MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Tabu: 28 ఏళ్ల తర్వాత ప్రియుడితో టబు రొమాన్స్.. 54 ఏళ్ల వయసులో మళ్లీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?

Tabu: 28 ఏళ్ల తర్వాత ప్రియుడితో టబు రొమాన్స్.. 54 ఏళ్ల వయసులో మళ్లీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?

54 ఏళ్ల వయసులో.. 28 ఏళ్ల తరువాత మాజీ ప్రియుడితో రొమాన్స్ కు రెడీ అయ్యింది టబు. సిల్వర్ స్క్రీన్ పై రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్న జంట.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయగలదా..? ఇంతకీ ఎవరా హీరో? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 29 2026, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ ను ఊపేసిన టబు..
Image Credit : instagram

టాలీవుడ్ ను ఊపేసిన టబు..

చేసింది తక్కువ సినిమాలే అయినా.. టాలీవుడ్ పై ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది టబు. కింగ్ నాగార్జున, బాలయ్య, చిరంజీవి జంటగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. మరీ ముఖ్యంగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో టబు కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. 

ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దూసుకుపోయింది టబు. అప్పట్లో టబు ఫిట్ నెస్, బ్యూటీకి ఆడియన్స్ ఫిదా అయిపోయేవారు. ఇప్పటికీ అదే గ్లామర్ తో, ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తోంది సీనియర్ తార.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగార్జునతో కెమిస్ట్రీ అదుర్స్..
Image Credit : Asianet News

నాగార్జునతో కెమిస్ట్రీ అదుర్స్..

టబు టాలీవుడ్ లో ఎక్కువగా కింగ్ నాగార్జునతో సినిమాలు చేసింది. సిల్వర్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యేది. నిన్నే పెళ్లాడత, ఆయన మా ఆయనే, సిసింద్రి వంటి సినిమాల్లో వీరిద్దరి రొమాన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. 

అప్పట్లో వీరిద్దరిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. టబుతో నాగార్జున డేటింగ్ చేస్తున్నాడని, సీక్రేట్ గా పెళ్లి కూడా చేసుకున్నారన్న రూమర్స్ వినిపించాయి. అయితే తాము మంచి స్నేహితులం మాత్రమే అని.. నాగార్జున క్లారిటీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

35
100వ సినిమా కోసం
Image Credit : our own

100వ సినిమా కోసం

అక్కినేని నాగార్జున తన 100వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. తన కెరీర్ కు ఇంపార్టెంట్ అయిన మూవీని తానే స్వయంగా నిర్మిస్తున్నాడు కింగ్. అన్నపూర్ణ స్టూడియోస్ , మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఈసినిమా కోసం కార్తీక్ అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు నాగార్జున. 

అంతే కాదు ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఈసినిమాకు సబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావల్సి ఉండగా.. కింగ్ 100 సినిమాలో టబు నటించబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. టబు స్వయంగా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ లో వెల్లడించింది.

45
28 ఏళ్ల తరువాత రొమాంటిక్ జోడీ రిపీట్..
Image Credit : instagram

28 ఏళ్ల తరువాత రొమాంటిక్ జోడీ రిపీట్..

నాగార్జున టబు జోడీగా మూడు సినిమాలు వచ్చాయి. నిన్నే పెళ్లాడుత, సిసింద్రి, ఆవిడా మా ఆవిడే సినిమాల్లో వీరు రొమాంటిక్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. ఇక 1998 తరువాత ఈ జంట మళ్లీ కలిసి నటించలేదు. దాదాపు 28 ఏళ్ల తరువాత నాగార్జున 100వ సినిమాలో టబు నటించబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కింగ్ 100 మూవీ క్లాప్ బోర్డ్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది సీనియర్ హీరోయిన్

55
మళ్లీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Image Credit : Asianet News

మళ్లీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

నిన్నే పెళ్ళాడత సినిమాలో నాగార్జున టబు జోడీని చూసి అభిమానులు చాలా ముచ్చటపడ్డారు. ఈమూవీలో వారిద్దరి బాండింగ్, కెమిస్ట్రీ సినిమాకు బాగా ప్లాస్ అయ్యింది. అప్పటి పరిస్థితుల్లో కాస్త ఒవర్ రొమాన్స్ అనిపించినా.. ఆ జంటను మాత్రం మళ్లీ మళ్లీ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు ఆడియన్స్. ఇన్నాళ్లకు ఈ జంట కలిసి కనిపించబోతున్నారు. 

కానీ 66 ఏళ్ల వయసులో నాగార్జున, 54 ఏళ్ల వయసులో టబు.. మళ్లీ అప్పటి మ్యాజిక్ ను రిపీట్ చేయగలరా అనేది చూడాలి. మొత్తానికి తన 100వ సినిమాను అద్భుతం చేయాలి అనుకుంటున్న నాగార్జున ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
టబు
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద సర్దార్ 2కు షాకిచ్చిన చిన్న సినిమా... వసూళ్లలో సూరిదే పైచేయి!
Recommended image2
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Related Stories
Recommended image1
Divvala Madhuri : పవర్ ఫుల్ పాత్రలో దివ్వెల మాధురి, టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్
Recommended image2
Balakrishna : మంచు లక్ష్మి చేత కన్నీళ్లు పెట్టించిన బాలయ్య, 14 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved