- Home
- Entertainment
- పక్షవాతం రావడంతో సినిమాలకు దూరం అయిన స్టార్ హీరో, 3300 కోట్ల వ్యాపావేత్త అయ్యాడు.. ఎవరతను ..?
పక్షవాతం రావడంతో సినిమాలకు దూరం అయిన స్టార్ హీరో, 3300 కోట్ల వ్యాపావేత్త అయ్యాడు.. ఎవరతను ..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు.. ఇండస్ట్రీకి వచ్చిన 10ఏళ్లకే ప్రమాదం కారణంగా ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చింది. కాని ఆ గ్యాప్ అతన్ని వేల కోట్లకుఅదిపతిని చేసింది. ఇంతకీ ఎవరతను.

₹3300 కోట్ల కంపెనీ యజమాని
సినిమాల్లో అవకాశాలు అంత తేలికగా రావు. అలాగే వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం. మణిరత్నం సినిమాతో తెరంగేట్రం చేసిన ఓ నటుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఓ ప్రమాదం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో కాలు కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు. అయితే మళ్ళీ పుంజుకుని నటనతో పాటు ₹3300 కోట్ల వ్యాపారాన్ని కూడా నడుపుతున్నాడు.
Also Read: విశాల్ కు హ్యాండ్ ఇచ్చిన గౌతమ్ మేనన్ .. ? తన సినిమాలో హీరోను మార్చాడా..?
అరవింద్ స్వామి
ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు... అరవింద్ స్వామి. 1991లో మణిరత్నం - రజినీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన దళపతి సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 20 ఏళ్ళు. మహాభారతం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో అర్జునుడి పాత్రలో అరవింద్ స్వామి నటించి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు.
Also Read:5 వేలతో ఇండస్ట్రీకి వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు తీసుకుంటుంది.. ఎవరా హీరోయిన్
రోజా సినిమా హీరో
దళపతి సినిమాలో అరవింద్ స్వామి నటనకు మెచ్చిన మణిరత్నం తన తర్వాతి సినిమాకి ఆయన్నే హీరోగా పెట్టారు. ఆ సినిమా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఓమాస్టర్ పీస్‌గా నిలిచింది. అదే రోజా. ఈ సినిమాతో అరవింద్ స్వామికి చాక్లెట్ బాయ్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన బాంబే సినిమాలోనూ నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.
Also Read:15 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ వాడినట్టు ఆరోపణలు ఫేస్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
అరవింద్ స్వామి రీ ఎంట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న అరవింద్ స్వామి 2005లో ఓ ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో ఆయన కాలు పక్షవాతానికి గురయ్యింది. దాంతో దీంతో రెండేళ్ళపాటు మంచానికే పరిమితమైన అరవింద్ స్వామి, స్వామి నెమ్మదిగా కోలుకున్నారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటికే ఆయన మార్కెట్ కోల్పోవడంతో వ్యాపారంపై దృష్టి సారించారు. టాలెంట్ మాక్సిమస్ అనే కంపెనీని స్థాపించి దానిపై దృష్టి పెట్టారు. ఆ కంపెనీ ప్రస్తుత విలువ ₹3300 కోట్లు.
అరవింద్ స్వామి వ్యాపారం
ప్రమాదం నుంచి కోలుకున్న అరవింద్ స్వామి, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చినా, ఆయనకు మళ్ళీ గుర్తింపు తెచ్చిన సినిమా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన తని ఒరువన్. ఆ సినిమాలో స్టైలిష్ విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్న అరవింద్ స్వామి, ఆ తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి వచ్చి వరుస సినిమాల్లో నటిస్తున్నారు.
రీసెంట్ఇ గా ఆయన నటించిన సినిమా మంచి విజయాన్ని సాధించింది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. నవరస అనే వెబ్ సిరీస్‌లో విజయ్ సేతుపతి నటించిన కథను ఆయనే దర్శకత్వం వహించారు.