Brahmamudi: చనిపోవడానికి సిద్ధమైన స్వప్న.. భర్తను చూసి భయపడుతున్న కావ్య?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. అక్క చేసిన తప్పుకి ఫలితం అనుభవిస్తున్న ఒక చెల్లెలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్నని అప్పగింతలు పెట్టి ఇంటికి వచ్చేస్తారు కనకం వాళ్లు. ఆ తర్వాత స్వప్నని గదిలోకి తీసుకువెళ్లి జరిగిందంతా చెప్పి ఎందుకు ఈ నాటకం ఆడావు అని నిలదీస్తుంది కావ్య. నువ్వేంటి నామీద ఏదో బాధ్యత తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు అని నిష్టూరంగా మాట్లాడుతుంది స్వప్న.
నేనే కనుక అమ్మ నాన్నని ఒప్పించకపోయి ఉంటే ఈపాటికి ఇంకా గుడిమెట్ల ముందే అడుక్కుంటూ ఉండేదానివి. నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావేమో అనుకొని ఇక్కడ వీళ్లందరితో గొడవపడి మరిన్ని పెళ్లికి ఒప్పించాను ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి నన్ను కూడా భాగస్వామి చేశావు ఈ నిజం రాజ్ కు తెలిసిందంటే ఆ పాపాన్ని నాకు కూడా అంటగడతాడు అంటుంది కావ్య.
నేనేం చేసేది రాహుల్ నన్ను మోసం చేయాలని చూశాడు అందుకే నేను కూడా అతనిని మోసం చేశాను ఇందులో నాకు ఏమి తప్పు కనిపించడం లేదు అంటుంది స్వప్న. నీకు అలాగే అనిపిస్తుంది కానీ నాకు మాత్రం మోసం కనిపిస్తుంది ఇప్పుడే ఈ విషయం రాజ్ కు చెప్తాను అంటుంది కావ్య. నువ్వు చెప్పడానికి వెళ్లే లోపల ఇక్కడ నేను చచ్చిపోతాను అని బెదిరిస్తుంది స్వప్న.
ఏంటి బెదిరిస్తున్నావా? అమ్మానాన్నలకి చెప్తే వాళ్ళు చూసుకుంటారు. ఉండు వాళ్ళని పిలిపిస్తాను అంటుంది కావ్య. ఆ మాటలకి స్వప్న కాస్త ఆవేశం తగ్గించుకొని నా బాధలు నేను పడతాను ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను. కాదు కూడదు అంటే నా శవాన్ని కళ్ళు చూస్తావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న.
మరోవైపు ఇంటికి వచ్చిన కనకం ఇల్లంతా బోసిపోయిందని బాధపడుతుంది. కానీ నాకు మాత్రం బాధ లేదు పెద్దది అనుకున్నది సాధించింది. చిన్న దానికి కూడా అక్కడ పెద్దగా కష్టాలు ఏమీ లేవు కాకపోతే వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనం చీరసారే పెట్టలేదు అంటాడు కృష్ణమూర్తి. నేను ఏ అబ్బో సపోర్ట్ చేసి పెట్టేదాన్ని కానీ ఆ బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు.
అలాగే నా తప్పుని స్వప్న తప్పుని కూడా అంత త్వరగా క్షమిస్తారనికోలేదు అంటుంది కనకం. అది ఆ ఇంటి సంస్కారానికి నిదర్శనం అంటాడు కృష్ణమూర్తి. మరోవైపు రాహుల్ ఫస్ట్ నైట్ మాట్లాడుకుంటూ ఉంటారు చిట్టి వాళ్ళు. మీరందరూ బలవంతంగా దాన్ని నా కోడల్ని చేశారు. నాకేం సంబంధం లేదు ఆ ఏర్పాట్లు ఏమో మీరే చేసుకోండి అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి.
సరిగ్గా అదే సమయానికి అక్కడికి రాజ్ వస్తాడు. రాజ్ ని పిలిచిన చిట్టి విషయం చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది నువ్వే చెప్పు అని కావ్యతో చెప్తుంది. ఫస్ట్ నైట్ సంగతి చెప్పిన కావ్య ఆ గదిని మనమే అలంకరించాలి అని చెప్తుంది. ఏమేం కావాలో లిస్ట్ చెప్పు అంటాడు రాజ్. చెప్పిన తర్వాత కళ్యాణ్ కి మెసేజ్ పెడతాను వాడు తీసుకువస్తాడు తర్వాత మనం గదిని డెకరేట్ చేద్దాం అంటాడు రాజ్.
మరోవైపు మన రిసెప్షన్ అయినా గ్రాండ్ గా జరుగుతుందా అని రాహుల్ ని అడుగుతుంది స్వప్న. తను మాత్రం గ్రాండ్గా రిసెప్షన్ చేసుకుంది మనకి మాత్రం వద్దని చెప్పేసింది. మీ చెల్లెలు అని చెప్తాడు రాహుల్. ప్రతి విషయంలోనే నాకు అడ్డు తగులుతున్నావు కావ్య. నిన్ను పనిమనిషి కంటే హీనంగా చూస్తాను చూస్తూ అని మనసులో కసిగా అనుకుంటుంది కావ్య.మరోవైపు రూమ్ డెకరేట్ చేస్తూ అక్క తప్పు చేసింది తనతో పాటు నన్ను కూడా భాగస్వామిని చేసింది.
ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నా భర్త కూడా దూరం పెడతాడు అని బాధపడుతుంది కావ్య. ఇంతలోనే చేత్తో కత్తి పట్టుకుని గదిలోకి వస్తాడు రాజ్. తరువాయి భాగంలో కడుపుతో ఉండే వాళ్ళు ఎలా నడుచుకుంటారో అదైనా తెలుసుకో. నువ్వు కడుపుతో లేవని ఇంట్లో వాళ్లకి తెలిస్తే నిన్ను ఇంట్లోంచి పంపించేస్తారు అని హెచ్చరించి బయటికి వస్తుంది కావ్య. అక్కడ ఉన్న రాజ్ ని చూసి షాక్ అవుతుంది. నా మాటలన్ని ఈయన వినేశారా అని భయపడుతుంది.