Brahmamudi: తల్లిని అవమానించి బయటికి గేంటేసిన స్వప్న.. అత్తగారి నిర్ణయానికి షాక్ లో కావ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. అక్క చేసిన తప్పుకి బలైపోయిన చెల్లెలు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో రూమ్ లో కూర్చుని నైల్ పోలిష్ వేసుకుంటున్న స్వప్న దగ్గరికి వచ్చిన కనకం కోపంతో చేసిన పనికి సిగ్గుపడకుండా గోళ్ళకి రంగు వేసుకుంటున్నావా అంటూ స్వప్నని కొడుతుంది. ఏం చేస్తున్నావ్ అంటూ తల్లి మీద చిరాకు పడుతుంది స్వప్న. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నది కాక నీ చెల్లెల్ని కూడా లాగుతున్నావు నీకు ఇదేమైనా బాగుందా అంటుంది కనకం.
నీ చిన్న కూతురు ఏమి త్యాగం చేసెయ్యలేదు, తన కాపురానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని నిజాన్ని దాచింది, అయినా కొట్టవలసింది నన్ను కాదు నిన్ను. నువ్వు కొట్టుకో, అసలు నన్ను ఇలా తయారు చేసింది నువ్వు అంటూ పొగరుగా మాట్లాడుతుంది స్వప్న. అదంతా నీ కోసమే చేశాను, నువ్వు బాగోవాలని కావ్య సంపాదించిందంతా నీకు ధారపోసాను ఇప్పుడు నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు దయచేసి కావ్య జోలికి పోవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కనకం.
నేను అలాగే చేస్తాను, నా దారికి అడ్డం వస్తే ఎవరిని వదలను ఆఖరికి నిన్ను కూడా అంటుంది స్వప్న. ఆ మాటలకి కోపంతో నిన్ను ఇంట్లో ఉంచితే కావ్యని ప్రశాంతంగా ఉండనివ్వవు పద నాతో అని స్వప్నని లాక్కెళ్లి పోతుంది కనకం. నా పెళ్లితో తల్లిగా నీ పాత్ర అయిపోయింది ఇక ఇదే నా ఇల్లు అని చెప్పి తల్లిని గదిలోంచి బయటకు నెట్టేసి మొహం మీదే తలుపు వేసేస్తుంది స్వప్న.
దిగులుగా ఉన్న తల్లిని చూసి ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది కావ్య. నేను నీ పట్ల తప్పు చేశాను క్షమించు అని చెప్పి బాధతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది కనకం. ఆ తర్వాత ఇంటికి వెళ్లి జరిగిందంతా భర్తకి కూతురికి చెప్తుంది. అప్పు కోపంతో ఊగిపోతూ ఉండు ఇప్పుడే వెళ్లి అక్క సంగతి తేలుస్తాను అంటూ అక్కడనుంచి వెళ్ళబోతుంది.అక్కడికి వెళ్తే గొడవ జరుగుతుంది తప్పితే ఆ స్వప్నలో ఎలాంటి మార్పు రాదు.
కావ్య ని ఇక ఆ భగవంతుడే కాపాడాలి అని చెప్పి అప్పుని ఆపేస్తుంది కనకం. ఆ తర్వాత కావ్య తల్లికి ఫోన్ చేసి ఎందుకు ఇంట్లోంచి బాధతో వెళ్లావు ఎవరైనా ఏమైనా అన్నారా అంటుంది. జరిగిందంతా చెప్తుంది కనకం. తను విన్నాదా అని అడుగుతుంది కావ్య. కనకం ఏమీ మాట్లాడకపోవడంతో ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను అయినా నాకోసం నువ్వు కంగారు పడకు అని చెప్తుంది కావ్య.
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ నీతో ఎలా ఉన్నారు, పెద్దాయన ఏం నిర్ణయం తీసుకున్నారు అని కూతుర్ని అడుగుతుంది కనకం. ఏం నిర్ణయం తీసుకున్నా ఏమి చేయలేము అంతా భగవంతుని దయ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య. మరోవైపు అపర్ణకి సర్ది చెప్తూ ఉంటారు ధాన్యలక్ష్మి, చిట్టి. స్వప్న చేసిన తప్పుకి కావ్యని శిక్షించకూడదు తను ఇంటికి వచ్చిన దగ్గరనుంచి అందరితోని చాలా మర్యాదగా మసలుకుంది అని చెప్తారు.
నేను కావ్య తప్పు చేసింది అంటే మీరు తనని పొగుడుతారు ఏంటి అంటుంది అపర్ణ. ఇప్పుడు కావ్య ని ఇంట్లోంచి బయటికి పంపించేసి ఇంకొక కోడలు ఇంట్లోకి తెచ్చుకుంటే తను మాత్రం సవ్యంగా ఉంటుందా, అందుకు స్వప్నే ఉదాహరణ అంటుంది చిట్టి. ఏది ఏమైనా కావ్య తప్పు చేసింది, మావయ్య గారికి సరైన నిర్ణయం తీసుకోమని చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ.
మరోవైపు రాజ్ వాళ్ళ పెళ్లి ఫోటో ని కాల్చేస్తాడు. అప్పుడు అతని చెయ్యి కూడా కాస్త కాలుతుంది అది చూసి కావ్య కంగారు పడుతుంది. మరో కొత్త నాటకం ఆడకు అంటాడు రాజ్. మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు, నేను అబద్ధం చెప్పలేదు నిజాన్ని మాత్రమే దాచాను అంటుంది కావ్య. హత్యా నేను చేయలేదు నా ఆయుధం చేసింది అని చెప్తున్నట్లుగా ఉంది.
అయినా రేపు తాతయ్య తీసుకునే నిర్ణయంతో ఈ దూరం శాశ్వతం అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. తరువాయి భాగంలో సీతారామయ్యతో సరియైన నిర్ణయం తీసుకోండి స్వప్నతో పాటు కావ్యను కూడా ఇంట్లోంచి బయటికి పంపించేయండి, రాజ్ కి విడాకులు ఇప్పిద్దాం అంటుంది అపర్ణ. ఆ మాటలకి కావ్య షాక్ అవుతుంది.