MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Suriya: నడుము కిందకు ప్యాంట్‌ వేసుకుంటాడా? సింగపూర్‌ అభిమాని ఇచ్చిన సలహా సీరియస్‌గా తీసుకున్న సూర్య

Suriya: నడుము కిందకు ప్యాంట్‌ వేసుకుంటాడా? సింగపూర్‌ అభిమాని ఇచ్చిన సలహా సీరియస్‌గా తీసుకున్న సూర్య

Suriya: హీరో సూర్య సింగపూర్‌కు చెందిన అభిమాని ఇచ్చిన సలహా గురించి, దాని వల్ల తనని తాను మార్చుకున్న విషయం గురించి ఓపెన్‌ అయ్యాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 04 2025, 09:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సూర్య అభిమానులు:

సూర్య అభిమానులు:

Suriya: సీనియర్‌ నటుడు శివ కుమార్‌ వారసుడిగా సినీ రంగలోకి అడుగుపెట్టి సూర్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంతోపాటు కోట్లాది మంది అభిమానుల మనసుల్లో చోటు సంపాదించారు. భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. నటనపై ఉన్న ఆసక్తితోనే లోయోలా కళాశాలలో విస్కాం చదివిన సూర్య, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గార్మెంట్ బిజినెస్‌ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
`ఆశ`సినిమా అవకాశాన్ని తిరస్కరించిన సూర్య:

`ఆశ`సినిమా అవకాశాన్ని తిరస్కరించిన సూర్య:

సూర్య గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, దర్శకుడు వసంత్ తన `ఆశ` సినిమాలో సూర్యను నటింపజేయడానికి సంప్రదించారు. అప్పుడు ఆ అవకాశాన్ని సూర్య తిరస్కరించడంతో... ఈ సినిమా అజిత్‌కు వెళ్ళింది.

దీని తర్వాత స్వయంగా దర్శకుడు వసంత్‌ను  వెతుక్కుంటూ వెళ్లి, సినిమా అవకాశం అడిగారు. ఆ సమయంలోనే `నేరుకు నేరు` సినిమాలో నటించాల్సిన అజిత్, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడంతో, సూర్యకు ఆ అవకాశం దక్కింది.

 

37
బాల దర్శకత్వంలో నందా :

బాల దర్శకత్వంలో నందా :

కెరీర్‌ ప్రారంభంలో సూర్య నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ,  వసూళ్ల పరంగా ఏదీ విజయం సాధించలేదు. ఆ సమయంలో సూర్య దర్శకుడు బాల దర్శకత్వంలో నటించిన నందా చిత్రం ఆయనకు పెద్ద మలుపుగా నిలిచింది.

దీనిని ఇటీవల బాల 25 కార్యక్రమంలో సూర్య బహిరంగంగా చెప్పారు. 'నందా' సినిమా అవకాశమే తనకు 'వారణం ఆయిరం', 'కాక్క కాక్క' వంటి సినిమాలు రావడానికి కారణమైందని తెలిపారు.

47
అనూహ్య ఓటమిని చవిచూసిన `కంగువ`

అనూహ్య ఓటమిని చవిచూసిన `కంగువ`

దర్శకుడు బాల దర్శకత్వంలో సూర్య నిర్మించి - నటించిన `వణంగాన్` సినిమా నుండి సగంలోనే సూర్య తప్పుకున్నారు.... దీని తర్వాత సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన `కంగువ` సినిమాపై తన దృష్టిని కేంద్రీకరించారు.

దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో భారీ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం 2000 కోట్ల వసూళ్లు సాధిస్తుందని చిత్ర బృందం భావించింది. కానీ పెట్టిన డబ్బులో సగం కూడా వసూలు చేయకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది.

 

57
సూర్య `రెట్రో` విడుదల

సూర్య `రెట్రో` విడుదల

ఈ సినిమా ఓటమితో పలు ఆలయాలకు వెళ్లి ఓదార్పు పొందిన నటుడు సూర్య... ప్రస్తుతం తన సినిమాలపై మళ్లీ దృష్టి సారించారు. ఆ కోవలోనే ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించిన 'రెట్రో' చిత్రం మే 1న విడుదల కానుంది.

అదేవిధంగా ప్రస్తుతం సూర్య చేతిలో ఆర్‌.జె.బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న 45వ చిత్రం ఉంది. దీని తర్వాత, వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' చిత్రంలో సూర్య నటించనున్నారు.
 

67
మలయాళ చిత్ర దర్శకుడి దర్శకత్వంలో సూర్య:

మలయాళ చిత్ర దర్శకుడి దర్శకత్వంలో సూర్య:

అంతేకాకుండా సూర్య మలయాళ చిత్ర దర్శకుడు అమల్ నీరద్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, తన సినీ కెరీర్‌లో బిజీగా ఉన్న నటుడు సూర్య, తన గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే అభిమాని ఇచ్చిన సలహానే తన రూపంలో వచ్చిన మార్పుకు కారణమని చెప్పారు.

 

77
అభిమాని చెప్పిన సలహాను స్వీకరించిన సూర్య:

అభిమాని చెప్పిన సలహాను స్వీకరించిన సూర్య:

అంటే సూర్య సాధారణంగా తన ప్యాంటును నడుముకు పైననే వేసుకుంటారట. సింగపూర్ నుండి తనను కలవడానికి వచ్చిన ఓ అభిమాని, ప్యాంటును లో హిప్‌లో(నడుము కిందకు) వేసుకుంటే బాగుంటుందని చెప్పడంతో, నేను దానిని ఫాలో అవుతున్నాను. ఇలా నాకు సింగపూర్ అభిమానుల నుండి చాలా సలహాలు వచ్చాయని సూర్య తెలిపారు. ఈ సమాచారం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

read  more: Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ వార్‌.. చిచ్చు పెట్టిన కలెక్షన్లు, మొత్తం రచ్చ రచ్చ

also read: Allu Arjun: `తండేల్‌`కి బన్నీ మార్పులు?, సాయిపల్లవి ఎపిసోడ్‌ హైలైట్‌.. వర్కౌట్‌ అయితే బ్లాక్‌ బస్టర్‌, లేదంటే
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved