- Home
- Entertainment
- Mamitha Baiju: 2026 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్.. వరుసగా 300, 330, 350 కోట్ల కలెక్షన్స్
Mamitha Baiju: 2026 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్.. వరుసగా 300, 330, 350 కోట్ల కలెక్షన్స్
Mamitha Baiju: 2016లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, 2026లో వరుసగా నాలుగు హిట్ సినిమాలు ఇచ్చి ఇండియన్ సినిమా దృష్టిని ఆకర్షించింది. వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

2026లో సూపర్ హిట్ సినిమాల హీరోయిన్
సౌత్ సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మన సౌత్ యాక్టర్లకు బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ స్టార్లు కూడా సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ సౌత్ హీరోయిన్, 2026లో వరుస హిట్లు కొట్టి ఇండియన్ సినిమాను తనవైపు తిప్పుకుంది. ఆమెనే మమితా బైజు
ఎవరీ హీరోయిన్?
మమితా బైజు 2016లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ లోకంలోకి అడుగుపెట్టింది. మలయాళం, తమిళ సినిమాల్లో యాక్టివ్‌గా ఉండే ఈమె, తన బబ్లీ రోల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2024లో వచ్చిన 'ప్రేమలు' (Premalu) సినిమా మమితా బైజుకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇక 2025లో వచ్చిన 'డ్యూడ్' (Dude) సినిమా కూడా కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
2026లో వరుస హిట్లు
మమితా బైజు నటించిన నాలుగు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలు హిట్ లిస్ట్‌లో చేరి బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపాయి. ఈ సినిమాల్లోని పాత్రల పేర్లతోనే జనాలు మమితా బైజును గుర్తుపడుతున్నారు. దీంతో ఆమెకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది.
మమితా బైజు సినిమాలు, కలెక్షన్స్
జన నాయగన్ (Jana Nayagan):
బడ్జెట్: రూ. 300-325 కోట్లు
బాక్సాఫీస్ కలెక్షన్: రూ. 350 కోట్లు
విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons):
బడ్జెట్: రూ. 130 కోట్లు
బాక్సాఫీస్ కలెక్షన్: రూ. 300 కోట్లు
బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit):
బడ్జెట్: రూ. 25 కోట్లు
బాక్సాఫీస్ కలెక్షన్: రూ. 330 కోట్లు
ఇక 'కారా' (Kara) సినిమా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 50 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ, ఇందులో మమితా యాక్టింగ్‌కు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.
రూ. 9 కోట్లకు రూ. 130 కోట్ల కలెక్షన్స్
మమితా బైజు 'ప్రేమలు' సినిమాలో రీను పాత్ర ద్వారా తొలిసారి లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 130 కోట్లు వసూలు చేసింది. ఇలా సౌత్‌లోనే హాట్ కేక్‌గా మారిపోయింది మమితా బైజు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నట్టు సమాచారం.





