MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు

Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు

చిన్నప్పటి నుంచి నేను ఫిట్‌గానే ఉన్నా. కానీ పొట్ట కింది భాగంలో కొంచెం కొవ్వు ఎందుకు పోలేదో అర్థమయ్యేది కాదని హీరోయిన్ తాప్సీ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.   దానివల్ల ఏం జరిగిందో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 01 2026, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఫిట్‌నెస్ విషయంలోనూ స్ట్రిక్ట్‌గా తాప్సీ..
Image Credit : Insatgram

ఫిట్‌నెస్ విషయంలోనూ స్ట్రిక్ట్‌గా తాప్సీ..

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తాప్సీ పన్ను ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. నటనలోనే కాదు, ఫిట్‌నెస్ విషయంలోనూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. రీసెంట్ గా  తాప్సీ చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతున్నా పొట్ట దగ్గర కొవ్వు తగ్గట్లేదని బాధపడే అమ్మాయిలు తాప్సీ చెప్పే ఈ నిజాలు  వినాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
స్లిమ్‌గా ఉండటానికి తాప్సీ పడిన నరకం
Image Credit : Insatgram

స్లిమ్‌గా ఉండటానికి తాప్సీ పడిన నరకం

రీసెంట్ గా  తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. సినిమా ఇండస్ట్రీ ఒత్తిడి వల్ల, తెరపై సన్నగా కనిపించాలని ఒకప్పుడు తన శరీరాన్ని చాలా హింసించుకుందట స్టార్ బ్యూటీ. 

37
తాప్సీ ఏమన్నదంటే?
Image Credit : Insatgram

తాప్సీ ఏమన్నదంటే?

"చిన్నప్పటి నుంచి నేను ఫిట్‌గానే ఉన్నా. కానీ పొట్ట కింది భాగంలో (లోయర్ బెల్లీ) ఆ కొంచెం కొవ్వు ఎందుకు పోలేదో అర్థమయ్యేది కాదు. దాన్ని కరిగించడానికి జిమ్‌లో నన్ను నేను శిక్షించుకున్నా. ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం శూన్యం" అని తాప్సీ  బాధగా చెప్పుకొచ్చింది.

47
అతి వ్యాయామమే శాపంగా మారిందా?
Image Credit : Insatgram

అతి వ్యాయామమే శాపంగా మారిందా?

ఎక్కువ వ్యాయామం చేస్తే శరీరం సన్నబడుతుందని అనుకుంటాం. కానీ తాప్సీ ఈ విషయంలో ఏమన్నదంటే..?  "మీరు ఎక్కువగా వర్కౌట్ చేసినప్పుడు, శరీరం నీటిని బయటకు పంపే బదులు నిల్వ ఉంచుకోవడం (వాటర్ రిటెన్షన్) మొదలుపెడుతుంది. దీనివల్ల పొట్ట కింది భాగం ఉబ్బినట్లు కనిపిస్తుంది తప్ప తగ్గదు." జిమ్‌లో గంటలు గడిపే మహిళలు ఈ విషయం గమనించాలి. ఇది కొవ్వు మాత్రమే కాదు, నీరు కూడా కావచ్చు!

57
 కొంచెం కొవ్వు ఎందుకు అవసరం?
Image Credit : Insatgram

కొంచెం కొవ్వు ఎందుకు అవసరం?

 న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్నాక తాప్సీకి అసలు విషయం తెలిసిందట. మహిళల పునరుత్పత్తి అవయవాలు (Reproductive Organs) పొట్ట కింది భాగంలో ఉంటాయి. ఈ సున్నితమైన అవయవాలను రక్షించడానికి అక్కడ కొంత కొవ్వు, నీరు ఉండటం చాలా అవసరం. ఇది ప్రకృతి మహిళలకు ఇచ్చిన రక్షణ కవచం. దాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించడం ఆరోగ్యానికి హానికరం అని ఆమె వివరించింది.

67
శరీరాన్ని హింసించుకోవద్దు
Image Credit : Insatgram

శరీరాన్ని హింసించుకోవద్దు

తాప్సీ మాట్లాడుతూ.. " ఈ రోజుల్లో అంతా సోషల్ మీడియా మయం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్లు వాడిన పర్ఫెక్ట్ ఫోటోలు చూసి, మీ శరీరాన్ని కూడా అలా మార్చుకోవాలనే భ్రమలో పడొద్దని తాప్సీ హెచ్చరించింది. "ఒక మహిళగా మీ శరీర అవసరాలను గౌరవించండి. కొన్నిసార్లు పొట్ట ఉబ్బినట్లు కనిపించడం సహజం, ఆరోగ్యకరం కూడా. కేవలం ఫోటోల కోసం మీ శరీరాన్ని టార్చర్ పెట్టుకోవద్దు" అని తాప్సీ గట్టిగా చెప్పింది.

77
తాప్సీ సినిమాలు..
Image Credit : Insatgram

తాప్సీ సినిమాలు..

ఇక సినిమాల విషయానికొస్తే, తాప్సీ ఇటీవల 'అస్సి' చిత్రంలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, తాప్సీ చెప్పిన ఈ నిజాయితీ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఫిట్‌నెస్ అంటే అందంగా కనిపించడం కాదు, మన శరీరాన్ని మనం ప్రేమించడం అని తాప్సీ నిరూపించింది. కాబట్టి అమ్మాయిలూ, ఈ రోజు నుంచే అనవసరమైన ఒత్తిడిని పక్కనపెట్టి మీ శరీరాన్ని ప్రేమించడం మొదలుపెట్టండి!

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Related Stories
Recommended image1
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved