- Home
- Entertainment
- Brahmamudi: పెద్దమ్మని ఘోరంగా అవమానించిన స్వప్న.. కావ్య కోసం చీర తీసుకొచ్చి షాకిచ్చిన అపర్ణ!
Brahmamudi: పెద్దమ్మని ఘోరంగా అవమానించిన స్వప్న.. కావ్య కోసం చీర తీసుకొచ్చి షాకిచ్చిన అపర్ణ!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అత్యాశతో జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకొని తిరిగి పుట్టింటికి చేరుకున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్ తన మీద పడటంతో కంగారుపడి కేకలు పెడుతుంది కావ్య. చిట్టి వాళ్ళు పరుగున వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. ఏదో జరిగిపోయింది అని ఊహించుకొని మరీ మొరటుగా ప్రవర్తించకు అంటూ చిలిపిగా నవ్వుతుంది చిట్టి. నానమ్మ.. నువ్వు ఏదేదో అనుకొని ఊహించుకోకు ఇక్కడ ఏమీ జరగలేదు అంటాడు రాజ్.
పువ్వునైనా లవ్వునైనా సున్నితంగా డీల్ చేయాలి అంటాడు కళ్యాణ్. నువ్వు కూడా సలహా ఇస్తున్నావా అంటూ కోప్పడతాడు రాజ్. నువ్వైనా నచ్చితే చెప్పుకోవాలి కానీ ఇలా కంగారు పడిపోతే ఎలా అంటూ కావ్యని మందలిస్తుంది చిట్టి. మళ్లీ కేకలు వినిపిస్తే వంతులవారీగా నీ గది ముందు కాపలా కాస్తాం అంటాడు కళ్యాణ్ వాళ్ళ నాన్న. మీకు అంత శ్రమ రానివ్వను మీరు వెళ్ళండి అంటాడు రాజ్.
ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటూ అయోమయంగా అడుగుతాడు కళ్యాణ్ వాళ్ళ బాబాయ్. వాళ్ళిద్దరికీ భయంగా ఉందంట నిన్ను తోడుగా పడుకోమంటున్నారు అంటూ వెటకారం ఆడుతాడు కళ్యాణ్. వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత తలుపు గడియ పెట్టి.. చేసింది చాలు ఇంక రా అంటాడు రాజ్. మీలో ఒక అపరిచితుడు ఉన్నాడు మీరు నన్ను ఏమి చేయరు కదా అంటుంది కావ్య. నాకేమీ అంత ఉత్సాహం లేదు అంటాడు రాజ్. మరోవైపు పొద్దు పొద్దున్నే లేచి కాఫీ కావాలి అని వాళ్ళ పెద్దమ్మ ని అడుగుతుంది స్వప్న. పొద్దున్నే కాఫీ ఏంటి మొహం కడుక్కొని రా కావాలంటే గోరువెచ్చని నీరు ఇస్తాను అంటుంది పెద్దమ్మ.
ఇదంతా వింటున్న కనకం నువ్వేంటి మా అక్కకి ఆర్డర్లు వేస్తున్నావు నేనే మా అక్కకి పని చెప్పను కావాలంటే నువ్వే కలుపుకో అంటుంది. నేను ఏమన్నానని అందరూ అంత కోపంగా ఉన్నారు అయినా మూడు పూటలా తింటూ ఇంట్లో ఖాళీగానే కూర్చుంటుంది కదా అంటుంది స్వప్న. ఆ మాటలు విన్న కృష్ణమూర్తి ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఆవిడ బయటది ఎందుకు అవుతుంది ఆవిడకి తోడుగా మీ అమ్మ ఉంది. ఆవిడ బాధ్యత మనది. మనకి మాత్రం పెద్దదిక్కు ఎవరున్నారు అంటాడు కృష్ణమూర్తి.
పెట్టింది తిని మర్యాదగా ఇంట్లో ఉంటే ఉండు లేదంటే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. నువ్వు ఎవరివి మా అక్కని అంటానికి ఆ మాటకు వస్తే నువ్వే బయట దానివి అంటుంది కనకం. కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. ఏడుస్తున్న పెద్దమ్మ ని నీకు నేనున్నాను నువ్వే నా అమ్మవి అంటూ ఆమెని హత్తుకుంటుంది అప్పు. మరోవైపు మంగళ స్నానాలు చేయటానికి సిద్ధంగా ఉంటారు రాజ్, కావ్య. త్వరగా మంగళ స్నానాలు చేయించేయండి త్వరగా ఈ బ్రహ్మముడి విప్పేయాలి అంటూ కంగారు పెడతాడు రాజ్. నువ్వు రాజ్ కి నీళ్లు పోయు నేను కావ్యకి నీళ్లు పోస్తాను అంటుంది ధాన్యలక్ష్మి.
నీళ్లు పోసుకోవటానికి ఆవిడకి సరదాగా ఉందేమో కానీ ఇక్కడ సంబరాలు చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అంటూ కోపంగా మాట్లాడుతుంది అపర్ణ. నీ నోటి చలవ వల్ల నా మనవరాలు నీళ్లు పోసుకుంటే అంగరంగ వైభవంగా సీమంతం చేయిస్తాను అంటుంది చిట్టి. ఇద్దరికీ మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత బ్రహ్మముడి విప్పియడమేనా అంటాడు రాజ్. ఇంకా చాలా తంతు ఉంది అంటాడు కళ్యాణ్. ఎక్కువ మాట్లాడితే నేను ఎగిరి తంతాను అంటాడు రాజ్. ఈ మాట నువ్వు నేను చెప్పలేదు నా నమ్మే చెప్పింది అంటాడు కళ్యాణ్. అవును బాబు అంటూ తులసి కోట దగ్గరికి తీసుకువెళ్లి కావ్యని అక్కడ దీపం పెట్టమంటుంది చిట్టి.
ఇది నేను రోజు దీపం పెట్టుకునే తులసి కోట అంటుంది అపర్ణ. అయితే ఏంటి నువ్వేమైనా ఈ కోటకు మహారాణివా అంటుంది చిట్టి. దీపం ఆర్పితే తప్పుగానీ వెలిగిస్తే తప్పేంటి అక్క అంటూ కావ్య చేత దీపం పెట్టిస్తుంది ధాన్యలక్ష్మి. దీపం వెలిగించి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది కావ్య. తులసి కోట చుట్టూ దంపతులిద్దరిని ప్రదక్షిణ చేయమంటుంది చిట్టి. వాళ్లు అలాగే చేస్తారు.
తర్వాయి భాగంలో కోడలు కోసం చీర తీసుకొస్తుంది అపర్ణ. ఆశ్చర్యపోయిన కావ్య మీరు తీసుకొచ్చారు ఏంటి మేడం అని అడుగుతుంది. తప్పు నీదని తెలిసిన రోజు ఎలాగూ ఇంట్లోంచి వెళ్ళిపోతావు కదా అప్పటివరకు కోడలుగా రాజభాగం అనుభవించు అంటుంది అపర్ణ. తప్పు నాది కాదు అని తెలిస్తే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను కదా అంటుంది కావ్య.