MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చెంప పగలగొట్టిన కాంచన- పారు, జ్యో వాదన

Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చెంప పగలగొట్టిన కాంచన- పారు, జ్యో వాదన

Karthika Deepam 2 Today Episode (మే 4వ తేదీ) లో జ్యోకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన ఫ్యామిలీ. శ్రీధర్ గుండెపోటు గురించి చెప్పలేదని కార్తీక్ చెంపపై కొట్టిన కాంచన. పారు, జ్యోత్స్నల మధ్య మాటల యుద్ధం. ఇంకా ఈ రోజు ఏం జరిగిందంటే… 

3 Min read
Author : Kavitha G
Published : May 04 2026, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో దీప, సుమిత్ర చెంపపై కొట్టిన విషయాన్ని తలుచుకుంటూ రగిలిపోతుంది జ్యోత్స్న. అప్పుడే శివన్నారాయణ, మిగతా ఫ్యామిలీ అంతా జ్యోత్స్న గదిలోకి వస్తారు. భోజనం తినడానికి కిందకు రమ్మంటే ఎందుకు రాలేదు అని అడుగుతాడు శివన్నారాయణ. ఇంత అవమానం జరిగాక ఎలా తినాలనిపిస్తుంది అంటుంది జ్యోత్స్న. అవమానం జరిగింది నీకు కాదు మాకు అంటుంది సుమిత్ర.

కార్తీక్, దీపల పెళ్లై సంవత్సరం అయింది. నువ్వు ఇష్టపడింది నీకు దక్కదని తెలుసుకోవడానికి ఇంకెంత కాలం కావాలి? నీ కోరిక తప్పు. దాన్ని బయటకు చెప్పడం ఇంకా పెద్ద తప్పు అని జ్యూకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు దశరథ, సుమిత్ర. బండి రాంగ్ రూట్ లో వెళ్తుందని తెలిసిన వెంటనే యూటర్న్ తీసుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే, అంత దూరం వెనక్కి రావాల్సి వస్తుంది. మంచి సంబంధం చూస్తా, పెళ్లి చేసుకో అని జ్యోత్స్నకు అన్నం తినిపిస్తూ చెప్తాడు శివన్నారాయణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కాంచన కంగారు
Image Credit : Jiohotstar

కాంచన కంగారు

మరోవైపు కాంచనకు భోజనం వడ్డిస్తుంటుంది దీప. అంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. ఓ తమరికి ఇల్లు ఇప్పుడు ఇళ్లు గుర్తొచ్చిందా.. అని కోపంగా మాట్లాడుతుంది కాంచన. ఇప్పటివరకూ ఎక్కడికి వెళ్లావ్? అని అడుగుతుంది. శ్రీధర్ గుండెపోటు గురించి చెప్పకుండా.. హాస్పిటల్ కు వెళ్లామని చెప్తాడు కార్తీక్. అందరూ షాక్ అవుతారు.

మాస్టారుకి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో చేరారు అని చెప్తాడు కార్తీక్. కంగారు పడుతుంది కాంచన. ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను నువ్వు భోజనం చేయమని చెప్తాడు కార్తీక్. నేను తినలేను అంటుంది కాంచన. అంత ప్రేమ ఉన్నప్పుడు క్షమించొచ్చు కదా అమ్మా అంటాడు కార్తీక్. సైలెంట్ గా ఉంటుంది కాంచన.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇంట్లో నుంచి గెంటేస్తానన్న సుమిత్ర-శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్
Related image2
Karthika Deepam 2 Today Episode: సూరజ్ ని మెచ్చుకున్న కార్తీక్- స్వప్నకు వార్నింగ్- పారు ఛాలెంజ్
37
కార్తీక్ ని చెంపపై కొట్టిన కాంచన
Image Credit : Jiohotstar

కార్తీక్ ని చెంపపై కొట్టిన కాంచన

మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ డ్యూటీకి వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. కాంచన, కార్తీక్ ని దగ్గరికి పిలిచి, చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. అంతా షాక్ అవుతారు. మీ నాన్నకు గుండెపోటు వచ్చిందని నాకు ఎందుకు చెప్పలేదురా? చచ్చిపోయాక చెప్పాలనుకున్నావా? కావేరి కాల్ చేసింది కాబట్టి నిజం తెలిసిందని బోరున ఏడుస్తుంది కాంచన. ఆ తర్వాత తల్లికి సర్ది చెప్తాడు కార్తీక్. శ్రీధర్ ని హాస్పిటల్ కి తీసుకురమ్మని కాశీకి ఫోన్ చేసి చెప్తాడు. ఇటు కాంచన, కార్తీక్ కూడా బయల్దేరుతారు.

47
అబద్ధం చెప్పలేకపోయాను..
Image Credit : Jiohotstar

అబద్ధం చెప్పలేకపోయాను..

కాంచనతో నా ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పావని కావేరిని అడుగుతాడు శ్రీధర్. అక్కకు అబద్ధం చెప్పలేకపోయాను అంటుంది కావేరి. ఇప్పుడు కార్తీక్ దోషిలా మిగిలిపోతాడు కదా అంటాడు శ్రీధర్. ఆ తర్వాత స్వప్న, కాశీలతో కలిసి హాస్పిటల్ కి వెళ్తాడు.

57
బతకడం కష్టం
Image Credit : Jiohotstar

బతకడం కష్టం

శ్రీధర్ కి మరోసారి టెస్టులు చేసిన డాక్టర్.. ఆయన హార్ట్ చాలా వీక్ గా ఉందని చెప్తాడు. మరోసారి స్ట్రోక్ వస్తే బతకడం కష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. కాంచన, స్వప్న కంగారు పడతారు. శ్రీధర్ ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్తాడు డాక్టర్. రెండు వారాల అబ్జర్వేషన్ తర్వాత అవసరం అయితే ఆపరేషన్ చేస్తామని చెప్పి వెళ్లిపోతాడు.

67
పారు కౌంటర్
Image Credit : Jiohotstar

పారు కౌంటర్

మరోవైపు హాల్లో కూర్చొని కాఫీ తాగుతుంటుంది పారిజాతం. నీ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాను అన్నట్లు మాట్లాడుతుంది జ్యోత్స్న. ఇప్పుడు నీ టైం నడుస్తోంది. నా టైమ్ స్టార్ట్ అయినప్పుడు నా చుట్టుపక్కలా ఉండేందుకే కూడా భయపడతావు అంటుంది జ్యోత్స్న. పోవే పిల్ల బాతు బచ్చా అంటుంది పారు. నువ్వు వెక్కి వెక్కి ఏడ్చే రోజు చాలా దగ్గర్లోనే ఉంది.. చాలా బాధపడతావు గ్రానీ అంటుంది జ్యోత్స్న. నువ్వు వేరే వాళ్లను చూసి ఏడ్వకు అని కౌంటర్ ఇస్తుంది పారు.

77
జ్యోత్స్న చిరాకు
Image Credit : Jiohotstar

జ్యోత్స్న చిరాకు

అంతలో దీప వస్తుంది. ఒక్కదానివే వస్తున్నావు.. బావ ఎక్కడ అని అడుగుతుంది జ్యోత్స్న. బయటకు వెళ్లాడని.. కారణం చెప్పబోతుంటే.. ఇక చాలు ఆపు. ఎప్పుడో ఏదో ఒక సోది చెప్తూనే ఉంటావ్ అని చిరాకు పడుతుంది జ్యోత్స్న. దీప.. నువ్వు లోపలికి వెళ్లు.. కొందరి మాటలను మనం లెక్కచేయకపోవడమే మంచిది అంటుంది పారు. 

నేను దీపను గుడ్డిగా నమ్మి మోసపోయాను. నువ్వు కూడా అలాగే మోసపోతావు అంటుంది జ్యోత్స్న. నా గురించి నాకు తెలుసు నీ పని నువ్వు చూసుకో అన్నట్లు మాట్లాడుతుంది పారు. ఈ బావ, దీప ఏ మందు పెట్టి నిన్ను మార్చారో అని లోలోపల చిరాకు పడుతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: సిగ్గు పడ్డట్లు అస్సలు అనిపించలేదు, మరిది సినిమాపై రష్మిక క్రేజీ కామెంట్స్
Recommended image2
EPIC Trailer: ఎపిక్ ట్రైలర్ రివ్యూ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కెమిస్ట్రీ అదిరిందిగా.. హిట్ కొట్టేసినట్లేనా
Recommended image3
Ashika Ranganath: రవితేజ హీరోయిన్ కొత్త లుక్ వైరల్, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫోటోలు ఇవే
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇంట్లో నుంచి గెంటేస్తానన్న సుమిత్ర-శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సూరజ్ ని మెచ్చుకున్న కార్తీక్- స్వప్నకు వార్నింగ్- పారు ఛాలెంజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved