MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి తర్వాత అఖిల్ చేస్తున్న తొలి చిత్రానికి షాక్.. శ్రీలీల ఇలా ఎందుకు చేసింది ?

పెళ్లి తర్వాత అఖిల్ చేస్తున్న తొలి చిత్రానికి షాక్.. శ్రీలీల ఇలా ఎందుకు చేసింది ?

అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఏజెంట్ లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 25 2025, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ లాంగ్ గ్యాప్
Image Credit : Youtube

ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ లాంగ్ గ్యాప్

అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఏజెంట్ లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. స్టోరీ పర్ఫెక్ట్ గా కుదిరిన తర్వాత అఖిల్ ఈ చిత్రానికి గ్రీన్ సింగల్ ఇచ్చారు. అఖిల్ కి ఇంత వరకు సరైన హిట్ లేదు. దీనితో లెనిన్ చిత్రాన్ని అఖిల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాయలసీమ నేపథ్యంలో లెనిన్ 
Image Credit : Instagram

రాయలసీమ నేపథ్యంలో లెనిన్ 

లెనిన్ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. లవ్ అండ్ యాక్షన్ అంశాలతో రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. మొదట హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక ఎంపిక చేశారు. టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ లో శ్రీలీల పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Related Articles

Related image1
కృష్ణంరాజు ముందు కూర్చోవడానికి కూడా భయపడే నటుడు.. ఏకంగా కాలర్ పట్టుకోవడంతో డైరెక్టర్ వార్నింగ్
Related image2
ఏఎన్నార్ కి నచ్చిన కథ మెగా హీరో చేతుల్లోకి.. తెలివిగా రిజెక్ట్ చేయడం వల్ల అద్భుతం జరిగింది తెలుసా ?
35
అఖిల్ మూవీ నుంచి శ్రీలీల అవుట్
Image Credit : Youtube

అఖిల్ మూవీ నుంచి శ్రీలీల అవుట్

తాజాగా లెనిన్ చిత్రానికి ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం. ఈ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. డేట్లు, షూటింగ్ షెడ్యూల్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల ఈ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ వార్తపై నిర్మాతలు కానీ, శ్రీలీల కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇప్పుడు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం.

45
పెళ్లి తర్వాత తొలి చిత్రం 
Image Credit : X/Nagarjuna Akkineni

పెళ్లి తర్వాత తొలి చిత్రం 

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కే ఈ ప్రేమ కథా చిత్రంపై అఖిల్ బోలెడన్ని అసలు పెట్టుకున్నాడు. ఇటీవల అఖిల్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అఖిల్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే. అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో శ్రీలీల ఈ చిత్రం నుంచి తప్పుకోవడం ఊహించని పరిణామమే. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా థమన్ పని చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, అఖిల్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ కావాలని చిత్రబృందం ఆశిస్తోంది.

55
శ్రీలీల నటిస్తున్న చిత్రాలు 
Image Credit : sreeleela insta

శ్రీలీల నటిస్తున్న చిత్రాలు 

శ్రీలీల తప్పుకోవడం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం చూపించనుందన్నది తేలాల్సి ఉంది. కొత్త హీరోయిన్ ఎంపికపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. శ్రీలీల ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. రవితేజ సరసన రెండోసారి మాస్ జాతర చిత్రంలో నటిస్తోంది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్. శివకార్తికేయన్ పరాశక్తి చిత్రంలో కూడా శ్రీలీల నటిస్తోంది. అదే విధంగా ఆమెకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Recommended image3
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Related Stories
Recommended image1
కృష్ణంరాజు ముందు కూర్చోవడానికి కూడా భయపడే నటుడు.. ఏకంగా కాలర్ పట్టుకోవడంతో డైరెక్టర్ వార్నింగ్
Recommended image2
ఏఎన్నార్ కి నచ్చిన కథ మెగా హీరో చేతుల్లోకి.. తెలివిగా రిజెక్ట్ చేయడం వల్ల అద్భుతం జరిగింది తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved