- Home
- Entertainment
- ఎన్టీఆర్, త్రివిక్రమ్ సెకండ్ మూవీకి బ్రేకులు.. ఆ తర్వాతనే ప్రాజెక్ట్ పై క్లారిటీ
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సెకండ్ మూవీకి బ్రేకులు.. ఆ తర్వాతనే ప్రాజెక్ట్ పై క్లారిటీ
జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో `అరవింద సమేత` తర్వాత మరో మూవీ రావాల్సి ఉంది. ఒకసారి ఆగిపోయింది. ఇప్పుడేమో బ్రేకులు వేశారు. ఎందుకంటే ?
- FB
- TW
- Linkdin
Follow Us

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్ డేట్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో `అరవింద సమేత` చిత్రం వచ్చింది. ఇది మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో మూవీ రావాల్సింది, కానీ ఆగిపోయింది.
అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆపేశారు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ఇటీవలే నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించారు.
ఎన్టీఆర్ అన్నతో త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని, అలాగే ఎన్టీఆర్‌తో తమ బ్యానర్‌లో మరో మూవీ ఉంటుందని, వీటితోపాటు త్రివిక్రమ్, వెంకటేష్‌లతో సినిమా చేయనున్నామని ఆయన కొన్ని రూమర్లకి చెక్ పెడుతూ చెప్పారు.
మైథలాజికల్ కాన్సెప్ట్ తో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ
కానీ ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకి బ్రేకులు పడ్డాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్‌గా ప్రకటించాలని భావించారు నిర్మాత నాగవంశీ. కానీ ఇప్పుడు తాత్కాలికంగా బ్రేక్ వేశారు.
ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ఎందుకు బ్రేకులు వేశారో ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. నిజానికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీని ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం.
త్రివిక్రమ్ మొదటిసారి మైథలాజికల్ మూవీ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ని రాముడిగా, కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్ అన్నని నేను అలా చూపించనున్నాను.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీకి తాత్కాలిక బ్రేకులు
హిందీలో `రామాయణ` మూవీ గ్లింప్స్ విడుదల చేసిన తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలని చెప్పి కొన్ని రోజులు ఆపాం.
ఆ సినిమా ఎలా వస్తుంది, ఏం చూపించబోతున్నారనేది ఓ క్లారిటీ వచ్చాక మా ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ తర్వాత దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం` అని తెలిపారు నాగవంశీ.
ఈ కారణంతో తారక్, త్రివిక్రమ్ మూవీకి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఆగస్ట్ నుంచి వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా ప్రారంభమవుతుందని, ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తారక్, త్రివిక్రమ్ సినిమా పనులు స్టార్ట్ చేస్తామని నాగవంశీ చెప్పారు.
ఎన్టీఆర్ సినిమాల లైనప్
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీని `డ్రాగన్` అనే పేరుని దీనికి పరిశీలిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.
దీంతోపాటు వచ్చే నెలలో `వార్ 2`తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు తారక్. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రమిది. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు.
ఇందులో తారక్, హృతిక్‌లపై డాన్స్ నెంబర్ ఉంటుందని, అది సినిమాకి హైలైట్‌గా నిలుస్తోంది, ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రమని చెప్పారు నాగవంశీ. తెలుగులో ఈ చిత్రాన్ని ఆయనే తన సితార ఎంటర్‌టైన్ మెంట్స్ పై విడుదల చేస్తున్నారు.
జూ ఎన్టీఆర్ చేయబోయే సినిమాలివే
దీంతోపాటు ఎన్టీఆర్ చేయాల్సిన చిత్రాల్లో `దేవర 2` ఉంది. `దేవర` మూవీ గతేడాది విడుదలై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఇప్పుడు `దేవర 2` వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు తారక్.
ప్రస్తుతం రజనీకాంత్‌తో `జైలర్ 2` చేస్తున్నారు నెల్సన్. ఆ మూవీ పూర్తయిన తర్వాత తారక్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇలా భారీ లైనప్స్ తో బిజీగా ఉన్నారు జూ ఎన్టీఆర్.