Brahmamudi: కోలుకోలేని షాక్ లో కావ్య.. తల్లిదండ్రులని ఘోరంగా అవమానించిన స్వప్న!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన స్వార్థం కోసం చెల్లెలి జీవితానికి నిప్పు పెడుతున్న ఒక అక్క కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో డాక్టర్ని బెదిరించి పది నిమిషాల్లో ఇంటికి వచ్చి నిజం చెప్పమంటుంది రుద్రాణి. మరోవైపు సీమంతం పూర్తికావడంతో అమ్మాయిని లోపలికి తీసుకువెళ్లండి రెస్ట్ తీసుకుంటుంది అంటుంది చిట్టి. ఇంతలో అక్కడికి వచ్చిన రుద్రాణి ఆగమ్మ నేను ఇచ్చిన గిఫ్ట్ చూడాలి కదా అంటుంది రుద్రాణి. ఏం గిఫ్ట్ అది అంటుంది ధాన్యలక్ష్మి. వెయిట్ అండ్ సీ ఒక్క 10 నిమిషాల్లో వచ్చేస్తుంది అంటుంది రుద్రాణి. ఇంతలో డాక్టర్ అక్కడికి రానే వస్తుంది. ఆమెని చూసిన స్వప్న షాక్ అవుతుంది.
డాక్టర్ని నిజం చెప్పమంటుంది రుద్రాణి. ఏం నిజం అని అడుగుతుంది చిట్టి. ఇన్నాళ్లు స్వప్న కడుపులో దాచుకున్న నిజం అంటూ స్వప్న కడుపుకి ఉన్న ప్యాడ్ తీసి అందరికీ చూపిస్తుంది. ఇన్నాళ్లు ఈ స్వప్న కడుపు ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేయడమే కాకుండా నన్ను నా కొడుకుని ఒక ఆట ఆడుకుంది, ఇలాంటి ఆడది నాకు ఎప్పటికీ కోడలు కాలేదు అంటుంది రుద్రాణి. కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
చిట్టి డాక్టర్ని మందలించి అక్కడి నుంచి పంపించేస్తుంది. రాహుల్ కూడా స్వప్న మీద కేకలు వేస్తాడు. ఇన్నాళ్లు ఈ నిజం నాకెందుకు చెప్పలేదు, ఎందుకు ఇంత మోసం చేశావు అని అడుగుతాడు. మోసం అనేది ఈ రోజు కొత్తేమీ కాదు కదా రాహుల్, ఏ తల్లి పెంపకంలో పెరిగింది, చెట్టు ఒకటి అయితే విత్తనం మరొకటి అవుతుందా అంటూ కోపంగా కనకం వైపు చూస్తూ అంటుంది అపర్ణ. అమ్మ నేను పెళ్లి చేయడం కోసం అబద్ధం చెప్పాను.
కానీ అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగానే అపర్ణ ఆమెని చీదరించుకుంటుంది. ఇలాంటి భార్య నాకు వద్దు అంటూ స్వప్నని బయటికి లాక్కుపోతూ ఉంటాడు రాహుల్. అతనికి తోడు అవుతుంది రుద్రాణి. ఇప్పుడు గాని బయటికి వెళ్ళిపోతే జీవితంలో వీళ్ళు మళ్ళీ నన్ను లోపలికి రానివ్వరు ఎలా అయినా తప్పించుకోవాలి అని ఆలోచించినా స్వప్న భర్త చెయ్యి అత్త చెయ్యి విడిపించుకుని కావ్య దగ్గరికి వెళ్లి ఇక్కడ ఎంత జరుగుతున్నా ఏమి మాట్లాడవేమిటి..
నిన్ను నమ్మి నేను అడుగు ముందుకు వేశాను దయచేసి నిజం చెప్పు అంటుంది స్వప్న. మధ్యలో కళావతిని ఎందుకు లాగుతావ్ అంటాడు రాజ్. అసలు నాకు ఈ సలహా ఇచ్చిందే కావ్య అంటుంది స్వప్న. కావ్యతో పాటు కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు.నువ్వు చేసిన వెధవ పనిని దాని మీద రుద్దాలని ప్రయత్నించకు అంటు స్వప్న మీద చెయ్యి ఎత్తుతుంది కనకం.
అప్పుడు కోపంతో రెచ్చిపోయిన స్వప్న కనకం అని పేరు పెట్టి పిలుస్తుంది. అసలు ఇదంతా నీ ముద్దుల కూతురు వల్లే జరిగింది ఆరోజు పెళ్లి చూపులప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే తనే కడుపు నాటకం ఆడమంది అని చెప్తుంది. ఆ మాటలకి కోపంతో అరుస్తాడు కృష్ణమూర్తి. నీ జీవితం పాడవకుండా ఉండడం కోసం చెల్లెలు జీవితాన్ని నాశనం చేయకు అంటాడు.
ఆగవయ్యా పెద్దమనిషి పిల్లల్ని పోషించడం రాదు కానీ నువ్వు కూడా నీతులు చెప్తున్నావు అంటూ ఈ తండ్రిని మర్యాద లేకుండా మాట్లాడుతుంది స్వప్న. ఎందుకక్కా నేను నీకు ఏమని అన్యాయం చేశానని నామీద నీకు ఇంత కక్ష, ఎందుకు నామీద అపవాదు వేస్తున్నావు అంటుంది కావ్య. అప్పుడు రుద్రాణి అంటే అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఈ నాటకం ఆడారు అన్నమాట అంటుంది.
నా పెద్ద కూతురు దాని జీవితం కోసం ఎవరినైనా ఫణంగా పెట్టగలదు కానీ నా చిన్న కూతురు అలాంటిది కాదు దాన్ని అపార్థం చేసుకోవద్దు అంటాడు కృష్ణమూర్తి. తరువాయి భాగంలో నాకు కడుపు లేదనే విషయం కావ్యకి తెలుసు, తెలియదని చెప్పమనండి అంటూ కావ్య చేతులు తీసుకెళ్లి తల్లి నెత్తి మీద పడుతుంది. కావ్య ఏమి మాట్లాడకపోవటంతో కుటుంబ సభ్యులందరూ మళ్ళీ షాక్ అవుతారు.