- Home
- Entertainment
- Allu Arjun: `తండేల్`లో బన్నీ కీలక మార్పులు?, సాయిపల్లవి ఎపిసోడ్ హైలైట్.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టర్
Allu Arjun: `తండేల్`లో బన్నీ కీలక మార్పులు?, సాయిపల్లవి ఎపిసోడ్ హైలైట్.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టర్
Allu Arjun For Thandel: `తండేల్` సినిమాలో అల్లు అర్జున్ మార్పులు చేశారా? సాయిపల్లవిపై వచ్చే ఆ సీన్లే సినిమాకి హైలైట్‌గా ఉండబోతున్నాయా? ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
allu arjun changes in thandel movie
Allu Arjun For Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా `తండేల్` చిత్రంలో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీఏ2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మత్య్సకారుడి రియల్ లైఫ్ పాత్రని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు.
ఈ నెల 7న సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాని అల్లుఅర్జున్ చూశారట. ఆయన మార్పులు చేసినట్టు సమాచారం. మరి ఆ కథేంటో చూద్దాం.
thandel movie
`తండేల్` మూవీ ఒక మత్య్సకారుడు(తండేల్ రాజు) కథ అని చెప్పొచ్చు. అతని లవ్ స్టోరీ, అలాగే చేపలు పట్టేందుకు వెళ్లి సముద్రంలో పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయి అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనేది ఈ మూవీ కథ అనేది ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది.
ట్రైలర్‌లో చూపించింది కాదు, ఇంకా చాలా కథ ఉందని, చాలా ఎమోషనల్‌గా ఉంటుందని నిర్మాత బన్నీవాసు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈమూవీలో హైలైట్ పాయింట్ ఏంటో తెలిసిపోయింది.
Sai Pallavi starrer Thandel film
`తండేల్` సినిమాలో సాయిపల్లవి రోల్ మెయిన్ హైలైట్‌గా ఉండబోతుందట. సెకండాఫ్‌లో సాయిపల్లవిపై వచ్చే ఎమోషనల్ సీన్లు సినిమాకి ఆయువుపట్టు అని, పాకిస్తాన్ జైల్లో ఉన్న నాగచైతన్యని విడిపించుకునేందుకు సాయిపల్లవి ఢిల్లీ వరకు వెళ్తుందట. సుష్మస్వరాజ్ కూతురుని కలుస్తుందట.
అప్పట్లో సుష్మస్వరాజ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె కూతురుని కలిసి పాకిస్థాన్ జైల్లో ఉన్న చైతూని విడిపిస్తుందని, దీనికోసం సాయిపల్లవి పాత్ర చేసే పోరాటం, పడే స్ట్రగుల్స్ వేరే లెవల్లో ఉంటాయని, ఎమోషనల్ సీన్లు కన్నీళ్లు పెట్టిస్తాయని తెలుస్తుంది.
Sai Pallavi, Thandel
సినిమాకి అదే హైలైట్ పాయింట్ అట. ఆయా సీన్లలో సాయిపల్లవి నటన అదిరిపోతుందని, ఆడియెన్స్ కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని తెలుస్తుంది. ఓ రకంగా ఈ మూవీకి సాయిపల్లవినే హీరో అని, అంతగా ఆయా సీన్లు, ఆమె నటన ఉంటుందని తెలుస్తుంది. బేసిక్‌గా సాయిపల్లవి సినిమా చేసిందంటేనే ఆమె పాత్ర బలంగా ఉంటుంది.
అలా ఉంటేనే చేస్తుంది. కాబట్టి ఇందులోనూ ఆమె డామినేషన్ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే చైతూ కూడా ఇరగదీశాడని, అది సర్ప్రైజింగ్‌గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో ఆ ఎపిసోడ్ వర్కౌట్ అయితే మూవీ వేరే లెవల్‌లో ఉంటుందని, లేదంటే డిజప్పాయింట్ చేయడం పక్కా అంటున్నారు.
allu arjun
ఇదిలా ఉంటే ఈ మూవీని ఇండస్ట్రీలో కొంత మందికి చూపించారు మేకర్స్. అల్లు అరవింద్ క్లోజ్ టీమ్ చూసింది. అలాగే అల్లు అర్జున్ కూడా సినిమాని చూశాడట. ఆయన కొన్ని మార్పులు చెప్పాడట. సినిమా చాలా ఎమోషనల్‌గా, సీరియస్‌గా ఉంది. చాలా డ్రై గా వెళ్తుంది. ఏదైనా ఫన్ యాడ్ చేయాలని చెప్పాడట. దీంతో ఆ తర్వాత అక్కడక్కడ కామెడీ సీన్లని యాడ్ చేశారట.
ఆయా సీన్లు సినిమాకి రిలీఫ్‌నిచ్చేలా ఉంటాయని తెలుస్తుంది. ఇటీవల `తండేల్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీ రావాల్సి ఉంది. కానీ ఆయన వచ్చి హైప్ పెంచితే సినిమా ఆ స్థాయిలో లేకపోతే డిజప్పాయింట్ అవుతుందని భావించి వెనక్కి తగ్గినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
read more: చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ వార్.. చిచ్చు పెట్టిన కలెక్షన్లు, మొత్తం రచ్చ రచ్చ
also read: మీ టీఆర్‌పీ స్టంట్స్ ఇకనైనా ఆపండి, `జబర్దస్త్` రష్మికి నెటిజన్లు కౌంటర్లు, ఏం జరిగిందంటే?