ముద్దు సీన్ల కోసం రూల్ బ్రేక్ చేసిన తమన్నా.. ఆమె చెప్పిన కారణం ఏంటో తెలుసా ?
తమన్నా నో కిస్సింగ్ రూల్ ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని వివరించారు. కెరీర్ బిగినింగ్ లో తమన్నా ముద్దు సన్నివేశాలకు అస్సలు అంగీకరించేవారు కాదు.

స్టార్ హీరోయిన్ గా తమన్నా
తమన్నాకి ఇటీవల హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. కానీ ఆమె స్పెషల్ సాంగ్స్ లో ఎక్కువగా నటిస్తోంది. బాలీవుడ్ లో తమన్నాకి ఐటెం సాంగ్స్ లో అవకాశాలు వస్తున్నాయి. తమన్నా చాలా కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగ చైతన్య, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలందరితో తమన్నా నటించింది. గ్లామర్ ఒలకబోసింది.
తమన్నా నో కిస్సింగ్ రూల్
కానీ తమన్నా ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై ముద్దు సన్నివేశాల్లో, ఇంటిమేట్ సీన్స్ లో నటించలేదు. ఆ టైంలో తమన్నా ఒక రూల్ పెట్టుకుంది. ముద్దు సన్నివేశాల్లో, రొమాంటిక్ సీన్స్ లో నటించకూడదని ఆమె నిబంధన పెట్టుకుంది. చాలా ఏళ్లపాటు తమన్నా తన రూల్ కి కట్టుబడే సినిమాల్లో నటించింది.
రూల్ బ్రేక్ చేసిన తమన్నా
కానీ ఇటీవల తమన్నా తన రూల్ తానే బ్రేక్ చేసింది. లస్ట్ స్టోరీస్ 2, జీకార్ద లాంటి వెబ్ సిరీస్ లలో తమన్నా చాలా బోల్డ్ గా నటించింది. లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సన్నివేశాలలో నటించింది అందరినీ షాక్ కి గురిచేసింది. తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్ లో తనపై గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర వేశారని తమన్నా పేర్కొంది .
అందుకే ముద్దు సీన్లకు ఒకే చెప్పా
కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల్లో నటించినప్పటికీ ముద్దు సన్నివేశాలు చేయకూడదని అనుకున్నా. అందువల్ల ఛాలెంజింగ్ అనిపించే చాలా పాత్రలు మిస్సయ్యాను. ముద్దు సన్నివేశాలకు ఒకే చెప్పి ఉంటే అప్పట్లోనే పవర్ ఫుల్ చిత్రాల్లో నటించేదాన్ని. ఛాలెంజింగ్ రోల్స్ లో కూడా నటించాలనే ఉద్దేశంతోనే నో కిస్ రూల్ ని పక్కన పెట్టేసినట్లు తమన్నా పేర్కొంది.
తమన్నా చిత్రాలు
తమన్నా చివరగా తెలుగులో ఓదెల 2 అనే చిత్రంలో నటించింది. ఈ మూవీలో తమన్నా నాగ సాధువు పాత్రలో ఆకట్టుకుంది. అయితే ఆ చిత్రానికి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. అదే విధంగా రైడ్ 2, స్త్రీ 2 చిత్రాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసింది.