- Home
- Entertainment
- రాంచరణ్ నుంచి ఎన్టీఆర్ వరకు, నార్త్ డైరెక్టర్లని నమ్ముకుని మునిగిపోయిన తెలుగు హీరోలు.. ఏదో చేయబోయి ఇంకేదో
రాంచరణ్ నుంచి ఎన్టీఆర్ వరకు, నార్త్ డైరెక్టర్లని నమ్ముకుని మునిగిపోయిన తెలుగు హీరోలు.. ఏదో చేయబోయి ఇంకేదో
బాలీవుడ్ దర్శకులు తెలుగు హీరోలకు పీడకలగా మారిపోతున్నారు. బాలీవుడ్ దర్శకులతో తెలుగు హీరోలు చేసిన చిత్రాలు దారుణంగా పరాజయం చెందుతున్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న తెలుగు చిత్రాలు
ప్రస్తుతం సినిమాల విషయంలో భాషా బేధాలు దాదాపుగా తొలిగిపోయాయి. రీజియనల్ చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతూ విజయం సాధిస్తున్నాయి. ఇతర భాషల చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు దర్శకులు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణ యానిమల్, లక్కీ భాస్కర్, కుబేర లాంటి చిత్రాలు.
KNOW
బాలీవుడ్ దర్శకులతో తెలుగు హీరోలు
కానీ తెలుగు హీరోలకు మాత్రం ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ డైరెక్టర్స్ అయితే తెలుగు హీరోలని పూర్తిగా ముంచేస్తున్నారు. తెలుగు హీరోలు బాలీవుడ్ డైరెక్టర్స్ తో భారీ చిత్రాలు చేసినప్పుడు ఎంతటి దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయో ఇప్పుడు చూద్దాం.
రాంచరణ్ కి జంజీర్
రాంచరణ్ జంజీర్ నుంచి ఇటీవల విడుదలైన వార్ 2 వరకు తెలుగు హీరోలకు బాలీవుడ్ దర్శకుల నుంచి పూర్తిగా నిరాశ కలిగించే ఫలితాలు ఎదురయ్యాయి. రాంచరణ్ బాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం జంజీర్. తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయింది. 1973లో విడుదలైన అమితాబ్ బచ్చన్ జంజీర్ చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని దర్శకుడు అపూర్వ లాఖియా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ట్రోలింగ్ కి గురైన ఓం రౌత్
దీనితో ఈ బాలీవుడ్ దర్శకుడు పెద్ద అద్భుతమే చేయబోతున్నాడు అని అంతా భావించారు. కానీ సినిమా మాత్రం రాంచరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా, మరచిపోదగ్గ చిత్రంగా నిలిచింది. రాంచరణ్ తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ చేతిలో బాధితుడిగా మారారు. రామాయణం నేపథ్యంలో ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం తీవ్ర విమర్శల పాలైంది. రామాయణాన్ని ఏదో చేయబోయి ఇంకేదో చేసేశాడు ఓం రౌత్.
రీసెంట్ గా వార్ 2
ఆదిపురుష్ మూవీలో నటీనటుల వేషధారణ, తెరక్కించిన విధానం, గ్రాఫిక్స్ అన్ని విమర్శలకు గురయ్యాయి. సినిమా పరాజయం చెందింది. వందల కోట్ల బడ్జెట్ లో ఆదిపురుష్ చిత్రం తెరకెక్కింది. ప్రభాస్ తర్వాత ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్టర్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 చిత్రం ఫ్యాన్స్ ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో ఎన్టీఆర్ ని చూపించిన విధానం, గ్రాఫిక్స్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు.