ చేసిన కుర్ర హీరో
బాలయ్య సీమ సింహం చిత్రానికి డిజాస్టర్ రాగా, నువ్వు లేక నేను లేను చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. అన్ని ఏరియాలలో సీమ సింహం కలెక్షన్లని డామినేట్ చేస్తూ నువ్వు లేక నేను లేను చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.ఈ చిత్రం నటుడు, దర్శకుడు అయిన కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.
మహేష్ సినిమా కూడా నిలబడలేకపోయింది
ఆదిత్య 369 చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తరుణ్.. పెద్దయ్యాక బాలయ్య చిత్రాన్ని డామినేట్ చేసే స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరేమో. అదే సమయంలో మహేష్ బాబు టక్కరి దొంగ చిత్రం కూడా రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా నువ్వు లేక నేను లేను చిత్రం ముందు నిలబడలేకపోయింది.
తరుణ్ హిట్ చిత్రాలు
ఆ విధంగా తరుణ్ ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలకు కూడా చెమటలు పట్టించాడు. కానీ ప్రస్తుతం తరుణ్ టాలీవుడ్ లో కనుమరుగైన పరిస్థితి. ఊహించని విధంగా అతడి కెరీర్ డౌన్ ఫాల్ అయింది. దివంగత నటి ఆర్తి అగర్వాల్, తరుణ్ గురించి అప్పట్లో ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వినిపించాయి. తరుణ్ తన కెరీర్ లో నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, ఎలా చెప్పను, నవవసంతం లాంటి హిట్ చిత్రాల్లో నటించారు.