- Home
- Entertainment
- `గాడ్ ఫాదర్` హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. సినిమాటోగ్రాఫర్‌తో పెళ్లి.. అదిరిపోయే పోస్ట్
`గాడ్ ఫాదర్` హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. సినిమాటోగ్రాఫర్‌తో పెళ్లి.. అదిరిపోయే పోస్ట్
`గాడ్ ఫాదర్` హీరోయిన్ తన్య రవిచంద్రన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
- FB
- TW
- Linkdin
Follow Us

`గాడ్ ఫాదర్`హీరోయిన్ తన్య రవిచంద్రన్ ఎంగేజ్‌మెంట్
సినిమా ప్రముఖులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమే. టాలీవుడ్‌లో మహేష్ బాబు-నమ్రత, నాగార్జున-అమల, పవన్-రేణు దేశాయ్, అలాగే కోలీవుడ్‌లో అజిత్ - షాలిని, సూర్య - జ్యోతిక, రాధిక - శరత్‌కుమార్,
విఘ్నేష్ శివన్ - నయనతార, ఆది - నిక్కీ గల్రానీ, గౌతమ్ కార్తీక్ - మంజిమా మోహన్ వంటి అనేక మంది ప్రముఖులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ జాబితాలో తాజాగా మరో జంట చేరింది.
హీరోయిన్ తన్య రవిచంద్రన్ తన ప్రియుడి గురించి మొదటిసారిగా ప్రకటించారు. గౌతమ్ జార్జ్ ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా నిశ్చితార్థ ఫోటోను పోస్ట్ చేసి తన పెళ్లి గురించి వెల్లడించారు. తన్య తెలుగులో `గాడ్ ఫాదర్`లో నటించింది.
ఎవరీ గౌతమ్ జార్జ్?
తన్య రవిచంద్రన్ పెళ్లిచేసుకోబోతున్న గౌతమ్ జార్జ్ ఎవరనేది చూస్తే, ఆయన సినిమాటోగ్రాఫర్. విజయ్ సేతుపతి నటించిన `అనబెల్`.. సేతుపతి, భావన నటించిన `ది డోర్` వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు.
ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న `ఎల్‌సియు` చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు.
భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు నివిన్ పౌలీ విలన్‌గా నటిస్తున్నారు. సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నారు.
ఎంగేజ్‌మెంట్ ఫోటో పంచుకున్న తన్య
గౌతమ్ జార్జ్‌ను ప్రేమించిన తన్య రవిచంద్రన్, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆయనను పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవల జరిగింది.
ఆ సమయంలో గౌతమ్ జార్జ్‌తో లిప్ కిస్ చేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసిన తన్య, `ఒక ముద్దు, ఒక వాగ్దానానికి దారితీస్తుంది. ఎప్పటికీ.. ఎల్లప్పుడూ` అని గౌతమ్ జార్జ్ పేరును ప్రస్తావిస్తూ హార్ట్ ఎమోజీని కూడా పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తన్య సినీ ప్రయాణం
నటి తన్య రవిచంద్రన్ 2016లో విడుదలైన ``బల్లే వెల్లైయతేవా` చిత్రంతో నటిగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రాధా మోహన్ దర్శకత్వం వహించిన `బృందావనం` చిత్రంలో నటించిన ఆమె, `కరుప్పన్` చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా నటించి పేరు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ `నెంజుక్కు నీది`, శిబిరాజ్‌తో `మాయోన్`, రవిమోహన్ అఖిలన్, అర్జున్ దాస్‌తో `రసవాది` వంటి చిత్రాల్లో నటించిన తన్య రవిచంద్రన్ ప్రస్తుతం `రెట్ట తల` అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో అరుణ్ విజయ్‌కి జోడీగా నటిస్తున్నారు. అలాగే కృష్ణ ఉదయనిధి దర్శకత్వం వహించిన `పేపర్ రాకెట్` అనే వెబ్ సిరీస్‌లో కూడా హీరోయిన్‌గా నటించారు.
తన్య రవిచంద్రన్ తెలుగు సినిమాలు
తన్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ కార్తికేయతో `రాజా విక్రమార్క` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ తో చిరంజీవితో కలిసి `గాడ్‌ఫాదర్` అనే చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మూవీ యావరేజ్‌గా ఆడింది. అయితే ఈ సినిమా కూడా తన్యకి పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ఆఫర్లు రావడం లేదు. కోలీవుడ్‌కే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే తన్య మ్యారేజ్ త్వరలో ఉంటుందని సమాచారం.